వినమరుగైన

శారద లేఖలు( కనుపర్తి వరలక్ష్మమ్మ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తత్త్వాలున్నాయి. వాద ప్రతివాదాలున్నాయి. లేఖారచన ఆసక్తికరంగా ఆరంభమవుతుంది. వ్రాసే లేఖల్లో మరికొందరి లేఖల ప్రస్తావన ఉంటుంది. ఆయా లేఖలను జతచేయడం ఉంటుంది. లేఖల్లో విషయాలు సార్వజనీనాలైనందున సుదీర్ఘంగా వివరించినా అలా అనిపించదు.
లేఖలన్నీ భావపురి నుండే వెలువడ్డాయి. బాపట్లకు మరోపేరు భావపురి అని గ్రహిస్తాం. 1896లో జన్మించిన వరలక్ష్మమ్మగారికి 13వ ఏట వివాహమయ్యింది. భర్త హనుమంతరావుగారు 1929లో ఇంగ్లండు వెళ్లి వచ్చారు. ఆరోగ్య శాఖ, శానిటరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు.
బాల్య వివాహ కారణంగా దుఃఖంలో చిక్కుకున్న ఒకరి మాటలు 28 నవంబరు లేఖలో ‘నాయనా, నేను కూడా పూర్వాచార పరాయణుడనే. ఈ అనుభవమే కాకపోయినచో నేను కూడా నీకంటె నెగిరిపడువాడనే. స్వానుభవము నా నోరు నొక్కినది. ఏ బిల్లునైన వ్యతిరేకింపుడు. వధూవరులకు వైవాహిక బాధ్యత నొసంగెడి రుూ బాల్య వివాహ నిషేధ చట్టమనకు ప్రతికూలముగా తీర్మానములు గావించి ఆడపిల్లల నోట మట్టిగొట్టకుడు’ అని వివరిస్తారు.
29 జనవరి ఉత్తరంలో శారదానికేతనం గురించి తన తొలి అభిప్రాయాన్ని ఐదేళ్లలో అది స్ర్తిలకు చేస్తున్న అపూర్వ కృషికి- వారి వార్షికోత్సవాలు పొందిన బహుజనాదరణను గురించి వ్రాస్తూ శారదానికేతనానికి దానం చేసే యశోవిశాలురు కావాలంటారు.
దక్షిణదేశ యాత్రలో తమిళ, కేరళ స్ర్తిల మధ్య అంతరాలను చెపుతారు. సరిహద్దులో వారైనా ఎవరితీరు వారిదేనంటారు. తమిళుల కర్ణ్భారణములతో చెవితమ్మెలు రబ్బరు తాడులవలే సాగాయంటారు. తమిళ స్ర్తిలు తెల్లచీరలు కట్టరు; మలయాళంలో స్ర్తిలు రంగు వస్తమ్రులును ధరింపరని- మరెన్నో అంతరాలు చెపుతూ కేరళ స్ర్తిలపట్ల తమకేర్పడిన ఆకర్షణను సహేతుకంగా వివరిస్తారు. శ్రీరంగంలో ఏజెంట్లు పెట్టే బాధలు, పారిశుద్ధ్యం లేకపోవడం నాటి దుస్థితికి దర్పణంగా నిలుస్తాయి.
స్ర్తిలు నాటకరంగ ప్రవేశాన్ని వరలక్ష్మమ్మగారు ఆహ్వానించలేదు. సతీశ్రేయమునకు భంగకరమని ఆమె భావం. ‘మన యింట దీపమని ముద్దులెట్టుకుంటామా’ అని తమ వాదనను సమర్థించుకుంటారు.
‘బిరుదు పదవులను బురదలో దిగబడి’ దేశీయాత్మగల కవులు గానం చేశారట. శ్రీ కాశీరాథుని నాగేశ్వరరావు పంతులుగారికి దేశోద్దారక బిరుదు నొసంగుట సూర్యునకు దివిటీ దానము చేసినట్లుందంటారు.
నాటకకళకు గణ్యత లేదని ఆమె భావం. తడిసికాని గుడిసె కట్టరు; ఆగి గాని తూగరని సామెతను చెప్తూ అనుభవం చేత మంచి చెడులు తెలుస్తాయంటారు.
రాళ్లు దేవుళ్లయిన రాసులు మ్రింగవా అని వేమన యోగేంద్రుడు సందేహించినట్టుగనే శిశు వివాహములలో దేవుళ్లు రాళ్లయినారని వాపోతారు; పెళ్లిళ్లు ప్రళయాలనే లేఖలో దుర్గాబాయి అపర ఝాన్సీలా అనిపించారట. ‘్భరతదేశమెన్నడును ఒరులను యాచించి ఎరుగదు. స్వాతంత్య్రమును గూడ యాచించదు. నిజ ప్రజ్ఞచే బడయునని’ పల్కిన పల్కులు అన్నగారెరిగింపగా నెచ్చెలి కల్పలతకు జాబులో రాశారు. అదే లేఖలో నూలే మన ఆర్థిక దాస్య విమోచనమునకు పరవౌషధం అంటూ జాబు ముగిస్తారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

కొమ్మన రాధాకృష్ణారావు