వినమరుగైన

ఎంకి పాటలు - నండూరి వెంకట సుబ్బారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నండూరి వారి యెంకి పల్లెపడుచు. ప్రకృతి సహజమైన జానపద సౌందర్యానికి ప్రతీక. ధర్మబద్ధమైన ప్రణయాన్ని మాత్రమే అంగీకరించే నాయిక. అందుకనే-
‘‘కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తాది
దగ్గరస కూకుంటె, అగ్గి సూస్తాది’’
అంటూ ఆమె హావభావాలను వర్ణిస్తారు శ్రీ నండూరి.
‘‘యెంకి వంటి పిల్ల లేదోయి, లేదోయి
యెంకి నా వంకింక రాదోయి, రాదోయి
మెళ్లో పూసల పేరు, తల్లో పూవుల సేరు
కళ్లెత్తితే సాలు కనకాభిషేకాలు
రాసోరింటికైన రంగు తెచ్చే పిల్ల
నా సొమ్ము నా గుండె, నమిలి మింగిన పిల్ల..’’
అన్న అభివ్యక్తిలో యెంకి నిసర్గ సౌందర్యం మన కళ్లముందు బొమ్మ కడుతుంది.
పచ్చని సేలోకి పండు యెనె్నల్లోన/ నీలి సీరాగట్టి నీటుగొస్తా వుంటె
వయ్యోర మొలికించు నా ఎంకి
వన లచ్చి మనిపించు నా యెంకి
మేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
మల్లీ యెపప్పాటల్లె తెల్లారబోతుంటే
సెందరుణ్ణీ తిట్లు నా యెంకి
సూరియుణ్ణీ తిట్టు నా యెంకి
అన్న మాటల్లో యెంకి అందాలతోపాటు, ఆమె గడసరితనాన్ని కూడా కవి మనకు తేటపరుస్తాడు.
యెంకి-నాయుడు బావల ప్రణయం ధర్మబద్ధమైంది. ఈ సంగతిని శ్రీ నండూరి వారు ‘గోవుమాలచ్చిమికి కోటి దండాలు’ అన్న పాటలో అందంగా తెలయజేస్తారు.
‘‘గోవు మాలచ్చిమికి కోటి దండాలు
మనిషికైనా లేని మంచిపోకిళ్లు
యెంకితో కూకుండి యింత సెపుతుంటే
తన తోటి మనిసల్లె తల తిప్పుతాదే
యెంకి సరసలాడ జంకుతా వుంటే
సూసి సూడక కన్ను మూసి తెరిసేదీ’’
ఈ పంక్తుల్లో ‘‘సూసి సూడక కన్ను మూసి తెరిసేదీ’’ అన్న అభివ్యక్తిలో కవి సునిశిత పరిశీలనాశక్తి, సమయోచిత ఔచిత్యస్ఫూర్తి మనకు ద్యోతకమవుతాయి. గోవు ధర్మానికి ప్రతినిధి. ఆ గోవు అంగీకారాన్ని అందుకున్న యెంకి-నాయుడు బావల ప్రేమ ధర్మబద్ధమైనదే. అంతేకాదు, తను చూస్తే యెంకి సిగ్గుపడుతుందేమోననే భావంతో, ఆవు అలా కన్నుమూసి తెరుస్తున్నదనే భావనలో ఎంతో సొగసు వుంది.
‘‘మనిసే సాలు, మనిసి మాటే సాలు
మనిషి వోసనె సాలు, మనసే సాలు’’
‘‘ఆరిపేయవె దీపము
యెలుగులో నీ మీద నిలుపలేనే మనసు’’
‘‘నా పాటె పాటంట, నా మాటె మాటంట
నలుగురమ్మలు సేరి నను మెచ్చుతావుంటె
సూడాలి నాయెంకి సూపు లా యేళ’’
‘‘ఈ సందె కీయంద మెవ్వరిడిరోరుూ
ఆకాశమున విల్లు, అంకాన యెంకి
పగలు రేలెడ బాటెరుగ రెవ్వరోరుూ
శంకరుడు సతియచట, యింకెవ్వరిచట’’
వంటి పాటల్లో యెంకి-నాయుడు బావల అంతరంగాల్లో దొంతరలుగా చెలరేగే ప్రణయ తరంగాల సవ్వడులే మనకు వినిపిస్తాయి.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)
*

-కె.వి.ఎస్.ఆచార్య