భక్తి కథలు

కాశీఖండం 170

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విశాలాక్షీదేవి విశే్వశ్వర దేవుడి వాక్కులు విని ‘‘మహాప్రసాదం’’ అని సకల ప్రాణులలోను అంతర్యామి అయి వుంటుంది కాబట్టి కాశీనగరంలో గృహిణి గృహస్థుల అంతరంగాల్లో వసించి భిక్ష ప్రదానానికి అవరోధించు కారణం అయి వుంది. అక్కడ అపర నారాయణుడైన బాదరాయణుడు కాలోచితాలైన ప్రాతఃకాల కృత్యాలను తీర్చుకొని, సూర్యోదయం కాకపూర్వమే గంగానదిలోని చక్ర పుష్కరిణి లేక మణికర్ణికా తీర్థంలో అఘమర్షణ స్నానం ఆచరించాడు. సూర్యబింబం అర్దోదయవేళలో సంధ్య వార్చాడు. నిష్ఠతో కటి బంటి నీటిలో నిలిచి అష్టోత్తర గాయత్రి జపించాడు. అనంతరం అగ్ని కార్యం నిర్వర్తించాడు. శివమూర్తిని పూజించాడు. శివమూర్తిని పూజించాడు. మధ్యాహ్న సమయం అయేవరకూ ముక్తి మంటప మధ్యలో కూర్చుండి శివపురాణం పఠించాడు.
శీఘ్రంగా కుట్టిన మోదుగాకు విస్తళ్లు, జోలెలు, దాగరలు, కుండలు, తామరపాకులు, పోక పొత్తులూ, గంపలూ, చేత తాల్చి తోడయి వేదపఠనం కావిస్తూ చేరి, వైశంపాయనుడు, జైమిని ఆదిగాల శిష్యులు అత్యంతమూ భక్తితో కొలువగా భిక్షాయాత్రకోసం వ్యాస మహర్షి బయలుదేరాడు.
అఖిల విద్యలకి గురువైన వేదవ్యాస మహర్షి తాను, శిష్యులున్ను, పట్టపగలు తీవ్రంగా తీక్షణంగా కాసే చీరెండలో కాశీ విప్ర గృహవాటికల్లో భిక్షాటనం కావిస్తాడు. ఛాత్రులు లేక శిష్యులైన పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు- ఆదులు పాత్రలు చేపట్టి కాశిలో అన్ని దిక్కుల భిక్ష వేడుకోగా బాలచంద్రవౌళీ, కాశీకి అధీశ్వరుడు అయిన శివుడి పురంలో చిత్రం- చిత్రాతి చిత్రం- అన్నం లభించలేదు. చివరికి వ్యాస మహర్షికి కూడ భిక్ష చేకూరలేదు.
వ్యాస మహర్షి కాశీనగరంలో ‘్భక్షాంప్రదేహి’ అంటూ ఇల్లిల్లూ తిరిగాడు. ఒట్టుపెట్టినట్లు ఏ ఒక్క స్ర్తి కూడా పిలిచి ఒక పట్టెడు అన్నం పెట్టలేదు!
భిక్షాటన చేస్తూ వుండగా ఒక యిల్లాలు ‘వండుతున్నాం’ అని జవాబిచ్చింది. మరొక గృహిణి మరలా రండి అని బదులు పలికింది. మరొక సాధ్వి ‘నేడు మా యింట దేవతారాధాన’ అంటూ వాకిలి తలుపుని తెరవదు.
ఈ వడువున అదృష్టహీనుడు ధనాన్ని వలె, భిక్షాన్నం లభించక మఠానికి మరలిపోయి ఆకలి బాధచే బాధింపబడే మనస్సు కలవాడై వేదవ్యాస మహాముని శిష్యుల్ని పిలిపించి, ఈ గతి వచించాడు.
‘‘మహర్షులారా! ఈ కాశీలో బ్రాహ్మణ వాటికల్లో మీకు మధ్యాహ్న కాల భిక్ష లభించిందా? లేక ఈ పెను వల్లకాటిలో (మహాశ్మశానంలో) వీధి వీధులా నాకు వలెనే మీకున్ను భిక్ష లభింపలేదా?
కరవు, కాటకం ఏర్పడిన రోజుల్లో కూడ ఇల్లు త్రొక్కి వచ్చిన అతిథికి అన్నం పెట్టక పంపని ఇల్లాలు, ఇంటిలో పురుడు వచ్చినా కూడా భిక్ష వెయ్యక పంపని గృహిణి, గృహంలో పీనుగు పోయినప్పుడయినా పెట్టక పంపని సాధ్వి, సామూహికంగా సంభవించిన, కలరా మున్నయిన వ్యాధులు వచ్చినప్పటికీ భిక్ష ఒసగకక పంపని మగనాలు, రాజు ఆకస్మికంగా అపరాధ రుసుములు వసూలు చేయించి తీసుకొన్న సందర్భంలో కూడా పెట్టక పంపని ముత్తయిదువ, ఇల్లు పరశురామ ప్రీతి అయినా భిక్ష పెట్టకుండా పంపని పుణ్యస్ర్తి, తండ్రి తల్లుల పితృకార్యవిధి (ఆబ్దికం) అయినప్పటికిన్నీ పెట్టక వట్టి చేతులతో పంపిన ఇల్లాలు కాని, ఇంటిలో ముట్టు అంటు ఏర్పడిన సమయంలో కూడా భిక్ష వేయక పంపని గృహిణి అకాలంలో వచ్చిన సందర్భంలో కూడా పెట్టక పంపని గృహిణి, గృహదేవతలకి ముడుపు కట్టిన సందర్భంలోనైనా పెట్టక పంపని ఇల్లాలు-

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి