వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడాన్ని అనుసరించిన రేచన కన్నడంలోని బ్రహ్మవిష్ణు రుద్ర గణాలను సూర్యేంద్ర చంద్ర గణాలుగా ఎందుకు మార్చాడన్నదీ ఒక ప్రశే్న. అక్కడ జాతి పద్యాలని దేశి పద్యవర్గాలను విభజించటం ఎందుకన్నదీ మరో ప్రధాన ప్రశ్న. కన్నడచ్ఛందో విధానానికి భిన్నంగా కవిజనాశ్రయకర్త చెప్పిన అంశాలకు కారణాలను వెదుకవలసే ఉంది. కాగా, నన్నయగారి కన్నా పూర్వపు సాహిత్యాన్ని గూర్చి ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా, నిజానికి తెలుగు సాహిత్య చరిత్ర అచ్చంగా నన్నయగారితోనే మొదలవుతున్నది. ఆ మొదలుకావటానికి చాళుక్య రాజరాజు మూలకారణం అవటంవల్ల ఆ యుగాన్ని చాళుక్య యుగం అనటం అభ్యంతరకరమైన అంశమేమీకాదు. కాని కాకతీయులూ, గజపతులవంటివారు దేశ చరిత్రపరంగా ఎంతో ప్రాధాన్యం పొంది ఉండవచ్చు. సాహిత్యపరంగా ఎంతో ప్రాధాన్యం పొంది ఉండవచ్చు. సాహిత్యపరంగా వారు సంస్కృత సాహిత్యానికి ఎంతగానో ప్రోత్సాహం, పోషణ కలిగి ఉండవచ్చు. కాని తెలుగు సాహిత్య విషయంగా వారు చేసింది మృగ్యమే. మరి ఆయా రాజులు అట్లా విముఖులు కావటానికి చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కారణాలను ఇంకా వెదుకవలసే ఉంది. కాగా, ఆయా యుగాలకు ఆ రాజ వంశాల పేర్లు పెట్టటం కేవలంగా ఆ యుగం ఆయా రాజ వంశాల పరిపాలనలో ఉండటమే కావచ్చుననుకోవలసి ఉంటుంది. అదట్లా ఉంచి - సాహిత్య చరిత్ర రచనలో ఆద్యంతం రాజవంశాల పేర్లో, కవుల పేర్లో, ప్రక్రియల పేర్లో యుగాలుగా ఉండాలనుకోవటం ఒక పరిపాటిగా ఉందిగానీ, ఆయా కాలాలలోని పరిస్థితిని బట్టి వివిధ రీతులలో యుగాలను గుర్తించటంలో ఇబ్బంది ఏమైనా ఉంటుందా? అనేది సాహిత్య చరిత్రకారులు ఆలోచించవలసిన ఒక అంశంగా కన్పిస్తున్నది. నవ్య సాహిత్య యుగమన్నదీ, ఆధునిక యుగమన్నదీ నవ్యత్వంమీదా, ఆధునికత్వంమీదా ఏర్పడ్డ పేర్లేనన్నది ఇక్కడ గమనించవలసిన అంశం.జమీందారీ యుగంలోనే నవ్య సాహిత్య యుగాన్ని కలిపివేయటంలో నవ్యసాహిత్యానికి కలుగవలసిన ప్రాధాన్యం కలుగకుండా పోయిందనిపించటంలో అసమంజసం ఏమీ కన్పించదు. ఆధునిక యుగం కేవలం అభ్యుదయ సాహిత్యానికి మాత్రమే పరిమితం చేయబడింది. మరికొంత జాగ్రత్తగా చెప్పితే అభ్యుదయ రచయితల సంఘ చరిత్ర మాత్రమే ఆధునిక యుగంగా నిరూపించబడిందన్నా అభ్యంతరమేమీ ఉండనవసరం లేదు. ఆరుద్రగారు ఈ యుగంలో విపులంగా అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని, అందుకు సహకరించిన, అన్వయించిన అబ్బూరి రామకృష్ణారావు, పురిపండా అప్పలస్వామి, శిష్ట్లా ఉమామహేశ్వరరావు, సామినేని ముద్దుకృష్ణ, శ్రీరంగం నారాయణబాబు, శ్రీరంగం శ్రీనివాసరావుల చరిత్రలనూ, కవులుగా వారి ఎదుగుదలనూ, ప్రాధాన్యానే్న చిత్రించారు. తిలక్, కుందుర్తి, అనిసెట్టి, బెల్లంకొండ రామదాసు, విద్వాన్ విశ్వం, తుమ్మల వెంకట్రామయ్య, పిఠాపురం యువరాజు, జలసూత్రం రుక్మిణీనాథశాస్ర్తీ, పఠాభి, బైరాగి అనే పదిమందిని పరిచయం చేశారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

-కోవెల సంపత్కుమారాచార్య