భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పటం ఆపి అందరినీ కలియజూసాడు సూతమహర్షి!
ఏకాగ్రతతో కన్నులరమూసి మణికంఠుని పావన చరితలో తాదాత్మ్యం చెంది వింటున్న నైమిశారణ్యవాసులందరూ మెల్లగా కనులు విప్పి సూతమహర్షి వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశారు!
‘‘మహర్షి! మీ నోట హరిహర పుత్రుడు మణికంఠుని పావన చరితాన్ని విని ధన్యులమైనాము! స్వామి బాణాన్ని విడిచి అంతర్థానం చెందిన తర్వాత ఏం జరిగింది? పందల రాజు నిర్మాణం ప్రారంభించాడా? ఆ వివరాలు కూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అన్నారు.
‘‘తప్పకుండా చెబుతాను, వినండి!’’ అంటూ సూతమహర్షి చెబుతుంటే శ్రద్ధగా వినసాగారు నైమిశారణ్యవాసులు!
****
నాలుగవ అధ్యాయము
రాజశేఖరునికి అగస్త్య మహర్షి ఉపదేశము
‘‘మణికంఠా! పుత్రా! ఎక్కడికి వెళ్లిపోయావు కుమారా? పులిపాలు తెస్తానంటూ వెళుతుంటే నిన్ను ఆపలేకపోయిన అసమర్థుడిని! మామీద కోపంతో వెళ్లిపోయావు కదూ! నిన్ను పందల రాజ్య సింహాసనం మీద కూర్చుండబెట్టి, రాజఠీవితో నీవు వెలిగిపోతుంటే చూడాలని ఎంతగానో ఆశపడ్డానే, ఆ ఆశను నిరాశ చేసి వెళ్లిపోయావ్! నామీద ఎందుకంత కఠినత్వం చూపావు? ఒక్కసారి నీ ముద్దు ముఖాన్ని చూపించు! రాకుమారా! ఇప్పుడే తప్పటడుగులు వేస్తూ నా ఒడిలో వచ్చి వాలి నేను తనివితీరా ముద్దాడే లోపల లేచి పరుగులు తీస్తున్నావు, పట్టుకోమని కవ్విస్తూ! నీ వెంట పరుగులు తీసే శక్తి లేదు ఈ వృద్ధునిలో అని తెలిసీ నన్ను ఆరడి పెట్టవచ్చునా? ఆగు పుత్రా! నేనూ వస్తున్నాను నీ వెంట!’’ మంచంమీదినుంచి చటాలున లేచి ‘‘పుత్రా! ఆగు!’’ అంటూ పరుగెత్తబోయిన రాజశేఖరుడిని అతి ప్రయత్నంమీద ఆపి తిరిగి పడుకోబెట్టారు రాణి, పరిచారికలు!
రాజవైద్యుడు నాడి చూసి ఏదో ఔషధాన్ని తీసి తాగించాడు!
‘‘రాకుమారుడు వెళ్లిపోవడంతో మానసికంగా చాలా క్రుంగిపోయినారు మహారాజు! ఆ విచారం నుండి తేరుకోకపోతే పరిస్థితి విషమించవచ్చును’’ అని చెప్పడంతో ఇప్పుడేం చేయాలి? ఎట్లా వారికి మానసిక చింతనను దూరం చేయడం? ఎవరందుకు సమర్థులు?’’ ఆందోళనగా అడుగుతున్న ఆమెకు జవాబివ్వలేక వౌనంగా నిలిచాడు రాజవైద్యుడు!
సరిగ్గా అప్పుడే, ‘‘దయచేయండి మహర్షి! సరైన సమయానికి వచ్చారు మీరు!’’ అని మర్యాదపూర్వకంగా చెబుతూ లోపలకు వచ్చాడు మంత్రి అగస్త్య మహర్షి వెంటరాగా!
సంభ్రంగా లేచి నమస్కరించింది రాణి!
‘‘మహర్షులకు ప్రణామాలు! మహారాజు మానసికంగా కుమిలిపోతున్నారు మహర్షి! వారికి మీరే నచ్చచెప్పగల సమర్థులు! ఈ సమయంలో మీరు ఇలా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను!’’ అన్నది రాణి భారమైన స్వరంతో!
రాజువైపు గంభీరంగా చూసి ఎదురుగా ఆసనంమీద కూర్చున్నాడు అగస్త్య మహర్షి!
‘‘రాజా! కన్నులు తెరువు! లేచి కూర్చో! నేను నీ పుత్రుని సందేశం తీసుకుని వచ్చాను నిన్ను చూడటానికి! కలత తీరి కూర్చో రాజా!’’ అన్నాడు!
ఆ మాటలు మంత్రంలా పనిచేశాయి!
రాజు కన్నులు విప్పాడు!
‘‘ఏడీ నా పుత్రుడు? ఎప్పుడు వస్తున్నానని సందేశం పంపాడు?’’ ఆత్రంగా అడుగుతూ లేచి కూర్చున్నాడు!
ఎదురుగా కూర్చుని తనవైపే నిశితంగా చూస్తున్న అగస్త్య మహర్షి కనిపించడంతో భక్తిపూర్వకంగా నమస్కరించి ‘‘స్వామీ! మీరు నా మణికంఠుని సందేశం తీసుకువచ్చారా? నిజమా! నా చెవులు సరిగా విన్నయ్యా ఆ మాటలు?’’ అడిగాడు అయోమయంగా చూస్తూ!

-ఇంకాఉంది

...............................................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003