వినమరుగైన

మైదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలిసిన తరువాత ఆ సౌందర్యం, ఆ స్నేహం- ఆ లాలన అతని దగ్గిర్నించి పొందిన తరువాత- ఎన్ని కష్టాలు పడినా రాజేశ్వరి చలించలేదు. అమర్‌ను కోపగించుకుందేగాని ఏవగించుకోలేదు. డబ్బు, భద్రత, సాంఘిక హోదా- అన్నింటినీ కాలిగోటితో తన్ని వచ్చిన రాజేశ్వరి, ఏ బలవంతపు పరిస్థితులవల్లనో అమర్ కోరిన స్ర్తిని పతివ్రత వలె అతనికి తెచ్చి ఇవ్వవలసిన అవసరం లేదు. తన భర్తను విడిచివచ్చిన ధైర్యంతోనే అమర్‌ని విడిచి వెళ్లగలదు- ఆమెకి ప్రేమించడం తెలుసు- ప్రేమించిన వాళ్ల ఆనందంలో తన ఆనందం వుందని నమ్మింది రాజేశ్వరి. నేలవిడిచి సాము చేసిందనుకోవడానికి కూడా వీల్లేదు. తనను గర్భం తీయించుకోమని అమర్ అడిగినప్పుడు తన కడుపులోని జీవిపట్ల కరుణతో కరిగిపోయింది. కొంతకాలం అమర్‌ని దూరం చేసుకుంది. కానీ ఆ జీవి బయటికి వచ్చినపుడు ఎదుర్కోవలసిన పరిస్థితుల్ని ఊహించి అంతకన్నా అమర్‌ని సంతోషపెట్టడమే మేలని గ్రహించింది. అందుకే ఆమె ఆ పనికి పూనుకోగలిగింది.
మైదానం నవల వ్రాసిన నాటికి గర్భవిచ్ఛితి అనేది చట్టబద్ధం కాలేదు. కనీసం మధ్యతరగతి జనానికి ఊహల్లో సైతం ఊహించరానిది- అక్కర్లేని సంతానాన్ని కనకపోయినా పరవాలేదని చలం సూచించాడు. రాజేశ్వరి కాక ఈ నవలలో ఆమె భర్త ప్లీడర్, ఆమె మేనమామ, అమర్, మీరా పాత్రలున్నాయి. ప్లీడర్ ఆనాటి అగ్రకుల మధ్యతరగతి పురుషుడికి ప్రతినిధి.
అతనికి ఇంట్లో వస్తువులన్నింటితోపాటు భార్య కూడా ఒక ఆస్తి. రసికత పిసరంతైనా లేనివాడు. భార్య తలంటుపోసుకుని సింగారించుకుని వస్తే కుంకుడుకాయల ఖర్చు లెక్కవేసేవాడు. కామం తీర్చుకోవడానికి, వండి వడ్డించడానికి మాత్రమే భార్య. నిజానికి అప్పట్లో అగ్రకులాల్లో భార్య అంటే ఈ పనులకు, సంతానాన్ని కనిపెంచడానికి, మతపరమైన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రమే ఉపయోగపడే వస్తువు- ఆ విషయాన్ని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు ప్లీడర్.
రాజేశ్వరి మేనమామ ఆనాటి సమాజం ఆలోచనాతీరుకి ప్రతినిధి. రాజేశ్వరి లేచిపోయిన మనిషి అన్నా, ఆమెది పశుకామం అన్నా- బహుశా ఆమె సాహసం తమకి లేకపోయిందే అని లోలోపల అసూయ వుండివుండవచ్చు. తిరిగి వస్తే ఏదో ఒక అబద్ధం చెప్పి మళ్లీ అందరితో కలుపుకుంటాం అని ఆశ పెడతాడు రాజేశ్వరికి. ఆ సంప్రదాయాలు- ఆచారాలు- ఆలోచనల్లోని బోలుతనాన్ని అసహ్యించుకుంటుంది రాజేశ్వరి.
అమర్‌కి రాజేశ్వరి కావాలి- ఆమె అందం కావాలి- ఆమె శరీరం కావాలి- ప్రేమ కూడా కావాలి- ఆమె కాక తను కోరుకున్నవన్నీ కావాలి- తను రాజేశ్వరిని ఎంతో ఉధృతంగా ప్రేమించవచ్చు. ఆ ప్రేమకి ఆమె కాళ్లూ చేతులూ విరగవచ్చు. ఎముకలు చిట్లవచ్చు. పెదవులు రక్తం స్రవించవచ్చు. కానీ ఇదే చొరవ - ఇదే ఫోర్స్ ఒక స్ర్తి ప్రదర్శిస్తే అతనికి నచ్చదు- అందుకే రాజేశ్వరి బ్రతిమలాడి తీసుకువచ్చిన స్ర్తిని అతను వదిలివేశాడు-
స్ర్తిలు తమ లైంగికతను ప్రదర్శించకూడదు- ఎప్పుడూ పాసివ్‌గానే వుండాలనేది ఈనాటికీ పురుషులు నమ్మే సత్యం- తను మరో స్ర్తిని కోరవచ్చు. ఆమెను పొందడానికి రాజేశ్వరి సాయం చేయవచ్చు- కానీ ఆమె మాత్రం మరో పురుషుడికి సన్నిహితంగా కాకూడదు. ప్రేమ చూపించకూడదు. రెండు రవికెలు తెచ్చి ఆమె ముఖాన పడేసి అవి వేసుకుని తిరగమని సలహా ఇస్తాడు- రాజేశ్వరికి దగ్గరగా వచ్చిన మీరాని చంపాలని చూస్తాడు- -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- చలం