వినమరుగైన

గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతగాడు పాఠశాలకు పోవునపుడు జరిగే ఉత్సవాన్ని ఊళ్ళో అనేకమంది తీరుబడి చేసుకొని వచ్చి సంతోషిస్తారు. యజ్ఞ పశువును పడదోసినట్లు నలుగురు పిల్లలు అతణ్ణి కాళ్ళూ చేతులూ పట్టుకొని తీసుకువెళ్తుంటే పంతులుగారు బెత్తం ఝుళిపిస్తూ వెంట వెళ్తుంటారు.
బడి పేరు చెప్పగానే గణపతికి నడుమునొప్పి, కడుపునొప్పి, కాళ్ల తీపులు, తలనొప్పి- ఇలా రకరకాలైన జబ్బులు పొడసూపుతాయి. పాఠశాల విపత్తును తప్పించుకోవడానికి గణపతి దాగని చోటు లేదు. ఎక్కని చెట్టులేదు. దూరని డొంక లేదు. ఇతని చేష్టలకు మేనమామ బెదిరిపోయి పట్టపగలే కలవరిస్తుంటాడు. ముందుగా గోగుచుట్టల్ని, తర్వాత చొరగు చుట్టల్ని, ఆపైన పొగాకు చుట్టల్ని త్రాగి మిత్రవర్గంలో పొట్టివాడయినా గట్టివాడనిపించుకుంటాడు.
గణపతికి చిన్నప్పటినుండీ గుర్రమెక్కటమంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు గాజుల వర్తకులకు ఆవకాయముక్కో, మాగాయముక్కో ఇచ్చి నాలుగు చుట్టల్ని కొసరిచ్చి వాళ్ల గుర్రం మీద నాలుగైదు వీధుల్లో స్వారీ చేసి ముచ్చట తీర్చుకుంటాడు. కానీ తృప్తి కలగలదు. అందువల్ల గాడిదమీద స్వారీ చేసి ఆ వెలితిని పూర్తిచేసుకోవాలను కుంటాడు. ఒక గాడిదను సంపాదిస్తాడు. పై ఉత్తరీయాన్ని కుచ్చీవచ్చేటట్లు తలకు చుట్టి, చుట్ట వెలిగించి గుప్పు గుప్పుమని పొగవదులుతూ, ఈత బెత్తంతో గాడిదను అదిలిస్తూ వీధుల వెంట అతడు చేసిన గాడిద స్వారీని చూసి తరించాల్సిందే తప్ప విని ఆనందించలేము. పైగా అడిగినవారితో ‘‘దానికీ దీనికీ భేదమేమిటి? గుర్రము సకిలించును. గాడిద ఓండ్రపెట్టును. అంతే కదా!’’ అంటాడు. ‘‘వసుదేవడంతటివాడు తనకు ఆపద వచ్చినపుడు ఏనుగు కాళ్లు పట్టుకోలేదు, ఆవు కాళ్లు పట్టుకోలేదు, గాడిద కాళ్లను గదా పట్టుకున్నాడు’’ అంటాడు. యమధర్మరాజు దున్నపోతుపైనా, వరుణుడు మొసలిపైనా, గణపతి ఎలుకపైనా, మన్మధుడు చిలుకపైనా, శ్రీమన్నారాయణుడు గద్దపైనా, శివుడు ఎద్దుపైనా ఎక్కితే తప్పులేనపుడు తాను గాడిద నెక్కితే తప్పా అని దబాయిస్తాడు.
గణపతికి ఎప్పుడు ఏ ముచ్చటవుతుందో చెప్పటం కష్టం. ఒకసారి గిరిజల జుట్టుమీద వల్లమాలిన మోజు కల్గింది. ఒక పెండ్లి వెళ్లినపుడు అతనికి ఈ మోజు కల్గటం మరీ విచిత్రం. అంతే! పెళ్లికి వచ్చిన భజంత్రీ మేళంలో ఒక క్షురకుణ్ణి పిలిచి తన పిల్ల జుట్టు గొరిగించి గిరజాలు పెట్టించాడు.
కాగడాలు వెలిగించే నిమిత్తం తెచ్చిన ఆముదాన్ని దొంగతనం చేసి తలకు పట్టించి పెద్దమనుష్యులమధ్య వెళ్లి పడుకున్నాడు. పెళ్లికి వచ్చిన జనం అంతా నవ్వుకున్నా గణపతికి మాత్రం చీమ కుట్టినట్లు అనిపించలేదు.
మరోసారి గణపతికి కోటుమీద మనసు అవుతుంది. రెండు కోట్ల రూపాయలున్నా రెండు కోట్లు లేనివాడి జన్మ వ్యర్థం అని అతనికి అనిపిస్తుంది. అంతే!
బ్రాహ్మణార్థానికి వెళ్ళే తన తోటివాళ్లనందరినీ ఒక చోట చేర్చి, సైనుగుడ్డల్ని ఇస్తే తీసుకోగూడదనీ, కోటుగుడ్డ ఇవ్వమని పట్టు పట్టాలని నచ్చచెప్తాడు.

--సశేషం

--చిలకమర్తి లక్ష్మీ నరసింహం