వినమరుగైన

విలోమ కథలు-నగ్నముని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర సంస్కృతులపై అధ్యయనంపైనుంచి (ఎలైట్) కాక విలోమం (సబ్-ఆల్‌టెర్న్) నుంచి సాగుతోంది- ఇది వర్తమాన తెలుగు సాహిత్య ధోరణి.
ఈ ధోరణిలో దాదాపు రెండు దశాబ్దాలకు పూర్వం- కొత్త విలువల్లో, కొత్త విశ్వాసాల్తో, విశ్వవస్త్రం నేస్తానన్న నగ్నముని విలోమ కథలని ఆవిష్కరించారు.
అంటే ఈ విలోమ కథలు నిశ్శబ్దంగా లోపల్నుంచి తన్నుకొచ్చి సరికొత్త ధోరణులకి, సంచలనాలకి మాతృక కావటం- ఈనాటి చారిత్రక సాహిత్య ధోరణులకి ఒక ఆలంబనం, వూతం కావటం యాదృచ్ఛికం కాదు. ఒక సహజ, సమాజ పరిణామం.
అంచేత విలోమ కథల్ని, అవి నెరవేర్చిన చారిత్రక బాధ్యతని, అవి మోసిన చారిత్రక నేపథ్యాన్ని చాలా జాగ్రత్తగానే గమనించాలి. అధ్యయనం చేయాలి. ఈ కథల్ని నగ్నముని ఎమర్జన్సీ రోజుల్లో రాశాడు. తర్వాత కథల్ని రాయటం మానేశాడు. నగ్నముని మొత్తంమీద ఆరు కథలు రాశాడు. అందులో మొదటి కథ లైకా మజ్నూ ప్రళయ గాథ కాగా చివరి కథ గ్రహణం. ఇందులో నాల్గు కథలు 1975, 1976 ప్రాంతాల్లో దేవీప్రియ సంపాదకత్వం వహించిన ప్రజాతంత్రలో వచ్చాయి. ఇందుమూలంగా అన్న కథ ఆంధ్రప్రభలో వచ్చింది. గ్రహణం కథ నేరుగా రాసి ఈ కథల సంకలనంలో చేర్చటం జరిగింది.
ఈ విలోమ కథలకి పరిచయ వాక్యాలు వ్రాస్తూ దేవీప్రియ యిలా అంటాడు. ‘‘ఈ దేశంలో మనుషులు మనుషులుగా బతకటం లేదు. రాజకీయాలు, జీవిత విశ్వాసాలు, విలువలు తలకిందులుగా నడుస్తున్నాయని కుండబద్దలుకొట్టినట్లు చెప్పటానికే నగ్నముని విలోమ శైలిని ఎన్నుకున్నాడు’’.
సంపాదకుడిగా దేవీప్రియ మొదటి విలోమ కథ లైకా-మజ్నూ ప్రళయ గాథని ప్రత్యేక సంపాదకీయం రాసి మరీ ప్రచురించారు. సామాన్యంగా ఏ వారపత్రిక సంపాదకుడు- ప్రత్యేకించి ఒక కథకి సంపాదకీయం రాయటం బహు అరుదు. పాఠకులు ఈ విలోమ కథల్ని స్వీకరించిన తీరు, నగ్నముని విలోమ కథల్ని మరో మూడింటిని ప్రజాతంత్రలో వెంట వెంటనే ప్రచురించటం జరిగింది.
విలోమ కథల తర్వాత రచించిన కొయ్యగుర్రం అనే ఆధునిక మహాకావ్యం కూడా 1978 జనవరి 1వ తేదీ ప్రజాతంత్రలోనే మొదట అచ్చుకావటం విశేషం. అయితే ప్రచురణకన్నా ముందు కొయ్యగుర్రం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. భరద్వాజగారు రేడియో కోసం అయిదు నిముషాల పాటు సాగే కవిత కావాలన్నపుడు నగ్నముని ఈ కొయ్యగుర్రం దీర్ఘకావ్యాన్ని రాశారు. తీరా ఆ కవిత 14.50 నిమిషాలు వచ్చింది. అయినా భరద్వాజగారు మిగతా సాహిత్య కార్యక్రమాన్ని పక్కనబెట్టి ఈ మహాకావ్యాన్ని రేడియోలో ప్రసారం చేయించారు. ఈ కొయ్యగుర్రం 1977 నవంబర్‌లో వచ్చిన దివిసీమ ఉప్పెనపై స్పందించి వెల్లడించిన థార్మిక ఆగ్రహంగా పరిగణించాలి.
అయితే ఆకలి- కాకపోత ప్రేమకథలుగా అనే పద్ధతిలో సాగుతున్న తెలుగు కథా రచనకు ఒక కొత్త రోడ్డువేయటానికే నగ్నముని ఈ విలోమ కథ ప్రయోగాన్ని చేపట్టాడు. ఇది దేవీప్రియ అన్నట్టు సామాజిక వాస్తవాల చేదుని భరించలేనివారికి విషగుళికలే. అరాయించుకోగలిగినవాళ్లే, దేశ సాంఘిక, రాజకీయ ఆర్థిక వ్యవస్థలని ఆకళింపుచేసుకోగలిగినవాళ్లే ఈ కథలని స్వీకరించగలరు. ఇవి పాఠకులని నిద్రపుచ్చటానికి రాసిన కథలు కావు. యుద్ధ్భేరి, సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీతంలా సుతిమెత్తగా వుండదు. అది వినేవారి గుండెల్ని బద్దలు కొడుతుంది.
ఈ కథల్ని ప్రజాతంత్రలో ప్రచురించి ఈ కథల పుస్తకానికి నాలుగు ముందు మాటలు రాసి దేవీప్రియ ఒక బాధ్యత కల్గిన గొప్ప సంపాదకుడిగా తెలుగు సాహిత్య చరిత్రలో నిలబడ్డారు.
నగ్నముని విలోమ కథల్ని, ఆయన రాసిన దిగంబర కవిత్వాన్ని విరసం నుంచి బైటికి వచ్చాక వెలువరించిన కొయ్యగుర్రాన్ని తులనాత్మకంగా పరిశీలించితేగాని నగ్నముని శైలి, దృక్పథం, లక్ష్యం మనకి అర్థం కావు.
నగ్నముని విలోమవాదానికి, దిగంబరవాదానికి మధ్య తేడా గురించి చెప్తా- ‘‘దిగంబర వాదం నేటి రాజకీయ సామాజిక, అసమానతల వ్యవస్థలపై ఒక తిరుగుబాటు, విలోమవాదం మన విలువలు ఎలా వెనక్కి తిరిగి ప్రయాణిస్తున్నాయో (విలోమంగా) తెలియచెప్పటం. మొదటిది ప్రతిఘటనా దృక్పథంగాకూడిన తాత్వికత, రెండవది ప్రధానంగా రూప సంబంధమైనది అని స్పష్టంగా పేర్కోటం జరిగింది.
దిగంబర కవిత్వంలో వాడిన భాష, శైలి, ఆయన ఆధునిక దృక్పథం మనిషికి స్పష్టంగా విలోమ కథల్లోనూ కన్పిస్తుంది. చాలా కథలు కవితామయంగా వుంటాయి. సూటిగా, స్పష్టంగా, వ్యంగ్యంగా, వివిధ ప్రతీకలతో, సంకేతాలతో, అర్బేనిటిగా, పొగరుగా, వాడిగా, వేడిగా, అధిక్షేపధోరణిలో మాటల్ని సధించే తీవ్ర భావావేశ ధోరణి విలోమ కథల నిండా విస్తరించి వుంటుంది.
ఒక కవి రాస్తున్న కథలుగానే విలోమ కథల్ని నిరూపించటానికి అట్టే సమయం పట్టదు. విలోమ కథల్లో అనేకచోట్ల పాత్రలు తలలు మార్చుకోవటం, తలల స్థానంలో పులుల, ఆవుల తలలు, కుండలు కన్పించటం, ఎదురెదురు తలలు ఒకే విధంగా కన్పించటం సాధారణం.
దిగంబర కవిగా నగ్నముని రాసిన నగ్నశిశువు కవితలో ఈ చరణాలు చూడండి-
‘‘ఎవరి ముఖమెవరిదో ఎప్పటికి రుూ దారిలో ఆనవాలు పట్టలేదు
కావాలని తప్పించుకు తిరుగుతున్నప్పుడు ఎవరికి వారు చీటీలు బోర్డులూ కట్టుక తిరుగుతున్న ముఖాలు..
(దిగంబర కవుల సంపుటి పేజీ 224, ఎమెస్కో ప్రచురణ)
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..