రివ్యూ

అదే దయ్యం.. అయోమయం (*శశికళ) * బాగోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
నితిన్, మిషాకోషల్ (తొలి పరిచయం), జయరాజ్ తదితరులు
సంగీతం:
నిత్యన్ కార్తీక్
నిర్మాత:
తుమ్మలాపల్లి రామసత్యనారాయణ
దర్శకత్వం:
వినుభారతి యస్

అసలు సినిమా అంటేనే ఊహల పరిధి ఎక్కువ ఉన్న బాపతు. అలాంటి సినిమాలో కథా, కథనం ‘ఆత్మలు’ వగైరా అయితే, ఆ ఊహ పరిధి అనంతం. ఈ అనంతం తతంగాల సినిమా సంఖ్యలో ‘శశికళ’ చేరి మరికొంత బలమిచ్చింది. కథలోకి వెళ్తే..
పరువు హత్యల బారిన చనిపోయిన శశికళ ఆత్మ మరో అకృత్యానికి బలైన కుటుంబంలోని చిన్నారులకు ఐదేళ్లు రక్షణనిస్తుంది (?). తర్వాత ఆ పిల్లలను అయినవాళ్లు తీసుకెళ్తే అక్కడా వారిని పాక్షికంగా భయబ్రాంతులకు గురి చేస్తుంది. చివరకు ఆత్మ బారినుంచి పిల్లలకీ, పిల్లల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాబాయి, పిన్నిలకీ ఎలా విముక్తి కలిగిందీ అన్నది మిగతా కథ.
‘ఆత్మ’ చుట్టూ అల్లిన కథ కనుక తర్కం గిర్కం పేరిట సమయం వృధా చేసుకోవడం అనవసరం. అయినప్పటికీ ‘ఆత్మ’ పరిధి (ఇది కూడా సినిమా కథల పుణ్యమా అని అలవాటైన మీటరులోనే చూద్దాం)లోనే విశే్లషించినా చిత్రంలో లెక్కలేనన్ని అపసవ్యతలు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లల రక్షణ ఓ ఐదేళ్లపాటు కేవలం ఆత్మ తెచ్చి ఇచ్చే పండ్లు, పాలతోనే సాధ్యమా? పిల్లల్లో ఒకరి (అభి)ని అప్పటికే కాస్తంత ఊహ తెలిసిన వయసులో ఉన్నట్టు చూపించారు. మరి అతనైనా అక్కడ జరుగుతున్న, తనకు ఎదురవుతున్న విషయాలకు భయపడి పారిపోలేదా? అలా జరగదనే వినుభారతి (దర్శకులు) ప్రేక్షకుల్ని ఫిక్సయిపోమనడం భావ్యమా? అలాగే చిత్రం మొదట్లో తన అన్నయ్యను హత్య చేసిన వాళ్లను పట్టుకుని శిక్షపడేలా చేయమని పోలీసుల్ని గట్టిగా పట్టుబట్టిన ఆకాష్ (తమ్ముడు), ఆ తర్వాత ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం మరీ విడ్డూరం. ఇక పిల్లల మానసిక పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్లిన మనస్తత్వశాస్త్ర వైద్యుడు విల్సన్.. అసలు విషయం ఎలా జరిగిందని పోలీసు ఆఫీసురులా ప్రయత్నించడం ఇంకా విచిత్రం. పోనీ ఉత్సాహంకొద్దీ చేశాడనుకుందాం. అలా వెళ్లిన అతను కనీసం చనిపోయిన తరువాతైనా పోలీసు యంత్రాంగం స్పందిస్తారని కూడా చెప్పకపోవడం దారుణం. ఎందుకంటే అలా ఒక వ్యక్తి పరిశోధనలో ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత అది విధిగా మేజర్ కేసు అవుతుంది. ఇలాంటి కొన్నింటిని కన్వీనియంట్‌గా విస్మరించి -చిత్రాన్ని అందించేశాం.. ఆస్వాదించండి అనడం వింతల్లో వింత. ఇదంతా పక్కకుపెట్టి చిత్రంలో మిగతా అంశాల జోలికెళ్తే.. చెప్పుకోతగ్గవి ఏంలేవు. కాకపొతే ఈ ధోరణి సినిమాల్లో ప్రేక్షకుల్ని పక్కదాటి పట్టించే వెర్రి కామెడీ, చీప్ నత్యాలూ ఇందులో లేవు. అదో కొంత ఉపశమనం. ఆకాష్, నిషా (పిల్లల పిన్ని, బాబాయ్) పాత్రలు పోషించిన నటీ నటులు బాగా చేశారు. అసలు జనావాస వాసనే తెలియకుండా ఐదేళ్ల పెరిగిన పిల్లలు, అనంతరం ఒక్కసారి జన సంద్రంలోకి వచ్చిన నేపథ్యానికి తగ్గట్టు విను పాత్రధారిణి మంచి నటన కనబర్చింది. చిత్రాంతంలో దయ్యానికి కౌన్సిలింగ్ ఇచ్చినపుడు నిషా, ఆకాష్ పాత్రలకు రాసిన సంభాషణలు బాగున్నాయి. (మనుషులు మనుషులతోనే ఉండాలి లాంటివి). ఇలాంటి వాటిలో పాటలకి పెద్దగా స్థానముండదు. అయినా సంగీత దర్శకుడు నిత్యన్ కార్తీక్ అందించిన బాణీల్లో ‘మనిషీ బొమ్మల పిల్లలు..’ అన్నది ఓ మాదిరిగా ఉంది. ఈ పాటలో ‘కోడి నుంచి వచ్చిందా గుడ్డు.. గుడ్డు నుంచి వచ్చిందా కోడి’ అన్న పదాలు సిల్లీగా అనిపింనా పాట సందర్భం (జనంలోకి అప్పుడప్పుడే వచ్చిన పిల్లలను ఉద్దేశించి పాడే పాట) బట్టి ఒకే.
ఈ సినిమా సంభాషణల్లో.. మనుషులు మనుషుల్తోనే అన్నట్టు సినిమాని సినిమాలాగే ఉంచాలి తప్ప మరీ ఓవర్‌గా వెళ్తే అంతగా అనుకూల ఫలితాలు రావేమోనన్నది ‘శశికళ’ చూస్తే అనిపిస్తుంది. అనుభవం వస్తుంది.

Anveshi