వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రుూ నవీన ప్రక్రియలూ, కవులూ, రచయితలూ మొదలైనవారిని గురించి జమీందారీ యుగంతో కలిపిన నవ్య సాహిత్య యుగంలో పరిమిత పరిచయం మాత్రమే లభిస్తుంది.
తెలుగు సాహిత్య చరిత్ర రచనలో తొలినాళ్ల నుంచి పలు కావ్యాల కర్తలను గురించి వివాదాలు చాలా వున్నాయి. ఉదాహరణకు రంగనాథరామాయం కర్తృత్వం క్రీడాభిరామ కర్తృత్వం ఉత్తర రామాయణ కర్తృత్వం మొదలయినవి. ఇటువంటి సందర్భాల్లో ఆరుద్రగారు పూర్వపు వాదాలను ప్రస్తావించటంలో చూపిన ఆస్థి నిర్ణయాల విషయంలో చూపించినట్టు కన్పించదు. బుద్ధారెడ్డి రామాయణానికి రంగనాథ రామాయణంగా పేరెందుకు వచ్చిందో సంయుక్తికంగా నిర్ణయించటం అవసరం. క్రీడాభిరామం విషయంకూడా అంతే.
కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం విషయం కూడా అంతే కాగా, ఆరుద్రగారు వివరాలు అందించారే తప్ప నిర్ణయాలకు ఉద్యమించలేదు.ఈ రకమయిన అనేకాంశాల విషయమెట్లా ఉన్నా, సాహిత్య చరిత్రను ఒక కథ చెబుతున్నంత ఆకర్షణీయంగా పాఠకులకు అందించటం సమగ్రాంధ్ర సాహిత్యం రచనా శైలిలో గుర్తించవలసిన ఒక ప్రధానాంశం. ఆదిమ యుగాన్ని అనగనగా ఒక ఈగ ఇల్లలుక్కొంటూ తన పేరు మరిచిపోయిందట. పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతి గొడ్డలీ నా పేరేమిటీ అని ఎందరెందరినో పేరు పేరునా వరసపెట్టి అడిగిందట.
అచ్చంగా తెలుగువాడనే తేనెటీగ తన సంగతి మరిచిపోవటం జరిగింది’ అంటూ ఒకపిట్ట కథగానో, పిల్లల కథగానో ఆరుద్ర ఆరంభించరు. ఇంచుమించు ప్రతి యుగారంభం ఇట్లాంటి కథతోనే, సామెతలతోనో మొదలవుతుంది. మధ్యమధ్యలో రకరకాల చమత్కార వచనాలు పాఠకాకర్షణ కలిగిస్తాయి.

-కోవెల సంపత్కుమారాచార్య