వినమరుగైన

మాతృమందిరము( వేంకట పార్వతీశ్వర కవులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృమందిరంలోని గోరక్షణ లాంటిదే 1935లో విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన వేయిపడగలులో గోచరిస్తుంది. అలాగే భోగం స్ర్తిల తొలినాటి గౌరవం గూర్చి రెండు నవలలు ప్రస్తావించాయి. జాషువా గారి గబ్బిలంలోని ప్రథమ పద్యంలాగానే ముత్యాలు జీవితం అభివర్ణింపబడింది.
ఈ నవలలో ఇతర నవలకారుల ప్రతిధ్వనులు కూడా వినవచ్చు. ఉదాహరణకు పశ్చాతప్తురాలైన వేశ్య రాజరత్నం, వంగరచయిత శరత్‌బాబు రచించిన దేవదాసులోని చంద్రముఖి పాత్రను స్మరణకు తెస్తుంది. ఒక గొప్ప రచయితను ఎలా తెలుసుకోవచ్చో డబ్ల్యు.హెచ్.హడ్సన్ ఇలా అంటారు.
ఒక ప్రత్యేక రచనా ప్రక్రియతో ఒక రచయిత ప్రజాదరణ పొందితే అతని రచన సహజంగానే అనేక అనుకరణలకు గురి అవుతుంది.
ఈ విషయం ప్రత్యక్ష సత్యం. నవ్యాంధ్ర సాహిత్య వీధులు రచించిన కురుగంటి సీతారామయ్యగారు మహాప్రస్థానం రచయిత శ్రీశ్రీ - వీరిరువురూ వెంకట పార్వతీశ్వరులను అనుసరిస్తూ నవలలు రాశారు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..