వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ గ్రంథ ప్రణాళికలో చిన్నయసూరిగారి తరువాత గూడా సాగిన విస్తతమయిన సాహిత్యం పరిచేయటం ఉండనే ఉన్నది. అదట్ల ఉంచితే, ప్రకాశకులు భావించినట్టు ఈ ప్రచురణ ఒకవిధంగా అనిదం పూర్వమే- అంటే, ఇంతకుముందు లేని తీరే. నన్నయగారికి పూర్వం నుంచి అంటే ఇంచుమించు శాతవాహన రాజుల నాటి నుంచి ఆధునికకాలం దాకా దాదాపు రెండువేల సంవత్సరాల సాహిత్య చరిత్రను కేవలం పనె్నండు సంపుటాల్లో ఇంచుమించు మూడువేల క్రౌను సైజు పుటల్లో ఇమిడించటమనే ప్రయత్నం అనిదం పూర్వమే అయితే-
ప్రతి సంపుటంలోని పుటల పరిమితి ముందే నిర్ణయం కావటం వల్ల, ప్రతి ప్రకరణంలో తెలిసిన ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా విరివిగానే రాసినా చివరికి కుదించటం తప్పనిసరి అయింది అన్నారు ఆరుద్రగారు. ఈ కారణంగా సమగ్రత దెబ్బతినగూడదని సంపుటాల సంఖ్యను పెంచి యుగాలనూ చేర్చవలసి వచ్చింది. అయితే ప్రకాశకులు కేవలం పనె్నండు సంపుటాలకూ, నిర్థారిత పుటల సంఖ్యకే పరిమితం కావటంవల్ల కడపటి రాజులయుగంలోనే తమ ప్రచురణ ప్రణాళికను విరమించుకొన్నరు. అందువల్ల అప్పటికది అసంపూర్ణ రచనగానే మిగిలిపోయింది. ఇది 1965 నాటి విషయంకాగా, ఆ తరువాత 1990లో ప్రజాశక్తి బుక్‌హౌస్ వారు మళ్లీ ఈ ప్రచురణకు పూనుకొన్నారు. పుస్తకం సైజు డెమీకి మారింది. పుటల విషయంలో పరిమితినేమీ పెట్టుకోలేదు. సంపుటాల సంఖ్య కూడా పెరిగింది. ఇంచుమించు రెండు సంవత్సరాల్లో పదమూడు సంపుటాలు ప్రచురించారు. ఇది కూడా ఒకవిధంగా అనిదంపూర్వమైన సాహిత్య సేవ. దీనితో ఆరుద్రగారి ఆంధ్ర సాహిత్య చరిత్ర రచనా కృషి సమగ్రమయింది.
ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం చరిత్ర రచనకూ, ప్రచురణకూ కలిసి ఉమ్మడిగా ఒక చిన్న చరిత్ర ఉంది. 1965లో ఈ చరిత్రను సంపుటాలుగా ప్రచురించేందుకు నిర్ణయమయినప్పుడు ఆయన ఒక ఉజ్జాయింపుగా ప్రణాళిక రూపొందించారు. దాని ప్రకారం ఆదినుంచి ఆధునిక కాలం దాకా సాహిత్య చరిత్ర పదమూడు యుగాలుగా విభజించబడింది. ఆదిమ యుగం, చాళుక్య యుగం అనే రెండు తొలి యుగాలతో మొదటి సంపుటం కాగా, అక్కడినుంచి వరుసగా కాకతీయ యుగం, పద్మనాయక యుగం, రెడ్డిరాజుల యుగం, తొలి రాయలయుగం, మలి రాయల యుగం, నవాబు యుగం, నాయక రాజుల యుగం, కడపటి రాజుల యుగం, కుంఫిణీ యుగం, జమీందారీ యుగం, ఆధునిక యుగం అంటూ పదకొండు యుగాలు. ఒక్కొక్క యుగం ఒక్కొక్క సంపుటంగా, తొలి రెండు యుగాల మొదటి సంపుటంలో కలుపుకొని మొత్తం పనె్నండు సంపుటాలు. 1965 ఏప్రిల్ నుండి ఎమెస్కోవారు నెలకొకటిగా సంపుటాల ప్రచురణ, వితరణ ఆరంభించారు. ఒకటి రెండు సంపుటాలు వెలువడేటప్పటికి, సాగుతున్న రచనా విధానాన్నిబట్టి యుగాలసంఖ్య పెరగవలసివచ్చిందిరెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

-కోవెల సంపత్కుమారాచార్య