భక్తి కథలు

కాశీఖండం 183

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాధి నుంచి బయటపడిన రీతిగా చెవిలో రుద్రాక్ష మాల చుట్టుకొని ఆ విప్రుడు దోహరిబంటుని (బంటు అయిన చండాలుడిని) దీవింపబోతున్నాడు. ఈ రీతిగా కడు భక్తి ప్రస్ఫుటం అయేటట్టు పలు రకాలైన నటనలు విస్తారం కాగా కడ జాతివాడున్ను అగ్రజాతివాడున్ను గంగాతీరాన అర్హసత్కారాలు నడుపుతున్నారు.
అనంతరం పరద్రవ్యాపహరణం అనే లోభగ్రహం చేత మ్రింగబడిన వాడై ఆ విప్రబ్రువుడు చండాలుణ్ణి కడగంటి చూపుతో వీంచి నిరాశా లక్షణాన్ని అభినయిస్తూ ‘‘ఓదోహరీ! నాకు ధనాశ లేదు. మా వంటి వాళ్లకి ఆయవారం, శిలోంఛవృత్తి చాలు- మట్టిముద్దని బంగారాన్ని సమ దృష్టిలో చూసేవారి ధనంమీద ఆశ కలుగుతుందా?’’ అని మహానంది తన లోభగుణాన్ని మరుగుపుచ్చ పూనుకొన్నాడు. ఆ చందంగా మనస్సుకి చిక్కబట్టి వుంచలేకపోయాడు.
అయితే అయింది, ఏ రూపంలో ద్రవ్యం తీసుకొని ఏతెంచావు? బంగారు దిమ్మలు తెచ్చాను- తెస్తే తెచ్చావు- ఎంత బంగారం ఇవ్వగలవు? ఎంత ఒసగితే చిత్తానికి తృప్తి కలుగుతుందో అంత బంగారం ఇస్తాను. మంచిది, బంగారు దిమ్మల సంచులు ఏవి? అదుగో- ఆ పెట్టె నిండా వున్నాయి. ఆ, టంకాల సంచులు వుండనీ! ఎందరో అర్హులు? నేను ఒక్కడినేనా? నువ్వు కాక ఇంకా ఎందరు కావాలి?’’ అంటూ ఒకడు ద్రవ్యాశతోను మరొకడు దాతృత్వ గుణంతోనూ మంతనాలు ఆడసాగారు.
అంత ధనకాంక్షతో ఆ బ్రాహ్మణుడు ఉన్నదంతా ఊడ్చుకొన తలపోస్తూ ఆ పుల్కసుడితో ఈకరణి వచించాడు. ఈ అర్థం అంతా నేనే స్వీకరించేవాణ్ణి. ఇంకొకడు కలిస్తే నీ సొమ్మును నేను ప్రతిగ్రహించను సుమా!’’ అని పలికాడు. చండాలుడు అందుకు అంగీకరించాడు. మణికర్ణికా తీర్థం దరిని, ఆవు పేడతో చేపట్టు కావించి, సూర్య కిరణాల కాంతితో ప్రకాశిస్తున్న పదారవ వనె్న బంగారాన్ని కుప్పపోసి చతురస్రంగా లేక చదరంగా చేసిన ఆ చే పట్టుమీద ఆ విప్రుణ్ణి నిలిపి, గంగాజలాలలో అతడి పాదాలు కడిగి, చందనంతోను, పూలమాలలతోను, అక్షతలతోను అర్చించి, ఆ మహాదానాలను ధారా జలపూర్వకంగా విశాలాక్ష్మీ సమేతుడైన విశే్వశ్వరుడు సంప్రీతుడు అగుగాక!’’ అని పలికి ఆ బ్రాహ్మణుడికి దానమివ్వగా ఆ బాపడున్నూ సంతుష్టాంతరంగుడు అ నిజ నివాసానికి అరిగాడు. చండాలుడు తన దేశానికి వెడలిపోయాడు.
అనంతరం- అధికమైన బంగారాన్ని ఇతడు దానంగా ప్రతిగ్రహించాడు, గంగానదీ సమీపంలో; ఈ ధరణీ సూరుడు బ్రాహ్మణ కులానికి వెలిసుమండీ! అని కాశీపుర విప్రులు చాటింపు వేయిస్తారు. చండాలుడి వల్ల కనకం దానంగా పొందిన ఈ చండాల బ్రాహ్మణుడు సాక్షాత్తూ జగంలో చండాలుడే! బ్రాహ్మణులు అందరూ వీడు కాశీనగరంలో వుంటే మేము వుండమని అంటారు.
ఈవిధంగా కాశీనగరంలో భూతాన్ని కాంచి ఆక్రోశించినట్టుగా కనినవారు అందరూ తన్ను దూషింపగా విని విని విసుగు చెంది వేసారిపోయినారు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి