నేర్చుకుందాం
నేర్చుకుందాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 19 March 2017
భాస్కర శతకములోని పద్యములు - కె. లక్ష్మీఅన్నపూర్ణ
అక్కరపాటు వచ్చు సమయంబున చుట్టము లొక్కరొక్కరిన్
మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ!
యొక్కట నీటిలో మెరక నోడల బండ్లును బండ్ల నోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!
భావము:్భస్కరా! అవసరం వచ్చినపుడు బంధువులు పరస్పరం ప్రేమతో సహకరించుకుంటూ రక్షించుకోవడమన్నది స్నేహ విషయంలో తగినదే. ఒక్కొక్కప్పుడు నీళ్లలో నడిచే ఓడల మీద బండ్లూ, నేలమీద నడిచే బండ్లమీద ఓడలూ పయనించడం అవశ్యమే కదా!
భాస్కర శతకములోని పద్యములు - కె. లక్ష్మీఅన్నపూర్ణ