వినమరుగైన

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అబ్బాయికి కుడి కంట్లో కాస్త మెల్లగా వున్నట్లుందే!’’ గొణిగింది వసంతమ్మ. ‘పైగా నలుపు’ అంది అరుణ.
‘‘అమ్మా జీవితమే రంగులమయం. ఆ మెల్లకన్ను జ్ఞాననేత్రం. నేను స్వయంగా చూశాను. మగవాళ్ళకు కుడి కంట్లో మెల్ల అదృష్టమంటారు’’ నచ్చచెప్పబోయారు పాపయ్యగారు.
‘‘ఇవన్నీ సరే. ప్రతిరోజూ రిక్టర్ స్కేలు చూస్తూ గుండె దడతో మేమెలాగా వుండగలం’’ ఆందోళనగా అన్నారు రత్నంగారు.
‘‘మీరు కంగారు పడాల్సిన పనిలేదు.. మరో రెండు నెలల్లో హైదరాబాద్‌కు వచ్చేస్తాడు. లక్ష ఇచ్చే ఉద్యోగాలుంటే లక్షణంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు’’ ధైర్యం చెప్పాడు పాపయ్యగారు.
‘‘డాడీ! ఏమిటీ గోల. నేను నీకెప్పుడో చెప్పాను కదా! మంచి లుక్కు, మంచి ముక్కూ మంచి లక్కూ వ్నువాణ్ణే చేసుకుంటానని’’ అంది కరుణ ముఖం చిట్లిస్తూ నాజూగ్గా.
‘‘ఓ అలాగా! అయితే వుండమ్మా. ఈ ఫొటో చూడు’’ అంటూ పాపయ్యగారు మరో ఫొటో చూపించారు. ఆ ఫొటో చూసింది అరుణ. బాగానే ఉన్నట్లనిపించింది.
‘‘ఇంతకూ ఇతనేం ఉద్యోగం చేస్తున్నాడు?’’ అడిగింది అరుణ.
‘‘ఉద్యోగం మాట తరువాత. నువ్వడిగినట్లే అతనికి కూడా అయిసు నయసుగా ఉండాలి. వయసు సొగసుగా ఉండాలి. ఛాయ చామంతిలా ఉండాలి. చూపు ధోవతుల చాపులా తెల్లగా హాయిగా వుండాలి. మనిషి బంతిలా, పూబంతిలా, చలాకీగా గెంతుతూ వుండాలి. వంట వండ్రఫుల్‌గా చెయ్యాలి. మరి ఈ లక్షణాలన్నీ నీలో వుంటే అతన్ని రేపు వెంబబెట్టుకొని మరీ తీసుకొస్తా! అటు వాళ్ళకూ, ఇటువాళ్ళకూ కూడా అందమైన వాళ్ళే కావాలి మరి. వాళ్ళెలా వున్నా ఫర్వాలేదు’’ అన్నారు.
ఆ పాపయ్యగారి మాటలకు మారు మాట్లాడలేదు.
వసంతమ్మ కూడా ఎటూ పాలుపోక నిట్టూర్చింది.
‘‘మరో సంబంధం కూడా వుంది. పిల్ల నచ్చితే కట్నం కూడా తీసుకోరు’’ అంటూ ఆరంభించారు మళ్లీ పాపయ్యగారు.
‘‘చెప్పడం అలానే చెబుతారు. అయితే వాళ్ళూ నాకు నచ్చాలిగా. మగవాళ్ళెలా వున్నా మేం మాత్రం బాగుండాలి. వాళ్ళుమాత్రం నీళ్ళ డ్రమ్ముల్లా, సోడాబుడ్డీమూతలా, అటకమీద గుండిగెలా, తేనెతుట్టెలా వుండొచ్చన్నమాట’’ విమర్శగా అంది అరుణ.
‘‘ఎవరి టేస్టులు వారివి. అనవసరంగా టైం వేస్టు ఎందుకమ్మా. విషయం అర్థమైంది. ఇదిగో ఈ ఫోటో చూడు’’ అంటూ ఫొటో చూపించారు. ఆ ఫోటో ఆయన చేతిలోంచి, తనచేతిలోకి వచ్చేటప్పుడే చూసేసిందిఅరుణ. అప్పుడే అనిపించింది ఎంత బాగున్నాడోననని. అలాంటివాణ్నే తను కోరుకుంటోంది.
‘‘ఇంతకూ! ఇతనేం ఉద్యోగం చేస్తున్నాడో?’’ అడిగింది అరుణ.
‘‘పెద్దగా చదువుకోలేదు. పెద్దగా ఉన్నవాళ్ళుకాదు. అందుకే పెద్ద ఉద్యోగం చేయడంలేదు. ఓ ప్రైవేట్ కంపెనీలో గుమాస్తా. చాలా నిదానమైనవాడు. ఏ దురలవాట్లు లేనివాడు’’’ చెప్పారు పాపయ్యగారు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339