వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి ముద్రణలోని రచన కన్నా మలి ముద్రణలోని రచన చిక్కబడటం, పరిశోధన లక్షణం పెరగటం చూడొచ్చు.
ఒంటి చేతిమీదుగా ఇంతటి సమగ్రాంధ్ర సాహిత్యం చరిత్ర రచనకు పూనుకోవటం నిజంగా ఒక సాహసమే అయినా, ఒంటిచేత సంపాదించిన అమూల్యమయిన సమాచారం అందించటం ఓ సాహసం ఫలమే. కుంఫిణీయుగం దాకా సాహిత్య చరిత్ర రచనలూ, చర్చలూ వాదాలు వచ్చినయి. కవులనూ, కావ్యాలనూ గూర్చి అనేక విషయాలు ప్రసిద్ధికి వచ్చినయి. కావ్య సమీక్షల్లో అభిరుచి భేదాలుండటం సర్వసామాన్యం. ఆరుద్రగారి రచనలోనూ ఈ లక్షణం స్పష్టపడుతుంది. అదట్లా ఉంచితే కుంఫిణీ యుగం, జమీందారీ యుగాలకు సంబంధించిన సమాచారం చాలా తక్కువ. ఆంగ్లేయులు, ప్రత్యేకంగా సి.పి.బ్రౌను వంటివారూ, వారికి అనేక విధాలుగా సహాయపడి పేరు సంపాదించి పెట్టిన దేశీయులూ, వారి వారి కృషి, కృషి ఫలితాల వివరాలను ఆరుద్రగారు ఎంతో శ్రమించి సంపాదించారు. ఆ సమాచారం ఆయా విషయాలకు పరిమితమయి పలు పరిశోధనలు జరిగి ఉండవచ్చు. ఉదాహరణకు కొత్తపల్లి వీరభద్రరావుగారు తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం, బ్రౌను గూర్చిన గ్రంథాలు చూడవచ్చు.
కాని, అనుపూర్విగా ఆ సమాచారం పాఠకులకు తగినంతగా ఆరుద్రగారి రచనలో ఒక్క చోటనే లభిస్తుంది. నిజానికి తెలుగు సాహిత్య చరిత్రలో ప్రాచీన యుగాల సాహిత్యం గూర్చి రాయటంకన్నా, ఒక విధంగా చూస్తే, ఆంగ్లేయ ప్రభావం ఆరంభమయినప్పటినుండి సాగిన చరిత్ర రాయటం క్లిష్టమయిన వ్యవహారం. ఈ అంశాన్ని ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం నిరూపిస్తున్నది. నిర్ణయాలతో విభేదించవచ్చుగాని వక్రీకరించబడని సమాచార విషయంగా విభేదించటం అనేది ఉండదు. ఆ విధంగా ఆరుద్రగారు అందించిన సమాచారం ఎంతో విలువయింది. పాఠకులకు అవగాహనా సౌలభ్యం కలిగిస్తుంది. తొలి ముద్రణలో దాదాపుగా కన్పించని అనుబంధాలు మలి ముద్రణలోఎన్నో ఆరుద్రగారు చేర్చటం పాఠకుల సౌకర్యం కోసమే. కవులపేర్లు తెలిసి వారి రచనలు అలభ్యం కావటం, కావ్యాల పేర్లు తెలిసి వాటిని రచించిన వారి వివరాలు తెలియకపోవటం సాధారణంగా కన్పించే విషయమే. వాటి విషయంగా చూస్తే ఆరుద్రగారు సర్వదేవుని వంటివారి విషయంగా చేసిన పరిశ్రమ యొక్క విలువ తెలుస్తుంది.
అనారోగ్యాలను అధిగమించి, ఆరోగ్యాలను సంపాదించుకొని ఇంచుమించు పాతికేళ్ల ఆరుద్రగారి జీవితాదర్శ ఫలంగా రూపొందింది ఈ సమగ్రాంధ్ర సాహిత్యం. దీనికి చివరి స్వస్తివాచకం పలుకుతూ ఆరుద్రగారు ఇచ్చుకొన్న సంచాయిషీ స్మరించదగింది.
‘‘ఏ సాహిత్య చరిత్రకైనా వర్తమాన యుగం ప్రారంభం అవుతుందిగాని ఎన్నడూ పరిసమాప్తం కాదు. ఒక్కొక్క ప్రక్రియకూ ఒక సంపుటం చొప్పున రాయవలసినంత విస్తృతమయిన ఆధునాతన యుగ చరిత్రను ఒక సంపుటంలోకి కుదించటం సాహసమే అయినా సాధ్యంకాని విషయం.
నడుస్తున్న చరిత్రలో సంస్థల భోగట్టాలూ, ఉద్యమాల ఘట్టాలు కథనం చేస్తున్నపుడు విరామ చిహ్నాలు ప్రకరణాల కామాలు, ఉపయోగాల సెమికోలన్లూ ఉంటాయే తప్పించి ఫైనల్ ఫుల్‌స్టాప్.. (ఉండదు) ఎప్పుడూ ఇంకా ఉండదనిపించే ఈ చరిత్ర’.
ఆరుద్రగారి ఈ సంజాయితీ ఆధునిక యుగానికి సంబంధించిన పట్టు కన్పించినా పూర్వ యుగాలన్నింటికీ ఉమ్మడిగా వర్తిస్తుంది. సృష్టిలో లోపరహితమయిందంటూ ఏదీ ఉండదు. కాగా, మొత్తంమీద చూసినపుడు ఆరుద్రగారి సమగ్రాంధ సాహిత్యం పలువిధాలుగా అభినందించదగిన మహాగ్రంథం.
సంపూర్ణం

-కోవెల సంపత్కుమారాచార్య