వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెడ్డి రాజుల యుగం తరువాత గజపతుల పేర మరో యుగం, నవాబుల యుగం తరువాత ఆరవీటి రాజుల పేర మరో యుగం పెరిగింది. విషయ విస్తృతిని బట్టి నాయక రాజుల యుగం ఒకటికి బదులు రెండు సంపుటాలు వెలువడినాయి. అప్పటికే రచనలో జాప్యం రాసాగింది. అందువల్ల 1966 ఫిబ్రవరి నెలలో రెండూ, మార్చిలో ఒకటి, 1968 ఫిబ్రవరిలో ఇంకొకటిగా నాలుగు సంపుటాలు వెలువడినాయి. ఈ చివరిది కడపటి రాజుల యుగం. ఇక్కడితో ఎమెస్కోవారు ప్రచురణ ఆపివేశారు. దానితో సమగ్రాంధ్ర సాహిత్యం ప్రచురణ అసమగ్రంగానే మిగిలిపోయింది. రచన కూడా ఆరుద్రగారి రకరకాల అనారోగ్య కారణాలవల్ల ఆగిపోయింది. ఇంచుమించు ఇరవయ్యేళ్ళ కాలం గడిచింది. అప్పుడు ప్రజాశక్తి బుక్‌హౌస్ వారు ముందుకు వచ్చి మళ్లీ తొలి సంపుటం మొదలుకొని చివరి సంపుటందాకా ప్రచురించేందుకు ఉద్యమించారు. ఇక్కడ నవ్య సాహిత్యం పేరిట మరొక యుగం పెరిగి జమీందారీ యుగంతో కలుపటంతో మరో సంపుటం పెరిగింది. ఈ రెండవ ప్రచురణ వేళ ప్రతి సంపుటూ ఇంచుమించు రెట్టింపుగా పెరిగింది. ఆరుద్రగారి మళ్లీ మొదటినుంచీ తిరుగరాసినంత పనిచేశారు. చేర్పులు, కూర్పులు, మార్పులు ఉపయోగకరమైన అనుబంధాలు అనేకంగా చేరినాయి. 1989 మార్చిలో మొదలుపెట్టి 1991 జూన్ మొత్తం పదమూడు సంపుటాలను ప్రజాశక్తివారు ప్రచురించారు. దీనితో సమగ్రాంధ్ర సాహిత్య రచన, ముద్రణ సమగ్రమయింది.
ఈ నూతన ప్రచురణలో యుగాల- సంపుటాల తీరు ఇలా ఉంది. మొదటి సంపుటం ఆదిమ- చాళుక్య యుగాలు; రెండవది కాకతీయ యుగం; మూడవ దానిలో పద్మనాయక - రెడ్డి రాజుల యుగాలు, నాలుగవ దానిలో గజపతుల- తొలిరాయల యుగాలు కలిసినాయి. అయిదవ సంపుటం మలిరాయల యుగం. ఆరవదానిలో నవాబుల- ఆరవీటి రాజుల యుగాలు. ఏడవది నాయక రాజుల యుగం. ఎనిమిదవది కడపటి రాజుల యుగం. కుంఫిణీ యుగం, రెండు భాగాలుగా తొమ్మిది, పది సంపుటాలు, జమీందారీ- నవ్య సాహిత్య యుగాలు రెండు భాగాలుగా పదకొండు పనె్నండు సంపుటాలు. చివరిది పదమూడోది అయిన సంపుటం ఆధునిక అభ్యుదయ యుగం. ఇదీ ఆరుద్రగారి ఆశయమయిన ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ సమగ్రత.
సమగ్రాంధ్ర సాహిత్యం రచనా విధానంలో ఆరుద్రగారు ఇంచుమించుగా ఆద్యంతమూ ఒక పద్ధతి పాటించారు. ప్రతి యుగానికి మొదట ఆ యుగానికి పరిమితం చేసుకోబడిన కాలం ఖండంలోని దేశ చరిత్రను వీలయినన్ని అవసరమయినన్ని వివరణలతో మొదటి ప్రకరణంగా రచించారు. ఈ యుగాది ప్రకరణాల్లో కేవలం రాజుల, పరిపాలన విషయమేకాక నాటి ఆర్థిక- సామాజికాంశాలను వివరించటానికి కూడా ఆయన ప్రయత్నించారు. కేవలం చారిత్రకాంశాలను పూర్వరంగంగా వివరించే పద్ధతి కవిత్వవేది, కల్లూరి వేంకట నారాయణరావుగారి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహం రచనలోనూ కన్పిస్తుంది. అయితే అక్కడ ఆరుద్రగారిలో కన్పించే మార్క్సిస్టు భావజాల ప్రభావ గాఢత కన్పించదు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

-కోవెల సంపత్కుమారాచార్య