వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచన కవిత ప్రారంభ పరిణామాలను స్థూలంగా వివరించారు. తెలంగాణ సమర సాహిత్యం పరిచయం చేశారు. గుర్రం జాషువా, దువ్వూరి రామిరెడ్డిని కవి కోకిలలంటూ అభ్యుదయ సాహిత్యం మధ్యలో చేర్చటం కొంత చిత్రంగానే ఉంది.
అదట్లా ఉంచి దాశరథి వంటి తెలంగాణ కవులకు ప్రాధన్యం లేదు. సోమసుందర్ వంటివారిని ఇందులో చేర్చుకోవలసి వస్తుంది. తానే ఇదంతా రాస్తున్నారు గాబట్టి ఆరుద్రకూ ప్రాధాన్యం ఇవ్వకపోవటానికి ఆరుద్రగారి వినయశీలం కారణం కావచ్చు. ఇక్కడ మరొక విషయం గమనించవలసి ఉంది. ఆధునిక యుగాన్ని కేవలం అభ్యుదయ సాహిత్య విషయంగానే చిత్రించటంవల్ల అభ్యుదయ సాహిత్యానికి సమాంతరంగా సాగిన ఇతర సాహిత్య విశేషాలేవీ ఆధునిక యుగంలో లేవనిపిస్తుంది. కాని సమాంతర సాహిత్యం ఉత్తమయిందీ మరెంతో ఉంది.
కాగా, 1990 నాటికే ఎంతో విస్తరించిన విప్లవ సాహిత్యం, ఉద్యమంగా సాగిన విప్లవ రచయిత సంఘం విషయాలు ఇందులోకి రాకపోవటానికి కారణాలను వెదుకవలసే ఉంది. స్ర్తివాద, దళితవాదాలే కాక, ఆధునికోత్తర వాదం కూడా అప్పటికే వచ్చింది. వాటికి కూడా ఆధునిక యుగంలో ప్రవేశం దొరకలేదు. అభ్యుదయ సాహిత్యానికి మాత్రమే ఆధునిక యుగం పరిమితం చేయబడిందనుకోవటమే వీటన్నిటికి సమాధానమనుకోవలసి ఉంటుంది.
నిజానికి ఆధునిక యుగం వీరేశలింగం గారితోనే మొదలవుతుంది. అప్పటినుంచే అనేక ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో ప్రవేశించినయి.నవ్య కవిత్వం లేదా భావ కవిత్వం తెలుగులో మొదటి కవితోద్యమం. అనేకమంది గొప్ప గొప్ప కవులూ, రచయితలూ భావ కవితాయుగంలో తెలుగు సాహిత్యాన్ని ఆకాశాంచలాల దాకా ఎదిగించారు. విస్తరింపజేశారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

-కోవెల సంపత్కుమారాచార్య