వినమరుగైన

మా గోఖలే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంతా వొచ్చారా యింగా ఎవరన్నా పొదలమాటున వుండారా?’’ అన్నాడు బల్లకట్టు పాపయ్యగెడ మీన ఓరగా సూత్తా. ‘‘పొదల సోట్నేందయ్యావ్? సింత సచ్చినా పులుపు సావలేదంట. రుూ బల్లకట్టుపాపయ్యకు ఏళ్లు మిగులుతుందా సెతురు తగ్గటంలేదే? నవుతావు దేనికే నాగరత్తీ? మరి సూడమ్మారుూ పాపయ్యకు తెల్లారిందప్పుడే సెతురాడనూ’’ అంది ఎంకాయి పిన్నాం.
‘‘అదేంది, పిన్నాం అట్టంటదేం? గెడకర్రకు మల్లే పాపయ్య అట్టుంటే ఏళ్లు మిగల్టమేంది పాపం-యిహి హిహి’’ అంది నాగరత్తి కొంగుచాట్న పకపకమంటా. ‘‘అదేంది పిల్లోవ్ అట్టిరగబడ్తుండావు. ఆ పొళ్లు కాత్తా రాలి కాలవలో పడేను’’ అంది చుబ్బక్క. అదేంది చుబ్బమ్మోవ్ అట్టంటావ్? దాని పళ్లు చూసే పుల్లన్న దాని కట్టుకుంటే’’ అన్నాడు బల్లకట్టు పాపయ్య గెడేసి బల్లకట్టు నడుపుతా.
‘‘సూడే ఎంకాయి పిన్నాం రుూ పాపయ్య? నన్నంటే అన్నావుగానీ ఇంటికాడ మా బూసమ్మొదిన కాడ అనేవయ్యోవ్, బద్రం వొల్లంతా పిడకలు కొట్టుద్ది’’ అంది నాగరత్తి. మా గోఖలే కథా శిల్పం విలక్షణంగా వుంటుంది. ఒక్కోసారి కొండవీటి చాంతాడంత పొడుగాటి వాక్యంతో కథ మొదలుపెట్టి లోపలికి దించేస్తాడు. ఒక్కోసారి కథంతా ఒకే సంభాషణగా నడిపిస్తాడు. ఒకోసారి ఒక్క సన్నివేశంతోనే కథ ముగిస్తాడు. వర్ణనల్లో ఎంత సహజమైన పోలికలు తెస్తాడు. ‘‘నెర్రె యిచ్చిన బూవిలో బంగారం పండుద్ది! ఆడ పండిన పంట కుప్పలు కోటయ సావి పెబలకి మల్లే వుంటయ్! (పంటసేలు) ‘‘తను దూకిన దూకుడికీ, సుబ్బమ్మ గేదె పడ్డకు మల్లే బెదిరి సేసిన యటకారానికి నవ్వుకు రొప్పుతుండ పొట్ట తట్టుకోలేకపోయింది. కాంతానికి, తఫీమని పిడత పగిల్నట్టు జరిగిన రుూ యవారమంతా తంబం సాటుకు సేరి సూత్తుండ రత్తి, కాంతం ఎటు లగెత్తిందీ తెలవక, పిల్లికూనాలె సీకట్లో తవుల్లాడత్తా, గొడ్లసావిడి మొత్తకాడికొచ్చింది’’ (పెల్లి) గోఖలే రాసినవి కథలనుకుంటే కథలు. లేదూ, బొమ్మలనుకుంటే బొమ్మలు. చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎన్ని తక్కువ గీతల్తో, తక్కువ రంగుల్తో బొమ్మలు గియ్యగలడో, అంత క్లుప్తంగా, కుదిమట్టంగా ఉండే కథలు రాశాడు గోఖలే. బొమ్మలు ప్రపంచంలో ఒకానొక కాల సందర్భంలోని ఒక్క సన్నివేశాన్ని పట్టుకుంటాయి. మామూలుగా గోఖలే కథలు గూడా ఒకటి రెండు సన్నివేశాలకే పరిమితమవుతాయి. అవి కాలంలో ఎక్కువ దూరం నడిచే కథలు కావు. వాటిల్లో రంగు ముదిరిన హంగులుండవు. అవి నిరాడంబరమైన, నిర్మలమైన, నలుపు-తెలుగు కథా చిత్రాలు.
రచన వెనుక రచయిత దృక్పథం వుంటుంది. ఈ దృక్పథానికి సంబంధించి రెండు ముఖ్యమైన వాదాలున్నాయి. ఒకటి- స్వభావవాదం. దైనందిన జీవన రేఖల్ని వున్నట్టు చిత్రిస్తుంది స్వభావవాదం. ఎట్లావుంది అట్లానే గ్రహించమంటుంది. అంటే యిక్కడ, సామాజిక చైతన్య కోణం నుంచి గాని, నైతిక కోణం నుంచిగాని రచయిత వ్యాఖ్యానాలుండవు. రెండు -వాస్తవికతావాదం. ఉన్న జీవితం అట్లా ఎందుకుందో ఆలోచించమంటుంది వాస్తవికతావాదం. వైరుధ్యాల్ని చిత్రించి పరిష్కారం అన్వషిస్తుంది. ఇక్కడ రచయిత చైతన్యం రచనలో ఖచ్చితమైన పాత్ర వహిస్తుంది. ఈ రెండు వాదాల మధ్యేమార్గం మా గోఖలేది. గొప్ప సాహిత్యం చరిత్రలోని ఖాళీలు పూరిస్తుంది. 1940, 50 ప్రాంతాల్లో గుంటూరు మాగాణి పల్లెటూళ్ళ బతుకులెట్లా తెల్లారినయ్యో చరిత్ర విశదంగా చెప్పలేదు. మా గోఖలే కథలు చెప్పగలవు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నత (మార్పు), కూలివాళ్ల తిరుగుబాట్లు (పంటసేలు), గ్రామాల నుంచి వలసలు (దారి తప్పిన ఇద్దరు మనుషులు), రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం (గూడెం పోకడ), తిండి కరువు (పిప్పిదంట్లు) వృత్తుల మధ్య అంతరాలు (దేముడిచ్చిన సొమ్ము), అట్టడుగు జనం ఆకలి ఆక్రోశం (మూగజీవాలు, నువ్వు కడుపులు, రాయి మడుసులు), రాత్రుల రహస్య సంబంధాలు (పాలపిట్ట గూడు పెట్టింది, సీకటి పొత్తు) ఒకటేమిటి మా గోఖలే కథలంటే ఆనాటి గ్రామ చరిత్రే.
ఇంత గొప్ప సామాజిక చరిత్ర నిర్మించిన మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే ఎందువల్ల కథా చరిత్రలో కనుమరుగయ్యాడు? ఎందుకని అతని రచనలకు మంచి ప్రచారం రాలేదు? తెలుగు సాహిత్య రంగంలోని పాడిందే పాట తత్త్వమే దీనికి కారణం. ప్రసిద్ధమైన కొన్ని కథల్ని లేదా కథకుల్ని మాటమాటికీ ఉదాహరిస్తూ, నలిగిన దారమ్మట నలిగిన భావాలు ఏరుకుంటూ పోవటమే ఇంతకాలం మన పని అయింది. పక్కలకి పరకాయించి చూట్టంలేదు. గుంటల్లోకి తొంగిచూట్టంలేదు. ఇది నిజానికి చాలా సుఖమైన పని. కొత్తదారుల్ని అనే్వషించటం, కొత్త ప్రతిపాదనలు చెయ్యటమే కష్టం. ఈవరస ఇప్పటికైనా మారాలి. తెలుగు కథా చరిత్రంటే కేవలం పాతిక, ముప్ఫై మంది ప్రసిద్ధ రచయితల ప్రసిద్ధ కథలు మాత్రమే కాదని తెలుసుకోవాలి మనం.
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు.

పాపినేని శివశంకర్