వినమరుగైన

సాహిత్యంలో దృక్పథాలు ఆర్. ఎస్. సుదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందులో భాగంగానే 1968లో ఆయన సాహిత్యంలో దృక్పథాలు అనే సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి వెలువడింది. తెలుగు సాహిత్య విమర్శలో కొన్ని కొత్త విశే్లషణా పరికరాల్ని సుదర్శనం ఈ వ్యాసాల్లో ఉపయోగించుకున్నారు. తద్వారా సాహిత్య విమర్శలో తనదైన శైలినీ, పద్ధతిని సుదర్శనం ప్రవేశపెట్టారు. సాహిత్య విమర్శ రంగంలో కొన్ని నవ్య పద్ధతుల్ని ముందుకు తీసుకురావటం ద్వారా ఆధునిక తెలుగు సాహిత్య విమర్శలో సుదర్శనం సాహిత్యంలో దృక్పథాలు ఒక కీలకమైన రచనగా మిగిలింది.
తెలుగు సమాజంలో 1960లలో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలు ఒక సాహితీ, సాంస్కృతిక నేపథ్యాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. విప్లవ రచయితల సంఘం సృష్టించిన సాహిత్యం ప్రధానంగా ప్రత్యక్ష రాజకీయాల్ని చర్చించిన, విశే్లషించిన సాహిత్యం, ఫలితంగా తెలుగు విమర్శ మీద దాని ప్రభావం 70ల తరువాత స్పష్టంగా కన్పిస్తుంది. సుదర్శనం పుస్తకం 70లకి ముందు రావటంవల్ల వాచక విశే్లషణలు కొంత విస్తృతిని, విశాలతత్త్వాన్ని ప్రదర్శించటానికి అవకాశం ఏర్పడింది. అప్పటికి రూపుదిద్దుకుంటూ వున్న మొరటు వర్గీకరణలకి అతీతంగా సాహిత్య విశే్లషణ చేయటానికి, అమలులో వున్న సాహిత్య విమర్శకి వెలుపల మంచి సాహిత్య విశే్లషణా పరికరాలు వున్నాయనే విషయాన్ని రుజువుచేయటానికి సుదర్శనానికి వీలు కలిగింది. నిజానికి ఈ పనిని 1940లలో జి.వి.కృష్ణారావు లాంటివాళ్లు ప్రారంభించారు. అయితే సుదర్శనం దాన్ని మరింత శక్తివంతంగా కొనసాగించారు.
సాహిత్యంలో దృక్పథాలు పుస్తకాన్ని చదవగానే మనకు అనేక ప్రశ్నలు స్ఫురిస్తాయి. అసలు ఒక రచనని అర్థం చేసుకోవటానికి ఆ రచనమీద కాక రచయిత తాతిత్వక దృక్పథంమీద పాఠకుడెందుకు ఆధారపడాలి? పాఠకుడి స్పందన రచయిత అభీష్టానికి అనుగుణంగా ఎందుకుండాలి? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి.రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

బి. తిరుపతిరావు