వినమరుగైన

సాహిత్యంలో దృక్పథాలు ఆర్. ఎస్. సుదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో సాహిత్య విమర్శ సాహిత్య ఎదుగుదలకి అడ్డంకి అయిందని చెప్పలేం కానీ, కనీసం సాహిత్య వికాసానికి సాహిత్య విమర్శ చేసిన దోహదం పెద్దగా లేదని చెప్పవచ్చు.
తెలుగు సాహిత్య ప్రపంచంలో ముఖ్యం గా ఆధునిక తెలుగు సాహిత్యంలో సాహిత్య విమర్శ వౌలికంగా సామాజిక శాస్త్ర ప్రాతిపదికగా కొనసాగింది. ఈ సామాజిక శాస్త్ర విమర్శకి వున్న పరిమితి సాహిత్య విశే్లషణల్లో స్పష్టంగా కన్పిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలు ప్రధాన ధోరణిగా వున్న సామాజిక శాస్త్ర విమర్శ తెలుగు సాహిత్యాన్ని దాన్ని బహు పార్శ్వాలలో విశే్లషించటంలో విఫలమయింది.
తన అంచనాల కందని రచనల్ని, రచయితల్ని సామాజిక శాస్త్ర విమర్శక తిరోగమనవాదులుగా చిత్రించి నిరాకరించింది. నిర్దిష్ట లేక ప్రత్యక్ష రాజకీయోద్యమాలతో, వాదాలతో సంపర్కంలోని రచయితలు విస్మరణకి గురవటమే కాకుండా, పలు సందర్భాలలో నిందలకు కూడా గురయ్యారు. తెలుగు సాహితీ ప్రపంచంలో సామాజిక శాస్త్ర విమర్శ అంటే చాలాకాలంపాటు మార్క్సిస్టు సాహిత్య విమర్శ (1980ల తరువాత ఈ స్థితి మారింది). 1960ల తరువాత అమలులో వున్న సాహిత్య విమర్శ పరిమితులు అవగతమయినప్పటికీ అప్పటి రాజకీయ వాతావరణంలో అవి స్పష్టంగా వ్యక్తీకరింపబడలేదు. ఆర్. ఎస్. సుదర్శనంలాంటి వాళ్లు ఈ ప్రయత్నం చేశారు.
- సశేషం

బి. తిరుపతిరావు