వినమరుగైన

అతడు -ఆమె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుభతో, కన్నకూతురు లక్ష్మితో ఈమెకున్నది స్నేహ బాంధవ్యం. పిల్లల స్నేహితులు ఆమెకు కూడా స్నేహితులు. శాంతం మంచి ప్రజాతంత్రవాది. డెమోక్రాట్ అన్న పదం పూర్తి అర్థంలో శాంతంకు అన్వయిస్తుంది. ఒక పాత్రను ప్రజాతంత్ర స్వభావంతో రూపొందించటమనేది తెలుగు సాహిత్యంలో అరుదైన విషయం. ఒక స్ర్తి పాత్రనలా చూపటం మరీ అరుదు. శాంతం పాత్ర ఔన్నత్యాన్ని చెప్పటానికి లక్ష్మణరావుగారు కల్పించిన అత్యద్భుత సన్నివేశం ఒకటుంది. శాంతను ఆమె కూతురు లక్ష్మి అడుగుతుంది- ‘‘మరీ నాన్న ఇంతలా మారిపోతాడని నీకు ముందుగానే తెలిసుంటే నాన్నని పెళ్లిచేసుకునుందువే’’ అని. శాంతం ‘‘ఆనాడు తెలిసుంటే చేసుకోకపోయుందునే’’ అంటుంది. లక్ష్మి ఊరుకోకుండా ‘‘మరీనాడు తెలిసింది గదా నాన్న మారిపోయాడని. మరిప్పుడు నాన్నంటే నీకింకా ప్రేమేనా?’’ అనడిగితే చదివేవారి గుండెలు పట్టేస్తాయి గానీ శాంతం ఎంతో గుండె నిబ్బరంతో ‘ఆ ప్రేమే కాని, ప్రేమ ఎన్ని పాళ్లో ప్రణయం ఎన్ని పాళ్లో స్పష్టంగా నాకే తెలీడంలేదంటే నమ్ము’’ అంటుంది. మనం దుఃఖం నిగ్రహించుకోలేం. శాంతం ఆ ప్రేమ పోతున్న దశలో ఆమె పడిన సంఘర్షణ, వారి దాంపత్య జీవితపు జ్ఞాపకాలు వేరు. ఇప్పటి ప్రేమరాహిత్య స్థితీ, కూతురి ముందు అది చెప్పి ఒప్పుకున్న తీరూ అన్నీ మన కళ్లముందు కదిలి మనసు ఆర్ద్రమవుతుంది. అపురూపమైన సన్నివేశ కల్పన ఇది.
రసపోషణ చేయటంలో లక్ష్మణరావుగారు అసామాన్యమైన ప్రతిభ చూపించారు. శాంతం శాస్ర్తిల ప్రేమనూ, శృంగారాన్నీ ఎంత సున్నితంగానో వర్ణించారు. వారి ప్రేమను త్యాగరాజ కీర్తనలాగా గానం చేశారు. శాస్ర్తీ ఒకసారి సముద్రంలో మునిగిపోతున్న పిల్లవాడిని రక్షిస్తే శాంతం సంతోషంతో పొంగిపోయి శాస్ర్తీ ఒళ్లు తుడిచి, సాంబ్రాణి పొగ వేస్తుంది. శాస్ర్తీ ‘‘ఏమిటి శాంతం ఈ హడావిడి?’’ అంటే అప్రయత్నంగా ఉపచారము చేసేవారున్నారని మరువకురా అన్న కీర్తన పాడుతుంది. శాంతానికి పాపాయి పుట్టినపుడు శాస్ర్తీ ఆమెమీద ప్రేమతో ఉక్కిరిబిక్కిరవుతూ ‘‘నీ పాదధూళి నా శిరమున దాల్తు శాంతం’’ అనుకుంటాడు. ఆమె ప్రేమజ్వాలల్లో దగ్ధం అయిపోతేనేం అనిపిస్తుంది శాస్ర్తీకి. సున్నితమైన వ్యంగ్య హాస్యం లక్ష్మణరావుగారి ప్రత్యేకత. అదీ జీవితంలోంచి వచ్చిందే. ఒక స్ర్తికి మనోవృత్తి రాకుండా భర్త తరఫున వాదించి గెలిచిన శాస్ర్తీ హిందూ మారేజిలా రిఫార్మేషన్ అసోసియేషన్‌వాళ్లకు తన ఫీజులోంచి వెయ్యి రూపాయల చందా ఇస్తాడు. పొద్దునే్న ఇంట్లో శాస్త్రోక్తంగా తద్దినం పెట్టి సాయంత్రం కాక్‌టెయిల్ పార్టీకి హాజరవుతాడు. చక్కటి ఉపమానాలు వాడి భావాన్ని మెరిపింపజేస్తారు లక్ష్మణరావు గారు.లక్ష్మణరావుగారు ఈ నవలలో చెప్పిన వంటకాల రుచి చూడకపోతే ఈనవల గురించి తెలుసుకున్న అనుభూతి కలుగదు. తెలుగువారి వంటకాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రవారి వంటలూ, వాటి రుచులూ నోరూరిస్తూ ఈ నవలలో పరిమళిస్తుంటాయి. నూనె గింజలు వేసి చేసిన పులుసు, ఉప్పుడు పిండీ, తెలగపిండి కూరా అందులోకి ఎండు మిరపకాయతో కాచిన ఇంగువ నూనె. నిడదవోలు నక్క దోసావకాయ, బచ్చలి కూర రసంలో కంద ముక్కలతో పంటికిందకొచ్చే నూనెగింజలు, రకరకాల పచ్చళ్ళూ, కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ నిప్పులమీద ఒండిన పప్పూ ఒకటేమిటి చవులూరించే వంటలు చదివి భోజనానందం కూడా పొందవచ్చు. తైరువడకూ- పెరుగు గారెకూ సాగిన సమరం ఎంత సరదాగా ఉంటుందో దాని వెనకనే లక్ష్మి తిండి గురించి కొట్టుకునేవాళ్ల గురించి ఇచ్చిన ఉపన్యాసం అంత ఆలోచనాత్మకంగా ఉంటుంది.
వస్తుశిల్పాల అపూర్వ సమ్మేళనంతో మూడు దశాబ్దాల తెలుగువారి సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక జీవనాన్ని పరిచయం చేసే అతడు-ఆమె నవల చదవనివాళ్లు జీవితంలో ఎంతో కోల్పోతారు. ఒక పక్క మనసులను రసార్ద్రం చేస్తూ మరోపక్క నిస్సహాయులకు ధైర్యాన్నీ, వ్యక్తిత్వం లేనివాళ్లకు దానిని రూపొందించుకోవాలనే కోరికనూ, నిలవ నీటి జీవితాలను మార్చుకుని ప్రవహించాలనే తపననూ కలిగించే నవల అతడు - ఆమె.
-సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ఓల్గా