రివ్యూ

ఇద్దరూ ఓకే అనిపించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను... శైలజ (ఫర్వాలేదు)

తారాగణం:
రామ్, కీర్తిసురేష్
సంగీతం:
దేవిశ్రీప్రసాద్
నిర్మాత:
స్రవంతి రవికిషోర్
దర్శకత్వం:
కిషోర్ తిరుమల

ఎనర్జిటిక్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రామ్ ఈమధ్య వరుసగా అపజయాలతో సతమతమవుతూ ఉన్నాడు. మంచి హిట్‌కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన లేటెస్ట్‌గా చేసిన ప్రయత్నం నేను.. శైలజ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం న్యూఇయర్ కానుకగా విడుదలైంది. అయతే, కథే కాదు, పాత్రలూ కొత్తవి కావు. సినిమా కొత్తగా వుందని చెప్పాలంటే కథనాన్ని తడిమిచూడాలంతే.
బీచ్‌లో హీరో హరి (రామ్) మందు బాటిల్‌తో కూర్చొని వుంటాడు. తాగడానికి కారణం తెలుసుకోవాలంటే కథ వినమంటాడు. అదే నేను.. శైలజ. కనిపించిన అమ్మాయికల్లా ప్రపోజ్ చేయడం హీరో అలవాటు. అందరిలా తనకూ ఓ లవర్ ఉండాలనేది అతడి ఆంబిషన్. కానీ అందరూ నో అంటూంటారు. అలాంటి టైంలో అదే ఊర్లో శైలుని చూస్తాడు. నవ్విస్తాడు. పండుతున్న టైంలోనే ఫ్యామిలీ వైజాగ్‌కి షిఫ్ట్ అవ్వాల్సి రావడంతో శైలుని మిస్సవుతాడు. ఇక వైజాగ్‌లోనూ అదే విధానం ఫాలో అవుతున్న రామ్ ప్రేమని ఎవ్వరూ ఒప్పుకోరు. దాంతో ప్రేమకి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తాడు. అదే టైములో శైలజ (కీర్తిసురేష్) రామ్ లైఫ్‌లోకి వస్తుంది. హరి చేసిన కొన్ని మంచి పనుల ఇంప్రెషన్‌తో ఇద్దరూ ఫ్రెండ్సవుతారు. ఫైనల్‌గా ఓరోజు ప్రపోజ్ చెయ్యడానికి రెడీ అవుతాడు హరి. ఆమెను బీచ్‌కి రమ్మని ఈలోపు బీర్ కొడుతుంటాడు. బీచ్‌కి వచ్చిన శైలజ అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌చేస్తుంది. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని, లవర్స్‌కాదని తేలుస్తుంది. శైలు నో చెప్పడానికి కారణం తెలుస్తుంది. శైలు సమస్యని తీర్చడానికి హరి ఏంచేసాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? సినిమా చూస్తే తెలుస్తుంది.
రామ్ కెరీర్లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా తనలోని నటున్ని పరిచయం చేసింది మాత్రం ఈ సినిమానే. తను మొదటినుంచి చివరిదాకా ఎవరి సపోర్ట్‌లేకుండా సోలోగా సినిమాని నడిపించాడు. ఎక్స్‌ప్రెషన్స్, మానరిజమ్స్, డైలాగ్ డెలివరీలో చూపిన వైవిధ్యం సింప్లీసూపర్బ్. హరి పెర్‌ఫార్మెన్స్ సెటిల్డ్‌గా వుంది. అతని గత సినిమాల్లో పెర్‌ఫార్మెన్స్‌పరంగా కనిపించే అతి ఇందులో లేదు. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకునే కుర్రాడిగా మంచి మార్కులు కొట్టేసాడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో, డైలాగ్స్‌లో రెగ్యులర్‌గానే అనిపించిన రామ్ కొన్ని ఎమోషన్ సీన్స్‌లో కొత్తగా కనిపించాడు. నేను శైలజ సినిమాకి ఇక కీర్తిసురేష్ చూడటానికి బాగుంది. కానీ తనని ఎనర్జిటిక్ పాత్రలో కాకుండా కామ్, సీరియస్ తరహా పాత్రలో చూపారు. కానీ ఫస్ట్‌హాఫ్ లవ్‌ట్రాక్‌లో మాత్రం స్మైల్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ బాగుంది. సత్యరాజ్ ఓకే డీసెంట్ అనిపించాడు. నరేష్, ప్రగతి, చైతన్యకృష్ణ, ధన్య బాలకృష్ణ, ప్రిన్స్, శ్రీముఖి, కృష్ణ్భగవాన్, జబర్దస్త్ సుధీర్‌లు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.
సూపర్‌హిట్ తెలుగు సినిమాల ఆత్మలను తీసుకుని రీస్ట్రక్చర్ చేసిన కథ ఇది. దర్శకుడు కిషోర్ తిరుమల తన టాలెంట్‌తో కొత్తగా ప్రజెంట్ చేశాడంతే. కాస్తలోకాస్త రామ్ పాత్రని కొత్తగా రాసాడు. మిగిలిన పాత్రలు రోటీన్ కావడంతో సెకండాఫ్ డల్ అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల మధ్య దూరం ఎందుకు పెరిగిందన్న కీలకమైన పాయంట్‌కు రీజన్ చూపకుండా వదిలేశారు. దేవిశ్రీ మ్యూజికల్ ఆల్బం సూపర్‌హిట్. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కలర్‌ఫుల్‌గా కనిపించిన విజువల్‌స సినిమాటోగ్రాఫర్ సమీర్‌రెడ్డి పనితనాన్ని చూపించాయ. శ్రీకర్‌ప్రసాద్ ఎడిటింగ్ ఫస్ట్‌హాఫ్‌కి డీసెంట్‌గా అనిపిస్తే సెకండాఫ్‌ని స్లోచేసి చిరాకు పెట్టింది. కిషోర్ తిరుమల డైలాగ్స్ బాగున్నాయి. స్రవంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి.
రొటీన్‌కు కాస్త దూరంగా ఉందనిపించే ఫీల్‌ని క్రియేట్ చేయడంలో రామ్‌దే కీలకపాత్ర. ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడడం, ఆమెను ఇంప్రెస్ చెయ్యడానికి మంచి పనులు చెయ్యడం (అయితే ఇందులో అవన్నీ అనుకోకుండానే జరుగుతాయి) ద్వారా హీరోయిన్‌ని ఇంప్రెస్‌చేసిన హీరో ఆమెకు దగ్గరై సరిగ్గా ఐలవ్‌యూ చెప్పే టైమ్‌కి తను ప్రేమించలేదని, అతనికి తను ఫ్రెండ్ మాత్రమేనని చెప్పడం, దాని వెనుక పెద్ద కారణాలు వుండడం ఇవన్నీ రొటీన్ కథలాగే అనిపిస్తుంది. సన్నివేశాలపరంగా కొత్తగా చూపించగలిగారు. ప్రీక్లైమాక్స్ వరకు సెకండాఫ్‌లో చెప్పుకోవడానికి ఏమీలేదు.
డైరెక్టర్ సినిమా స్టార్టింగ్‌నుంచి ఎండింగ్ వరకు స్లో నేరేషన్ సినిమాకి పెద్ద మైనస్. ఈ మధ్యకాలంలో ఆడియన్స్‌ని ఆకట్టుకునే ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ లేకపోవడం ఈ సినిమాకి ప్లస్ పాయంట్.

- త్రివేది