వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుంఫిణీయుగం తొలి సంపుటంలో చివరి పదమూడవ ప్రకరణంగా చిట్టచివర కారల్ మార్క్స్ విశే్లషణ పాఠకులకు అందించారు. అట్లా అందించటానికి కారణం వివరిస్తూ - ‘శాస్ర్తియ సామ్యవాద దృక్పథంలో ఈ యుగ చరిత్రను అధ్యయనం చేయటం అవసరం. గతి తార్కిక, చారిత్రక, భౌతికవాదాల ప్రాతిపదికపై శాస్ర్తియ సామ్యవాద స్థాపనా చార్యులయిన కారల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగిల్స్ భారతదేశ చరిత్రనూ, తూర్పిండియా కంపెనీ పుట్టుపూర్వోత్తరాలనూ, దాని కట్టకడపటి దశనూ, భావి ఫలితాలను చర్చిస్తూ, తమ రచనలలో చక్కని విశే్లషణ చేశారు. కారల్ మార్క్స్, 1953 జూన్ 10వ తేదీన నుండి కొన్ని ముఖ్యాంశాలను చెప్పుకొనడం మన అవగాహనకు తప్పనిసరి ప్రాతిపదిక. ఆ సంగతులను నివేదిస్తానన్నారు ఆరుద్రగారు. కుంఫిణీ యుగ చరిత్ర అవగాహనకు అవసరంగా ఈ నివేదిక కాగా, పూర్వ యుగాలకు సంబంధించి మార్క్సీయ విశే్లషణ- విధానం అంతగా కన్పించదు. కవిత్వవేదిలో యుగ క్షణ సమన్వయం. ప్రతి యుగాంతాన చేయబడిన తీరు నిజానికి ఆరుద్రగారి రచనలో అవసరం. ఒక కాలపు చారిత్రక సందర్భాలకూ, అప్పుడు ఉత్పత్తి అయిన సాహిత్యానికి, దాని స్వరూప స్వభావ రీతులకూ ఏవిధమైన సంబంధం ఉంది? ఎంతవరకు ఉంది? వంటి విశే్లషణ, సమన్వయం ఆరుద్రగారి రచనలో సహజంగా ఆశించబడుతుంది. కాని ఆరుద్రగారు ఎక్కడో మెరుపుల్లాగా ఫ్యూడల్, బూర్జువా ఆర్థిక పరిస్థితులను స్ఫురింపజేసే పద వాక్యాలు ప్రయోగించటంతో మాత్రమే రచన సాగించారు. యుగ లక్షణ స్వభావ సమన్వయాన్ని పాఠకుల అవగాహకే ఆరుద్రగారు వదిలివేసినట్టు భావించవలసి ఉంటుంది. అట్లా ఉంచి-
ఆదిమ యుగమన్నా, మరే యుగమన్నా తెలుగు సాహిత్య చరిత్రకారులకు నన్నయగారికి పూర్వపు సాహిత్య స్థితిని ప్రస్తావించటం ఒక తప్పనిసరి పరిపాటి. శాతవాహనుల కాలం నుంచి చాళుక్యుల కాలం దాకా ఇంచుమించు వెయ్యేళ్ల కాల పరిమితితో ఆరుద్రగారు రచించిన ఆదిమయుగంలో చాలా భాగం తెలుగు భాషా చరిత్రకే ప్రధానంగా ఉపకరిస్తుంది. నన్నయగారికి సర్వదేవుడు వంటి ఎవరో కొందరు కవులు; శాంతి పురాణం, ఆది పురాణం వంటి కావ్యాలూ ఉండటం గూర్చిన విచారణ ప్రధానంగా పరిశోధనా తౌల్యం మాత్రమే. అవన్నీ జైన రచనలు గాబట్టి బ్రాహ్మణ సంప్రదాయం దాన్ని నాశనం చేసిందని అనటం ఆధునికమైన ఊహ. కవిజనాశ్రయం రచించిన రేచన, నన్నయ గారి కన్నా పూర్వుడన్నది అంత సులభంగా తేలే విషయం కాదుగదా. రేచన జైనుడు కాబట్టి అతని రచనను భీమనచ్ఛందమని జైన విరోధులు ప్రచారం చేశారనటం కూడా ఆధునికమైన ఊహా విషయం మాత్రమే. అట్లా ప్రచారం చేయటం కన్నా దాన్ని హతమార్చటం ఎందుకు జరుగలేదన్నది ఆలోచించే విషయం కాకపోవటం ఒక విచిత్రం. అదట్లా ఉంచి కవి జనాశ్రయమన్న ఛందోగ్రంథం రచించబడటానికి కావలసినంత ముడిసరుకుగా పనికివచ్చే సాహిత్యం బయటపడనంతకాలం నన్నయ కన్నా ఆ రచన పూర్వపుదనటాన్ని సందేహించవలసి ఉంటుంది.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సశేషం

-కోవెల సంపత్కుమారాచార్య