యువ

విజయాల వేకువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడంటే, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడన్నమాట. మరి, ఆ పదవిలో ఉన్న బరాక్ ఒబామా ప్రతి రోజూ ఉదయానే్న ఏం చేస్తారు? రాముడు మంచి బాలుడిలా ఒబామా ఉదయానే్న 6.45కల్లా నిద్ర లేస్తారట. కాలకృత్యాలు తీర్చుకుని, నేరుగా జిమ్‌కు వెళ్లిపోతారట. అక్కడ బరువులు
ఎత్తడం వంటి మామూలు వ్యాయామాలతోపాటు గుండెకు బలాన్నిచ్చే కార్డియో ఎక్సర్‌సైజులు కూడా చేస్తారు. తరవాత స్నానం కానిచ్చి, భార్య మిషెల్లే, కూతుళ్లు మాలియా, సషాలతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారట. ఆ తరవాత ఇక రొటీన్ పనుల్లో పడతారట.
===========
కాలం ఎంతో విలువైనది కదా! జీవితంలో సక్సెస్ సాధించిన విజేతల్ని గమనిస్తే, వారిలో చాలామంది రాత్రి ఎంత పొద్దుపోయి పడుకున్నా, ఉదయం మాత్రం పెందరాళే లేస్తారన్న విషయం అర్థమవుతుంది. చాలామంది తెల్లవారుజామున నాలుగున్నర- అయిదు మధ్య లేచి దినచర్యకు శ్రీకారం చుడతారు. దీనికి కారణం లేకపోలేదు. ఉదయం వేళల్లో మనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటుందట. అప్పుడు ఏ పని ప్రారంభించినా, ఉత్సాహంగా పూర్తి చేస్తారట. అందుకే ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్- ఉదయం లేచిన వెంటనే ఆ రోజు చేయాల్సిన పనుల్లో అతి ముఖ్యమైనది, కష్టసాధ్యమనుకున్నదీ చేపట్టమంటాడు.
అయితే ఉదయం లేచిన వెంటనే పనిలో పడిపోకూడదు. శారీరక, మానసిక వ్యాయామం చేస్తే మనసు ఉల్లాసంగా మారుతుంది. అమెరికా అధ్యక్షుడు ఒబామాలా జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేయొచ్చు లేదా క్రిస్టీస్ సిఇఓ స్టీవ్ మర్ఫీలా యోగా చేయొచ్చు. వ్యాయామం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు...మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడిని జయించేందుకు ఇది సరైన మార్గం. అయితే వ్యాయామంలోనూ సంయమనం పాటించాలి. గంటసేపు అదే పనిగా ఎక్సర్‌సైజులు చేయడం కాకుండా, రన్నింగ్, డాన్సింగ్ వంటివి చేస్తే ఆహ్లాదంగా ఉంటుంది. వ్యాయామం అనంతరం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు ఏకాగ్రత అలవడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనకు వచ్చే వ్యాధులలో 90 శాతం వరకూ ఒత్తిడి మూలంగానే అన్నది ఓ సర్వేలో వెల్లడైన వాస్తవం. కాబట్టి వ్యాయామం ముగించిన వెంటనే ఆఫీసు పనులపై పరుగులు పెట్టకుండా ధ్యానం లేదా ప్రేయర్ వంటి విధానాలను ఎంచుకుని, కనీసం పది నిమిషాలు దానికోసం కేటాయించాలి. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఒంటరిగా తినే కంటే కుటుంబ సభ్యులతో కలసి చేసేందుకు మొగ్గు చూపాలి. భార్యాబిడ్డలతో సరదాగా మాట్లాడుతూ, వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ, పిల్లల కెరీర్ ఎలా ఉందో తెలుసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ ముగించడమనేది చాలామంది చేసే పనే. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఆ రోజు చేయాల్సిన పనులను ఓసారి మననం చేసుకోవడం మంచిది. పని విభజన చేసుకుని, ఆఫీసుకు బయల్దేరితే సరి.
గొప్పవాళ్ల దినచర్య
గొప్పవాళ్లు చేసే పనులన్నీ విలక్షణమైనవే. అవి ఆచరణీయం...అనుసరణీయం కూడా. మహాత్మాగాంధీ, బిల్ గేట్స్, విన్‌స్టన్ చర్చిల్, ఆల్‌ఫ్రెడ్ నోబెల్, మార్క్ జుకర్‌బెర్గ్..ఇలా విజేతల జీవిత కథలు చదివితే వారు ఎంత విలక్షణంగా ఉండేవారో అర్థమవుతుంది. ఏ పని చేసినా అందులో ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వారిని నిశితంగా గమనిస్తే సంతోషంగా, హుషారుగా, ఒత్తిడికి గురి కాకుండా ఉంటున్నట్టు అర్థమవుతుంది. ఇదెలా సాధ్యమవుతోంది? ఇదే ప్రశ్నను మానసిక శాస్తవ్రేత్తలను అడిగితే- వారంతా నిద్ర లేచిన వెంటనే వ్యాపార కార్యకలాపాల్లో పడిపోకుండా, వ్యక్తిగతమైన పనులకోసం, శారీరక, మానసిక వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించుకుంటారని చెబుతారు. అవే వారిని రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతాయట.
ఇంతకీ గొప్పవాళ్లంతా ప్రతి రోజూ తమ దినచర్యను ఎలా ప్రారంభిస్తారు? ఉదయానే్న లేచి నేరుగా జిమ్‌కు వెడతారా? పత్రికాపఠనంతో దినచర్యను మొదలుపెడతారా? లేక చక్కగా కాఫీ సేవించి, కాలకృత్యాలు తీర్చుకుని నేరుగా ఆఫీస్‌కు చక్కాపోతారా? ఇవన్నీ ఆసక్తిగొలిపే అంశాలే. అవేమిటో చూద్దాం...
విన్‌స్టన్ చర్చిల్
పొద్దెక్కేదాక లేవడు
బ్రిటన్ ప్రధానుల్లో హాస్య చతురతకు పేరొందిన విన్‌స్టన్ చర్చిల్ రూటే వేరు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. చతురోక్తులు విసరడంలో, అనర్గళంగా ప్రసంగించి సభికులను ఆకట్టుకోవడంలో చర్చిల్‌కు తిరుగేలేదంటారు. ఇంతకీ ఆయన రోజూ ఉదయానే్న ఏం చేసేవారు? పొద్దునే్న లేవడమంటే చర్చిల్‌కు మహా బద్ధకమట. ఆయన ఏడున్నరకు లేచినా, పదకొండు గంటలకు గానీ తన గది నుంచి బయటకు వచ్చేవారు కాదట. అంతసేపూ ఏం చేసేవారనేగా మీ సందేహం? కాఫీ, బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చి, పత్రికలు ముందేసుకుని కూర్చునేవారట. పత్రికాపఠనం పూర్తయ్యాక సెక్రటరీలను పిలిచి వారికి కరస్పాండెన్స్‌ను డిక్టేట్ చేసేసరికి బారెడు పొద్దెక్కేదట.
బరాక్ ఒబామా
వ్యాయామమే ప్రధానం
అమెరికా అధ్యక్షుడంటే, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడన్నమాట. మరి, ఆ పదవిలో ఉన్న బరాక్ ఒబామా ప్రతి రోజూ ఉదయానే్న ఏం చేస్తారు? రాముడు మంచి బాలుడిలా ఒబామా ఉదయానే్న 6.45కల్లా నిద్ర లేస్తారట. కాలకృత్యాలు తీర్చుకుని, నేరుగా జిమ్‌కు వెళ్లిపోతారట. అక్కడ బరువులు ఎత్తడం వంటి మామూలు వ్యాయామాలతోపాటు గుండెకు బలాన్నిచ్చే కార్డియో ఎక్సర్‌సైజులు కూడా చేస్తారు. తరవాత స్నానం కానిచ్చి, భార్య మిషెల్లే, కూతుళ్లు మాలియా, సషాలతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారట. ఆ తరవాత ఇక రొటీన్ పనుల్లో పడతారట.
డేవిడ్ కామెరాన్
పొద్దునే్న టివి చూడటం చిరాకు
బ్రిటన్ ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ మాత్రం ఒబామాకు భిన్నం. ఆయన పొద్దునే్న జిమ్‌కు వెళ్లరు సరికదా ఉదయం ఆరింటికి లేచిన వెంటనే పాలనపరమైన పనుల్లో పడిపోతారు. అలాగని టెలివిజన్‌ముందు కూర్చుంటారనుకునేరు. ఆయనకు పొద్దునే్న టివి చూడటమంటే చిరాకట. ప్రధాని భవనంలో ఉదయానే్న ఎవరూ టివి ఆన్‌చేయరట. ఎనిమిదింటివరకూ ఆఫీస్ వ్యవహారాలు చక్కబెట్టిన అనంతరం భార్యాబిడ్డలతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం కామెరాన్ అలవాటట.
మార్క్ జుకర్‌బెర్గ్
ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం
ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా, చేతికి ఎముకలేని దాతగా పేరొందిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అటు మనసుకి, ఇటు శరీరానికి కూడా పనిచెబుతారట. ఉదయం నిద్ర లేచిన వెంటనే గంట సేపు ట్రెడ్‌మిల్ చేస్తారట. అలా చేసేటప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చూడటం బిల్ గేట్స్‌కు అలవాటు. ట్రెడ్‌మిల్ పూర్తయ్యాక మానసిక ప్రశాంతతకు కూడా కాసేపు టైమ్ కేటాయిస్తారట.
*