వినమరుగైన

శివతాండవము -పుట్టపర్తి నారాయణాచార్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుసుంభరాగ వసనాన్ని ధరించి సంధ్యాదేవి విలాస వక్రితంగా నిలబడి శివుని తాండవం కోసం ఎదురుచూస్తూ ఉంది. పడమటి దేశాలకు శివతాండవాన్ని గురించి చెప్పటం కోసం సూర్యుడు త్వత్వరగా పరుగెత్తుతున్నాడు.
ఏమానందము భూమీ తలమున/ శివతాండవమట శివలాస్యంబట
ఓ హో హో హో ఊహాతీతం/ బీయానందం బిలాతలంబున
శివతాండవంలోని రెండవ భాగం నంది నాంది. అది సంస్కృత రచన. ప్రారంభం కాబోయే శివతాండవం యొక్క ఔద్ధత్వాన్ని ప్రతిధ్వనింపజేసే ఈ భాగంలో ఒక శ్లోకాన్ని చూద్దాం.
‘అర్ధేం దూత్ఫుల్ల కేశం స్మిత రుచి పటలీదంశితం గౌర వర్ణం
లూర్తీ రుూకం వహాంతం నయన మహికుల ప్రత్నభూషా వితానం
వృత్తారంభాట్టహాస ప్రవి చరితకకు వ్చక్రమానంద కందం
తం వందే నీలంఠం ద్రశపతి శిరశ్చుంబి పాదాబ్దిపీఠం
ఇంత ఔద్ధత్వంలోనూ సౌందర్యం లేకపోలేదు. నాట్య ప్రారంభంలో శివుని చిరునవ్వు మూసుకోనున్న మూడవ కంటి మీద కూడా పడటం ఇందులో అందం. నంది నాంది పలికి శివుణ్ణి తాండవానికి ఇలా ఆహ్వానిస్తుంది.
ధక్కారవముల దిక్కటిల్ల దశ/ దిక్కుల మారుత దీర్ఘీకృతములు
ఝణుఝణుఝణుత స్వనములకును/ ప్రతినినదము లీనగ ననధి భంగములు/ శూలంబున నాభీలత లేనగ/ గీలా చయములు లేబిహానములు
ధగధగితములై నిగుతగ నగవులు/ గగన తలస్థుల బెగడ దేవతలు/ నీ వృత్తములో నిఖిల వాఙ్మయము/ తానముగా మారి గానముగాగను/ తాండవించగా తరుణంబైనది/ ఖండేందుధరా కదులుము నెమ్మది
మూడవ భాగం కవి ప్రార్థనతో ప్రారంభవౌతుంది. పార్వతీదేవి చూపులనే చంపకమాలను ధరించినవాడూ, దౌఖితాపన్న శరణ్యుడూ, దయావీరుడూ అయిన ఈశ్వరుడు తన భావంలో చిగురించాలంటాడు కవి. ఆ తరువాత శివతాండవం ప్రారంభవౌతుంది.
‘‘తలపైని చదలేటి అలలు తాండవమాడ
నలల త్రోపుడుల గ్రొనె్నలి పూవు కదలాడ
మొనసి ఫాలముపైన ముంగురులు చెరలాడ
గనుబొమ్మలో మధుర గమనంబులు నడయాడ
గనుపాపలో గౌరి కసినవ్వు బింబింపగ
గను చూపులను తరుణ కౌతుకము జుంచింప
గడిగి మూడవ కంట గటిక నిప్పులు రాల
గడు బేర్చి పెదవిపై గటిక నవ్వులు వ్రేల
ధిమధిమ ధ్వని సరిద్గిరి గర్భములు తూగ
సమిత సంరంభ హాహాకారములు రేగ
ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు

-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
- శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వల్లంపాటి వెంకటసుబ్బయ్య