వినమరుగైన

ఓబయ్య - వేలూరి శివరామశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారణజన్ముడూ, కర్మయోగి ఐన మహాత్ముని పిలుపునందుకొని ఓబయ్య వంటి దేబయ్యలు కూడా జాతీయోద్యమంలో పాల్గొన్నారంటే ఇక నిజమైన దేశభక్తుల విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గాంధీ ఉద్యమ ప్రభావం అంతటిది. ఆ మహోద్యమాన్ని ప్రథమతః అక్షరబద్ధం చేసిన జాతీయ కవి శివరామశాస్ర్తీగారు.
శివరామశాస్ర్తీగారి ఓబయ్య ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి మాలపల్లి ఇంచుమించుగా ఒకే ఏడాదిలో వెలసిన రచనలు కావడంవల్ల ఈ రెంటినీ పోల్చి చూడడం సహజం. శివరామశాస్ర్తీగారి నవలలో ఒక వ్యక్తి జీవితాన్ని జాతీయోద్యమం ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందో వర్ణింపబడింది. ఉన్నవవారి నవల జాతీయోద్యమ కాలంనాటి రాజకీయ- సామాజిక- సాంస్కృతిక చరిత్రల సజీవ సమగ్ర ప్రతిబింబం.
శాస్ర్తీగారి నవలలో గాంధీగారి గ్రామాభ్యుదయ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికై తన సర్వస్వం అర్పిస్తాడు ఓబయ్య. ఉన్నవ వారి నవలలో హరిజనోద్ధరణ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికై ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు సంగదాసు. ప్రజా హృదయాలలో క్రమ పరివర్తనం ద్వారా గ్రామీణ అభ్యుదయ సాధనకై జరగవలసిన కృషి ఎటువంటిదో వేలూరి తమ నవలలో సూచించారు. ఉన్నవవారి నవలలో కొన్ని వేల సంవత్సరాలు అణగద్రొక్కబడిన పీడిత ప్రజల హాహకారాలు మనకు వినిపిస్తాయి. ఇక భాషా విషయకంగా పరిశీలిస్తే ఉన్నవ వారి నవల వాడుక భాషలో రచింపబడింది. వేలూరి వారి నవల సరళ గ్రాంధికంలో సాగింది. శివరామశాస్ర్తీగారి వచనమొక విలక్షణమైనది - ఏది వర్ణించినా అదృశ్యము కళ్లముందు కట్టించడం వేలూరి రచనా విశిష్టత.
ఉదాహరణకు-
‘‘గడియారము బలే మోసగాడు; అది టిక్కు టిక్కుమనుచునే ఆగిపోవును. నడుచుచో గంట ముందు; ఫీకుచో గంట వెనుక; అది రైలును, పరీక్షలను తప్పించును’’. ‘‘్భక్తులకును, భామినులకును కన్నీరొక అలంకారము; ఒక ఊరట’’
‘‘బడిని బహిష్కరించిన వారి నామావళిలో అహోబలుని పేరు ఆద్యము- ప్రతి పత్రికయు నతనికి జయపెట్టెను. ప్రతి విద్యార్థియు నతనిని సందర్శించెను- అతడు తొల్లి ప్యాసయినదసత్యము; ఇపుడు నిజము’’.
(అహోబలుడి పాఠశాల బహిష్కరణ వర్ణన)
‘‘నిరుపేదలయినను పెండ్లికి వ్యయింపవలసియునది, ఆయమునకు నాలుగు రెట్లు! సాబాలు జనులు పాటుపడరు, పరుల గుండెల మీదనే వారి కాలు- కూరగాయలు కష్టించి పండించుకొనరు. అప్పులెగవేసియైన కొని తిందురు. పశుపోషణమునకగాని, పశువృద్ధికిగాని పాటుపడరు; పాడి మాత్రము కావలెను- పురాణము వినరు; చతుర్ముఖ పురాయణమునకు సిద్ధము (ఆనాటి గ్రామాల స్థితి) ‘‘దూమ వాలము ఊరంతయు జుట్టుకొనియెను- రత్నగర్భ పగిలి వెలికి గ్రక్కు రత్నముల వలె- విస్ఫులింగములు తోచెను- స్ఫోట శబ్దముతో లేచిన పన్నగరాజు పడగలవలె మంటలు లేచెను- ధూరు శిఖామణి యగు నా మహాజ్వాల భూమ్యాకాశములకు నిచ్చెను కట్టెను’’ -గ్రామంలో చెలరేగిన అగ్నిప్రమాదం వర్ణనము ఇది)
ఈ విధంగా వస్తువులో, రచనలో విలక్షణమైన శివరామశాస్ర్తీగారి జాతీయోద్యమ నవలల్లో ఓబయ్య అగ్రగణ్యమైనది. తరువాత వచ్చిన ఎన్నో నవలలకు మార్గదర్శకమైనది.
- సమాప్తం

-జంధ్యాల మహతీ శంకర్