వినమరుగైన

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి( ఖండవల్లి లక్ష్మీరంజనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీనిని బట్టి ఆ విషయమునకు వీరు భోజ రాజీయమును తాముగా స్రంప్రదింపలేదని, ఎవరో వ్రాసిన విషయమును ఉధృతము గావించినారని తెలియపరచుచున్నది. ఇంతకు అది ఆర్ అనగా ఏరులు, వేల మనగా సముద్ర తీరముగల దేశము అనగా తీర భూమియైన వెలనాడు. వెలనాడన్నదే అది తీర దేశము. ఆరువేల వెలనాడన్న నదీ ముఖ ద్వారముల ప్రాంతము అని అర్థము
కొండవీటి రెడ్డి వంశమును గూర్చి వ్రాయుచోట రెడ్లలో కొన్ని తెగలు గలవు. వానిలో పంట రెడ్డి విభాగ మొకటి. పంటరెడ్లలో మరల కొన్ని అంతర్విభాగములు కలవు. పాకనాటి రెడ్లు, వెలనాటి రెడ్లు, మోటాటి రెడ్లు మొదలగునవి వీరిపేర్లు అని వ్రాసి ‘ఇవి ఆయా దేశ ప్రాంతములకు అనగా వెలనాడు, మొట్టనాడు, పాకనాడు మొదలగు భూభాగములకు చెందిన వంశములని తెలియవచ్చును’ అని వ్రాసిరి.
వెలనాడు, పాకనాడులను గూర్చి స్థలాంతరమున చర్చించిరి గాని, మొట్టనాడు గూర్చి ఎచ్చటను ప్రస్తావించలేదు. మీదుమిక్కిలి పంటరెడ్లలోని అంతర్విభాగములుగా పేర్కొనుట వలన, పైని అంతర్విభాగములైన మిగిలినవారెవ్వరు అను ప్రశ్న పొడమును. పెడకంటి, దేసటి రెడ్లను పేర్కొందమా!
అప్పుడు అవి దేశ విభాగములు కావా! అయినపుడు పై అంతర్విభాగములలోని వారే పంట రెడ్లై మిగిలినవారు కాకపోవునను నభిప్రాయము కలుగును. ఇది యిట్లుండ, భీమేశ్వర పురాణమున వీరభద్రారెడ్డి వంశమును గూర్చి శ్రీనాథుడు చెప్పిన వెలమలను, కమ్మలనీ, సరసర్లనీ, వంటర్లనీ, చతుర్థ కులజులు త్రిమార్గగంగా ప్రవాహంబు బోలి అనేకాన్వయంబులు శాఖోపశాఖలయి వర్తిల్లు. అందు పంటాన్వయం బొక్కటి అన్నమాటను ఎట్లు సమర్థించుట. అయితే వీరు దాని విషయముప్రస్తావించలేదు. వీరే కదా, ఇంతకుపూర్వం కాని, ఇప్పటివరకుగాని చరిత్రకారులెవ్వరు దీనిని ప్రస్తావింపలేదు
అని తల్లి- ఈమె వీరభద్రారెడ్డి భార్య- కలువచెరు శాసనముల ప్రస్తావించారు గాని, ఆమె భర్త ఆస్థాన కవియైన శ్రీనాథుని రచనమును ఏల గ్రహింపరు? పరిశీలింతురుగాక. శ్రీనాథుడు పంటాన్వయమన్నను,
ఇందలి పంట శబ్దము వరిపైరును సూచించును. అనగా పాకనాటి వారిలోని వరి యన్నము ఆహారముగా గలవారు. మోటాటి అనునది మొట్టనాడునకు సంక్షిప్త రూపము. ఇది నేటి మార్కాపురం కంభం ప్రాంతములకు చెందినదిగా శాసనములు చెప్పుచున్నవి. ఇట్టి కొన్ని వివరములు ఈ గ్రంథమున చోటుచేసికొనలేదు. ఇక్కడ పేర్కొన్న అంశములు చేరియున్న నిదియొక సప్రమాణిక, సంపూర్ణ గ్రంథమై యుండెడిది.అయితే అంతమాత్రమున ఈ గ్రంథమునకు వనె్నవాసి లేదని చెప్పుట కాదు. అవి యున్న మరింత బాగుండెడిది. ముందే చెప్పినట్లు అది యొక సంకలనము.
ఈ మాటనే మారేమండ రామారావుగారు మొదట చెప్పియున్నారు. చరిత్ర తెలియగోరు సాధారణ పాఠకులకు, విద్యార్థులకు ఇది అత్యంతోపయుక్తమైన గ్రంథమనుటలో సందేహము లేదు. ఆంధ్రులను, వారి సంస్కృతిని గూర్చిన సమాచారము రేఖా మాత్రముగను, చరిత్రను గూర్చి ఒక అవగాహనమును పాఠకుల ముందుంచుటలో గ్రంథకర్తలు కృతకృత్యులైరి. మరింత సమగ్రమయిన గ్రంథమును రచింపబూనువారికి ఇది కరదీపిక యగుననుట నిక్కము. వారొనర్చిన ఈ మేలును ముందే చెప్పినట్లు ఆంధ్ర పాఠకలోకము వారికి కృతజ్ఞతాబద్ధము.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

అయపోయంది

బాలేందు శేఖరం పు యార్లగడ్డ బాలగంగాధరరావు