వినమరుగైన

విలోమ కథలు నగ్నముని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాటలు ఒక హెచ్చరికనో, ప్రమాద సూచికనో, జాగురూకతనో తెలియచేయడానికి ఇలాంటి మాటలు తరచు గ్రామాల్లోనే, లేదు లౌడ్ స్పీకర్లో పట్టణాల్లోనో విన్పిస్తాయి. వాస్తవానికి నగ్నముని కథలు నగర జీవితానికి సంబంధించిన కథలు. అంచేత ఈ హెచ్చరిక ప్రమాద సూచికను ఎగురవేసే విధంగా వుంది. ఈ ఎజెండాలోని మాటలు ఒక రాబోయే విపత్తునో, సమీపించిన నెత్తిమీద పెనుముప్పునో తొలగించుకోమనో చెప్తున్నట్టుగా వున్నాయి. సామాన్యంగా వాతావరణం పొడిగా వుంటుంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేవు అన్నట్టుగా లేవు. చీకటి రోజుల్ని ధ్వనిపూర్వకంగా, నర్మగర్భంగా చెప్పటానికి మరేదారీ లేక చెప్పకుండా వుండనూ లేక, ఎన్నుకున్న మార్గమే ఈ విలోమ రూపేణా రూపొందించిన కథలు అని గ్రహించటం పెద్ద కష్టం కాదు.
నిజానికి ఇవి ఎమర్జన్సీ రోజుల్లో జన జీవనాన్ని వర్ణిస్తూ రాసిన కథలు. రాజకీయ సామాజిక విలువలు విలోమంగా వున్నాయని తెలిపే కథలు. ఇటువంటి నూత్న విధానంలో ఇంతకుముందూ, ఆ తర్వాత ఏ రచయితా ఇలాంటి కథలు రాయలేదు.
విలోమ కథ, విలువలపై కథ, కొత్త టెక్నిక్ ప్రవేశపెట్టిన కథలు. ఈ కథలకి పునర్ముద్రణ లేకపోవటంతో ఈకథలు ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ కథల్లోని నూత్నత్వం తెలీక విమర్శకులు ఈ కథల జోలికి పోలేదు. అనేకమంది విమర్శకులు విలోమ కథలని ప్రస్తావించకపోవటం అటుంచి, యిలాంటి కథల పేరుతో కొత్త శిల్ప వైవిధ్యాన్ని ప్రవేశపెట్టి నగ్నముని పేరుని కూడా ప్రస్తావించకపోవటం ఆశ్చర్యం వేస్తుంది. అదేవిధంగా కథలపై రీసెర్చి చేసినవారు కూడా ఈ విలోమ కథల్ని తెల్సి కూడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క ఆకాశవాణి మాత్రమే ఈ కథల గురించి నగ్నమునితో ఒక ఇంటర్వ్యూని ప్రసారం చేసింది.
వాస్తవానికి నగ్నముని ఈ విలోమ కథల ద్వారా మన సమాజంలోని, రాజ్యంలోని విలోమ ఆలోచనలపై దృష్టి సారించి, అధిక్షేప ప్రతీకాత్మక ధోరణిని వ్యక్తపరుస్తాడు.
ఆధునిక కవితా రంగంలో ఉద్యమాలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ కథా రచనలో ఉద్యమం లేదనే ఉద్దేశ్యంతో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాను అంటారు నగ్నముని.
ఇలా హెచ్చరికగా సాగిన ఇందుమూలముగా కథను సి.సుబ్బారావు ఇంగ్లీషులోకి అనువదించారు. అది ఎపి టైమ్స్ అనే పత్రికలో అచ్చయింది. అంతేగాక ఈ కథని గొప్ప కథగా, కొత్త పంథాగా స్వీకరించటం జరిగింది.
అలాగే ‘పులి-బెబ్బులి’ కథ, పులి అన్నా బెబ్బులి అన్నా ఒకటే. వాస్తవానికి పులి బ్రిటీష్‌వాడికి సంకేతం. ఈ దేశంలో వ్యాపారం కోసం ఈ పులికి ఆవు తల అవసరమైంది. అందుకే ఈ పులి ఆవుతల తగిలించుకొని వ్యాపారం అభివృద్ధి చేసుకుంది.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
-సశేషం

శ్రీరామకవచం సాగర్