వినమరుగైన

సాహిత్యంలో దృక్పథాలు ఆర్. ఎస్. సుదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాన్ని గురించి స్థిరమైన, శాశ్వతమైన నిర్వచనాలు ఏమీ లేకపోవటంవల్ల మారుతూవున్న జీవితానుభవానికి అనుగుణంగా కొత్త నిర్వచనాలు, భావనాత్మక చట్రాలు ముందుకు వస్తూ వుంటాయి. జీవితానికి, సాహిత్యానికి వున్న సహజ సంబంధంవల్ల ఆ జీవితాన్ని సాంకేతికరించే సాహిత్య స్వరూప, స్వభావాల్లో కూడా మార్పులు రావటం అనివార్యం. ఇటువంటి మార్పులోంచి రూపొందిన సాహిత్యాన్ని విశే్లషించే పద్ధతుల్లో, పరికరాల్లో కూడా మార్పు తప్పనిసరి. దీనికి కారణం జీవితాన్ని విశే్లషించే పద్ధతుల్లో, పరికరాల్లో కూడా మార్పు తప్పనిసరి. దీనికి కారణం జీవితాన్ని విశే్లషించటానికి స్థిర పరికరాలు లేనట్టుగానే సాహిత్య విశే్లషణకు కూడా స్థిర పరికరాలు లేకపోవటమే. మారుతూ వున్న జీవితంతోపాటు సాహిత్యం, ఆ సాహిత్యాన్ని విశే్లషించే పద్ధతులు మారుతూ వున్నపుడు మాత్రమే ఆ భాషా సాహిత్యం సజీవంగా వున్నట్టు లెక్క. తెలుగు సమాజంలో ఈ పరిణామం సజీవంగా వున్నప్పటికీ సాహిత్యం, సాహిత్య విమర్శల మధ్య అంత సయోధ్యత కన్పించదు. ఆధునిక సాహిత్య చరిత్రలో ఏ సందర్భాన్ని పరిశీలించినా ఈ అంశం అర్థమవుతుంది.సాహిత్య వ్యక్తీకరణలో వచ్చే మార్పులకి అనుగుణంగా సాహిత్యాన్ని అంచనావేసే, విశే్లషించే పద్ధతుల్లోకూడా మార్పు రాకపోయినట్లయితే ఆ స్థాయిలో సాహిత్యానికి నష్టం జరుగుతుంది. సాహిత్యం ముందుకుపోతూ వున్నపుడు సాహిత్య విమర్శ వెనుకబడి వుండటంవల్ల క్రమంగా సాహిత్య ఎదుగుదలకి అది అడ్డంకిగా మారుతుంది.
- సశేషం

బి. తిరుపతిరావు