డైలీ సీరియల్

బడబాగ్ని 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతవరకూ వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన నాలుగు హత్యలూ, ఐపిఎస్ ట్రైనీ ఆఫీసర్స్ అమర్, ఇంద్రజిత్ హత్యలూ, వారం రోజుల క్రిందట హైదరాబాద్ తాజ్ హోటల్‌పైనుంచి జారిపడి మరణించిన కమల్ అనే క్రైం రిపోర్టర్ మరణం, అతనితో మాట్లాడి రాత్రి అక్కడనుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదంవలన మరణించిన మహేష్ మరణం, ప్రమాదవశాత్తు జరిగినవిగా నిర్థారించి కేసు క్లోజ్ చేసినప్పటికీ, ఆ రెండూ కూడా ఒక పథకం ప్రకారం, కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ అని నా పరిశోధనలో తేలిన విషయాలు.. కమల్ ముందు జరిగిన నాలుగు మిస్టీరియస్ మర్డర్స్ విషయంలో ఎలిబీగా గుర్తించి, ఆ వరుసలో తదుపరి హతుడిగా అనుమానించి కలసి మాట్లాడిన కొద్దిసేపటికే కమల్‌నీ, అతనినీ కూడా చాలా తెలివిగా అది ఒక యాక్సిడెంట్ అనే విధంగా చంపినది నిజం.
కానీ ఆ హంతకుడు ఎవరన్నది ఇంకా తెలియవలసిన విషయం.. నేను అతి త్వరలో అది కూడా తప్పక కనిపెడతాను. కానీ అనుకోని విధంగా ఆ హంతకుడి చేతిలో నా మరణం తప్పకపోతే.. నేను కనుగొన్న నిజాలు నాతో అంతం అవకూడదనే ఈ నా ప్రయత్నం.. యింకొక ముఖ్యమైన విషయం కమల్, మహేష్ కలిసి మాట్లాడుకున్న తాజ్ హోటల్ గదిలో గుర్తుతెలియని హంతకుడి ప్లాన్ ప్రకారం ఏసి పైప్ ద్వారా గదిలోకి పంపిన మత్తు పదార్థం వల్లనే మత్తు తలకెక్కి, అటు కారు నడిపిన మహేష్, ఇటు ఆ మత్తులో బాల్కనీలో నాతో ఫోన్ మాట్లాడబోయిన కమల్ దుర్మరణం పాలుఅయ్యారని నేను నా పరిశోధనలో నిర్థారించిన విషయం.. అయితే అది ఎవరు, ఎందుకు చేశారన్నది ఇంకా వెలుగులోకి రావలసిన విషయం.. అసలు ఈ సంఘటనలకి మూలం డెహ్రాడూన్ ఐపిఎస్ ట్రైనీ ఆఫీసర్స్ సెంటర్ అన్నది నా ప్రగాఢ విశ్వాసం.. వాటిపై ఎంక్వైరీ చెయ్యగలరు.. ఇది నా పూర్తి ఆరోగ్యకరమైన మానసిక స్థితిలో వ్రాస్తున్న వాగ్మూలం.. -ప్రొ. రాహుల్.
మొత్తం రికార్డ్ చేశాక ఓసారి విన్నాడు. చాలా సంతృప్తికరంగా అనిపించింది. అదే విషయం ఒక పేపర్‌పై రాసి సంతకం పెట్టి కవర్ క్లోజ్ చేశాడు.. ఎందుకైనా మంచిది.. పోలీసులకి ఇచ్చే ఈ వాగ్మూలం అజిత్, అనే్వష్‌లకు కూడా మెయిల్ పెడదాం. నాకు ఏదైనా జరిగితే పోలీసులు పట్టించుకుని ఈ కేసు దర్యాప్తు చెయ్యకపోయినా వీళ్ళు తప్పక సీరియస్‌గా తీసుకుంటారు అనుకుంటూ వాళ్ళకి మెయిల్ పెట్టేశాడు వెంటనే. అప్పుడతనికి చాలా సంతృప్తికరంగా అనిపించింది. అవి రెండూ తన బ్యాగ్‌లో రహస్య అరలో భద్రపరచి... హాయిగా భోజనం చేసి ప్రశాంతంగా పడుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు.. మామూలు వ్యక్తి తనకే ఇంత జాగ్రత్త, యిన్ని ఆలోచనలూ ఉంటే, అనుక్షణం నేర ప్రపంచంలో తిరిగే కమల్‌కి ఇంకెంత ముందుచూపు ఉంటుంది... తప్పకుండా అతను సేకరించిన సమాచారం, ఆధారాలూ ఏదోవిధాన, ఎక్కడో అక్కడ భద్రపరచే ఉంటాడు.. కాస్త మనసు పెట్టి ఆలోచించి, వెదికితే తప్పకుండా దొరుకుతాయి.. యిక్కడ యిక తనుండి చేసే పనులేం లేవు. సో రేపు ఐజీ ఆఫీస్‌కి వెళ్లి, వాళ్లని కలిసి తను సేకరించిన విషయాలు చెప్పి, తను దాచిన పరిశోధన వివరాలు వారికి అందజేసి తను తన ఇంటికి వెళ్లి ఒకసారి కమల్ బ్యాగ్ చెక్ చేయాలి. తనకెందుకో తప్పకుండా అందులో చాలా ముఖ్యమైన విషయం తెలుస్తుందనిపిస్తోంది. రేపు వెళ్లి వెదకాలి.. ఆ హంతకుడిని ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిది.
మర్నాడు ఉదయానే్న తయారై కమల్ డెత్ కేస్ టేకప్ చేసి, ఏక్సిడెంట్స్‌గా క్లోజ్ చేసిన పోలీసు స్టేషన్‌కి వెళ్ళేడు. తను ఫలానా అనీ, తను వచ్చిన పని ఇది అని చెప్పినా అతనికి అక్కడ పెద్దగా స్పందన కనిపించలేదు. అవన్నీ జాగ్రత్తగా ఎంక్వైరీ చేశాక వాటిని యాక్సిడెంట్స్‌గా నిర్థారించడం జరిగింది.. సో మళ్లీ ఆ కేస్ రివోపెన్ చేసే అగత్యం లేదు అన్న వాళ్ళ మాటలకి ఏం చెయ్యాలో, ఏ రకంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు రాహుల్‌కి.
రాహుల్‌కి చాలా నిరాశగా అనిపించింది.. ఏమిటిది? ఎంత శోధించినా ఏదో ఒక క్లూ దొరికి చెయ్యిజారిపోతోది.. ఏదో కనిపెట్టేం అన్న ఉత్సాహంతో హంతకుడు దొరుకుతాడేమో అన్న ఆశతో కొన్ని క్లూస్ ఇచ్చినా పోలీసుల నుంచి స్పందన ఇలా ఉంటే.. ఇంక ఈ కేస్ సాల్వ్ చెయ్యగలమా.. అన్యాయంగా కమల్‌ని బలిపెట్టడమే జరిగిందా.. లేదు అలా ఎంతమాత్రం కాకూడదు.. కమల్ ప్రణవ్ కుటుంబాన్ని కలవలేదు.. వాళ్లని కలిస్తే అతని హత్యకు సంబంధించిన వివరాలేమైనా తెలుసుకుంటే.. ఈ అనే్వషణలో కొంత ముందుకు వెళ్లగలమేమో చూద్దాం.. అతను ఆ ఆలోచన వచ్చిందే తడవుగా విజయవాడ బయలుదేరాడు.. తన దగ్గర వున్న ప్రణవ్ హత్య వివరాలతో.. అతని చిరునామాతో వున్న పేపర్ కటింగ్స్‌తో...
విజయవాడ నడిబొడ్డున అన్ని హంగులతో ఉన్న బంగ్లా ముందు నిలిచాడు రాహుల్ ఆ చిరునామా ఆధారంగా... ప్రణవ్ భార్యని కలిసిన అతనికి ఏ వివరాలూ దొరకలేదు. అన్ని కేసుల్లోలాగే.. ఆమె కంటతడి పెట్టడం తప్ప ఏమీ చెప్పలేకపోయింది.. ఆమెనడికి ఆనాటి వాళ్ళ కారు డ్రైవర్ అన్వర్ అడ్రెస్ తీసుకుని అతనిని కలిశాడు రాహుల్. వివరాలడిగిన రాహుల్‌ని చూసి భయపడిపోయి తనకే పాపం తెలియదనీ.. తన యజమానిని ఎవరు చంపారో, ఎందుకు చంపారో తనకి ఇప్పటికీ అర్థం కావడంలేదనీ.. పోలీసులు తనమీద అనుమానంతో తనని చిత్రహింసలు పెట్టి.. చివరకు తను నిరపరాధి అని అర్థం చేసుకుని వదిలేశారని చెప్పి కంటతడి పెట్టాడు..

- ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్