భక్తి కథలు

హరివంశం - 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ తోడేళ్లు పది, ఇరవై, ముప్ఫై గుంపుగా తిరుగుతూ గోవులకూ, దూడలకూ ప్రాణభయం తెచ్చిపెట్టాయి. గోపకులు కూడా అవి ఎక్కడ వచ్చి తమ ఆవులను చంపి తింటాయో అని కలత చెందారు. ఎక్కడ విన్నా మా ఆవునీడ్చుకొని పోయినాయనీ, మా దూడను తీసుకొని పోయినాయని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
ఆవులు వేకువ పచ్చిగడ్డి మేయటానికి కొష్టాలు వదిలిపోవటం లేదు. పాలకావళ్ళు ఊళ్ళో కనపడటంలేదు. పులిని కూడా లెక్కబెట్టని ఆబోతును కూడా ఈ తోడేళ్ళు చుట్టుముట్టి గాయపరుస్తున్నాయి, చంపటానికి చూస్తున్నాయి. అవి బితుకు బితుకుమంటూ వ్రేపల్లెలో గగ్గోలు పుట్టింది. నలుగురొక చోట కలిసినపుడు బృందావనం ఇక్కకు దగ్గరే కదా! అక్కడ మనం నిర్భయంగా బతకవచ్చు. నీటి వసతికి కొదువలేదు. ఆవులకు బోలెడు పచ్చిక బయళ్లున్నాయి. చెట్టూ చేమలతో పచ్చగా కలకలలాడే ప్రాంతమది.
కాని అక్కడ కూడా భీకరారణ్యాలలో భయంకర రక్కసులు నివాసముంటారని చెప్పుకుంటున్నారు? ఇపుడో మన కర్తవ్యం ఏమిటి? అని గోపాలకులు గుజగుజలు పోతున్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఒక్క రోజు కాదు కదా ఒక్క గడియ, ఒక్క క్షణం కూడా మనం ఉండకూడదు అని పరస్పరం హెచ్చరించుకుంటున్నారు వ్రేపల్లె వాసులు.
ఆ సమయంలో నారద మహర్షి వ్రేపల్లెకు వేం చేశాడు. నందుణ్ణి ఏకాంత ప్రదేశానికి తీసుకొనిపోయినాడు. నందుడికి నారద మహర్షి రాకతో ప్రాణం లేచి వచ్చింది. నారదుడిపట్ల సాంజలియై తన భక్తి వినయ వర్తనం చూపాడు. నారద మహర్షి పరమ ప్రీతుడై ఆదరంతో నందుడి మనస్సుకు స్వస్థత కలిగించాడు.
వ్రేపల్లె మాకు అచ్చివచ్చింది. ఇక్కడ ఇప్పటివరకు గండాలన్నీ గడచి చల్లగా ఉన్నాం. కాని ఇపుడు ఇక్కడ ఉండలేని పరిస్థితులు దాపురించాయి. బృందావనానికి వెళ్లక తప్పనిసరి అనిపిస్తున్నది. పోనీ అక్కడకు పోయి ఉందామా? అంటే అక్కడ చాలామంది రాక్షసులు తమ నివాసంగా ఉంటున్నారని తెలుస్తున్నది. అందువల్ల ఎటూ పాలుబోక ఆందోళన చెందుతున్నావు, భీతిల్లుతున్నావు అని నాకు తెలిసి నీ దిగులు తీర్చటానికే వచ్చాయనయ్యా నందరాజా! అని నారదుడు నందగోపుడి భయం తీర్చాడు.
బృందావనానికి తప్పక వెళ్ళవలసిందని దిటవు చేకూర్చాడు. ‘నీ కొడుకు నెట్లా కాపాడుకోవాలని ఆర్తి చెందుతున్నావు, ఆందోళన పడుతున్నావు, తపన పడుతున్నావు’. ఈ విషయంలో నీ భయం తీర్చటానికే నేనిట్లా నీ దగ్గరకు వచ్చాను, నందరాజా! నీ కుమారుడు సాక్షాత్తు నారాయణుడయ్య! ఆదిదేవుడు సుమా! భూభారం తొలగించటానికీ, దుర్మార్గులైన రాక్షసులను సంహరించటానికీ క్రీడాబాలుడై నీ ఇంట అవతరించాడు. మనుష్యమాత్రుడని అనుకోవద్దు. బలరాముడు కూడా దైవస్వరూపుడే. తమ్ముడంతటివాడే.
కృష్ణుడికి సహాయంగా క్రీడాలోలతకై ఉద్భవించాడు. ఇదివరలో నీవు చూడలేదా, పూతన, శకటాసురుడు, రాక్షసాంశతో కృష్ణుడికి హాని సేయటానికి సిద్ధమైన జమిలి మద్దులు ఏ విధంగా వినాశం పొందారో! అట్లనే ఇంకా ఎందరో రాక్షసులు ఈ దివ్య తేజుడివల్ల హతం కావలసి ఉంది. ఇది దేవ రహస్యం. నీ మీద నాకు అభిమానం వున్నందువల్లనే ఈ విషయాలు నీకు చెప్పటానికి వచ్చాను. కాబట్టి ఎటువంటి శంకలూ నీకు వద్దు. బృందావనానికి వెంటనే తరలిపోవలసింది అని నారదుడు నందుడికి బోధించాడు. ఇక అక్కడనుంచి కృష్ణుణ్ణి దర్శించటానికి వెళ్ళాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు