నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అమిషమని దానిం గొనఁ
గామది సమకట్టి యొక్క ఖగ మాఖగమున్
వ్యోమమునఁ దాఁక దివిసం
గ్రామం బారెంటి కయ్యెఁ గడురభసమునన్

భావం: వసురాజు యొక్క వీర్యాన్ని ఒక ఆకుదొప్పలో ఉంచి డేగ మెడకు దానిని కట్టి గిరికకు ఇవ్వుమని ఉపరిచరుడు చెప్పి డేగను పంపించగా మధ్యలో మరొక డేగతో పోరు చేయాల్సివచ్చింది.

క. సునిశితతుండహతిని అప
స్సిన వర్ణ పుటంబు వాసి చెదరుచు నృపనం
దనువీర్యము యమునానది
వనమధ్యమునందు వాయువశమున బడియెన్
భావం: ఆ డేగలు రెండూ ఆకాశంలో పోరు చేస్తుండగా మిక్కిలి పదునైన పక్షిముక్కు యొక్క దెబ్బచేత ఆ ఆకుడొప్ప చెదిరిపోయి వసురాజు వీర్యం యమునా నది నీటి మధ్యలో గాలి వాటున పడిపోయింది. అలా ఉపరిచరుడు అనుకున్న దానికి విరుద్ధంగా జరిగింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము