వినమరుగైన

విలోమ కథలు-నగ్నముని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవుల కవితల్లో, ప్రయాణం వుంటుందని విమర్శకులందరూ అంగీకరిస్తారు. విలోమ కథల బీజంపై కవితలో స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా విలోమ కథల్లో చీకటి వర్ణన చాలా అధిక శాతం కన్పిస్తుంది. అవి చీకటి రోజుల్ని సింబలైజ్ చేయటానికి చెప్పిన కథలు కనుక, రాజకీయ వాతావరణం ఆనాడు కన్పించిన అనేక పరిస్థితుల్ని నగ్నముని గ్రహణం కథలో వర్ణిస్తాడు.
‘‘సూర్యుడు చనిపోయాడో, బతికి వున్నాడో తెలీదు. అంతా గాఢాంధకారం’’’ అంటాడు.
‘‘దరిద్రం కంటే భయంకరంగా వుంది చీకటి, దరిద్రం కంటే క్రూరంగా వుందీ చీకటి’’ అంటాడు. దిగంబర కవిత సంపుటిలో చీకటిపై ఒక సుదీర్ఘ కవితే వుంది. ఆ కవిత పేరు కనుదిక్.
‘‘కాళ్లని చుట్టుకుంటూ చీకటి / విదిలించుకుంటూ నడక చీకటి / పాతాళనూతుల ఆత్మహత్యల భవిష్యత్ చీకటి / తోడేళ్ల అరుపుల వర్తమాన స్మశాన చీకటి / మట్టిదిబ్బల చీకటి / జీవితాల్ని నూనెలో వేయిస్తున్న చీకటి’’-
ఇలా ఈ దిగంబర కవిత మొత్తం చీకటిని వర్ణిస్తూ సాగుతుంది. గ్రహణం కథలో కూడా నగ్నముని చీకటి రాత్రిలో మనుషుల ప్రయాణాల్ని, చాలా సుదీర్ఘంగా వర్ణిస్తాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే దిగంబర కవిత్వంలోనే విలోమ కథలకి అవసరమైన సాగ్రి, సరంజామా బీజరూపంలో కాక, నిలువెత్తు అద్దంలానే కన్పిస్తుంది. అంచేత తన దిగంబర కవితల్నీ, ఆ వాతావరణాన్నీ చాలాచోట్ల నగ్నముని మాగ్నిఫై చేసి చూపిస్తాడు. ఒకోసారి సామూహికంగా దిగంబర కవుల యాత్ర కూడా విలోమ కథల్లో వెతుక్కోవచ్చు. దిగంబర కవిత విలోమ కథల్లో చాలా బలంగా కన్పిస్తుంది. కాకపోతే దిగంబర కవిత్వంలో లేని స్పష్టమైన రాజకీయ దృష్టి, దృక్పథం, విలోమ కథల్లో ఎగదన్నుకొస్తాయి.
అదేవిధంగా విలోమ కథల అనంతరం ప్రయాణం కొయ్యగుర్రంలో స్పష్టంగా చూడొచ్చు. కొయ్యగుర్రం 12వ ఖండికలో ముగింపుగా నగ్నముని ఇలా అంటాడు. ‘నాకు రాకెట్లు వొద్దు, చంద్రమండలం వొద్దు, విమానయానాలొద్దు, కాలాన్ని, జీవితాన్ని కలుషితం చేసే రాజకీయ కార్యకలాపాలొద్దు, రైళ్ళొద్దు, బస్సులొద్దు, రుూ నాగరికత రద్దీ ఒద్దు’ అంటూ విలోమంగా ఆలోచిస్తూ పోతాడు.
మరింత తలకిందులుగా ఆలోచిస్తా / పాత రాతియుగం పనిముట్లు పట్టుకొని/ చరిత్ర చీకటి కోణాల గుహల్లోకి / వెళ్లిపోతాను’’- అంటాడు. చాలామంది మేధావులు నగ్నముని తిరోగమనం చేశాడని అందుకే గొడవ పెట్టారు. వాస్తవ తిరోగమ విలువల్ని ప్రశ్నించే నగ్నముని ‘మానవజాతికంతటికీ తనను సంకేతంగా చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాడు. యాంత్రికత నుంచి బైటపడి మానవ అంతర్ బహిర్ ప్రకృతులతో తిరిగి పోరాడాల్సిన ఆవశ్యకతని ఆయన ఇక్కడ చాటి చెప్తున్నాడు. గడియారంలో ముళ్లని విలోమంగా తిప్పినా, సరైన చోటునుంచి అవి ముందుకే కదుల్తాయి. అలా చెప్పేందుకి వాడుకున్న విలోమ శైలి నిరాశావాదంగా, కాల్పనికవాదమని విమర్శించటం తేలికేగాని భ్రమల్నించి బైటపడేయటమే కవి అంతిమ లక్ష్యంగా గుర్తుంచుకోవాలి.
ముందుగానే అనుకొన్నట్లు ప్రతి కవిలోను ఎదుగుదల అతని రచనాక్రమంలోనే అర్థం చేసుకోవటం సులభం.
కవి ఎదిగేకొద్దీ అతని రచనల్లోనూ పరిణతి సిద్ధిస్తుంది. నగ్నముని విలోమ కథల ద్వారా మనకి ముఖ్యంగా నాలుగు విషయాలు తెలుస్తాయి.రాజకీయాలే సామాజిక భ్రష్టతకీ, పేదరికానికీ, అవినీతికి మూల కారణాలు.
ఏ వ్యక్తీ తన చుట్టూ వున్న పరిస్థితులకి గురికాకుండా వుండడు.
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీరామకవచం సాగర్