వినమరుగైన

నవ్యాంధ్రసాహిత్య వీధులు- కురుగంటి సీతారామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ దారుల వెంబడిపోతే నవ్య సాహిత్య పూర్వ రంగంలోని భిన్నభిన్న వీధులలోకి వెళ్తాం. నవ్య సాహిత్య మూల స్తంభాలను చూస్తాం. నవ్య సాహిత్య విస్తరణను చూచి సంభ్రమ పడతాం. వివిధ కవితోద్యమాల గురించి తెలుసుకొంటాం. ఈ పుస్తకంలో మొదటి భాగం నవ్య సాహిత్య పూర్వరంగం. ఇందులో కురుగంటి, వీరేశలింగం పంతులు నుండి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు వరకు దాదాపు డెబ్భై మంది కవులు, రచయితలను పరిచయం చేశారు.
ముగింపులో నవ్య సాహిత్యం అంటే ఏమిటో విశ్వనాధ సత్యనారాయణ పంచాగ్నుల ఆదినారాయణశాస్ర్తీ చేసిన నిర్వచనాలు ప్రాతిపదికగా, నిర్థారించి చెప్పే ప్రయత్నం చేశారు.
విశ్వనాధ వారి నిర్వచనంలో ఇంతకాలం చరిత్రకు సంఘ ధర్మనీతులకు, సారస్వతానికి గొప్ప సైద్ధాంతిక బలం సమకూర్చిన విశిష్టమైన భారతిజాతి సంస్కారం, ఆంగ్లేయుల ఆక్రమణతో దేశీయల అభిమానాన్ని కోల్పోయిందన్న బాధవుంది. దానికి కొనసాగింపుగా ఆదినారాయణశాస్ర్తీ తత్పరిణామాలను అంచనా వేశారు. పాశ్చాత్య సంస్కారంలోని తప్పొప్పులను నిగ్గు తేల్చకుండానే ఆ సంస్కార ప్రభావంతో వచ్చే రచనలన్నీ నవ్య సాహిత్యమని విశ్వనాధ అంటే, ఆదినారాయణ శాస్ర్తీ ఆంగ్ల పాలన, విద్యావ్యవహారాలు, రాజకీయ సాంఘిక పరిజ్ఞానం స్వదేశాభిమానాన్ని, భాషాభిమానాన్ని పురికొల్పినవి, సంఘంలోని లోపాలను, పరాశ్రయ స్థితిని చక్కదిద్దుకుందామన్న పూనికను కలిగించిందని అంగీకరిస్తూనే స్వజాతి దూషణ, పరజాతి కీర్తన, విదేశీ ఆచార వ్యవహారాలపట్ల, భాషా సంప్రదాయాలపట్ల వ్యామోహం వంటి దోషాలు ఆ గుణాలను వెన్నంటే వచ్చాయని వీటన్నిటిని ప్రతిబింబింపచేసేది నవ్యసాహిత్యమని అన్నారు. దీనిని ఆమోదిస్తూ కురుగంటి సీతారామాచార్యులు పాశ్చాత్య విజ్ఞాన అభిమానంతో వ్రాసే వీరేశలింగం పంతులు మొదలైనవారి రచనలు, సంప్రదాయాన్ని విమర్శించి దానిలో వున్న నిగ్గును చూపే వ్రాతలు కూడా నవ్య సాహిత్యంలో చేరుతాయని నిర్థారించారు. ఆ రకంగా నవ్య సాహిత్య నేపథ్యాన్ని, పరిధిని నిర్థారించటం నవ్యాంధ్ర సాహిత్య వీధులు ప్రథమ భాగంలోని విషయం.
నవ్య సాహిత్య మూలస్తంభాలుగా గిడుగు గురజాడలను చూపించటంతో ప్రారంభించి రాయప్రోలు వైపు దృష్టి మళ్లింపజేసి వాళ్లతో కలుపుకొని దాదాపు వందమంది కవులను, రచయితలను, పరిశోధకులను పరిచయం చేశారు.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కాత్యాయనీ విద్మహే