వినమరుగైన

తిండితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మున్ముందూ ధరలు బాగా పెరిగిపోతాయని జఫై ఇటుకలు కొనుక్కొని కూడబెట్టుకున్నట్లే తను కూడా పెట్రోలు కొని కూడబెట్టుకోవడం, కారు డ్రైవింగ్ నేర్చుకోవడం, కారు రిపేరైతే ఎలా బాగు చేసుకోవాలో నేర్చుకోవడం లాంటివి చేయాలని ఆఫీసుకొస్తూనే నిర్ణయించుకున్నాడు. తనకొచ్చిన ఈ అపూర్వ ఆలోచనకు సంబరపడిపోయి, ఆఫీసు వదలగానే ఇంటికి వెళ్ళేటప్పుకు ఓ పెట్రోలు డబ్బా కొనుక్కొని వెళ్లాడు.
ఆనాడు శుక్రవారం అయినందున చీర కట్టుకొని, పూలు పెట్టుకొని శ్రీమహాలక్ష్మి ఆలయానికి వెళ్ళడానికి తయారైంది జస్సు. పెట్రోలు డబ్బాతో వచ్చిన కఫైని అయోమయంగా చూసి ‘‘ఏమైందండీ మీకు. ఈ పెట్రోలు డబ్బా ఏమిటి, పైగా శుక్రవారం తీసుకొచ్చారు’’ ఆదుర్దాగా అడిగింది జస్సు ఉస్సురంటూ.
‘‘నీ ఉద్దేశ్యంలో ఆ జఫై జయ్యుంలే తెలివిగల వాళ్ళనుకుంటున్నావేమో! ముమ్మాటికీ కాదు. కొద్దిరోజుల్లోనే నా లెవెలేమిటో తెలుసుకుంటావ్’’ అంటూ ఓ చిరునవ్వు నవ్వి ఆ డబ్బాను స్టోరు రూమ్‌లో భద్రంగా దాచాడు.
హమ్మయ్య! ఇదేవిధమైన ఆత్మహత్యా ప్రయత్నం కాదులే! ఆ విషయమేదో తరువాత తెలుసుకోవచ్చులే అనుకొని కుదుటపడింది జస్సు ఆలయానికి వెళ్ళే ధ్యాసలో.
‘‘వాళ్ళే కాదండీ ఈ రోజుల్లో అంతా తెలివిగలవాళ్ళే’’ అంది జస్సు. ఏదో చెప్పబోతోందనుకుంటూ కఫై ఆమె దగ్గరగా వచ్చాడు.
‘‘మన సందు చివర సామ్రాజ్యం వుంది చూశారూ! అదే సోమరాజు భార్య, నిన్న మొన్నటివరకూ ఏం లేదుగా! ఇప్పుడు చూడండి పట్టుచీరలతో ఫెళఫెళలాడి పోతోంది. కట్టిన చీర మళ్లీ కట్టకుండా’’ అంది జస్సు.
‘‘అ! అ! అదే ఆ ఎస్‌టిడి బూత్ సోమరాజు భార్య! చెప్పు చెప్పు’’ అన్నాడు కుతూహలంగా కఫై.
‘‘నేనిప్పుడు వాళ్లింటికే వెళ్తున్నాను. ఆలయానికి వెళ్ళే దారేగా’’
‘‘ఏమిటి విశేషం’’
‘‘ప్రతి శుక్రవారం ఇంటికొచ్చిన ఆడవాళ్ళందరికీ ఓ సాంబ్రాణీ పొట్లంఇచ్చి, అందరి దగ్గరా తలావంద రూపాయలు వసూలు చేస్తుంది. వాళ్ళ సాంబ్రాణీ పొట్లాలతో అమ్మవారికి సాంబ్రాణీపొగ వేస్తుంది. ఆ పొగలోంచి లాటరీ తీస్తుంది. లాటరీ వచ్చినవాళ్ళకు ఓ అయిదు వేల రూపాయలు అప్పుడే ఇచ్చి పంపిస్తుంది. పేదవాళ్లను ఉద్ధరించడానికే ఈ సాంబ్రాణీ లాటరీ పెట్టిందట. శుక్రవారం కదా ఎవరికివారు తమకే ఆ లక్ష్మీ కటాక్షం అనుకుంటూ ఎగబడుతున్నారు’’ అంది గుక్కతిప్పుకోకుండా జస్సు.
‘‘ఈ స్కీము ఆడవాళ్ళకేనా మగవాళ్ళకుకూడానా’’ అడిగాడు కఫై.
‘‘ఆడవాళ్ళలో కూడా మళ్లీ అందరికీ కాదు. తమ మాంగల్యం పది కాలాలపాటు నిలవాలనుకునేవాళ్ళకూ, నిజమైన అమ్మవారి భక్తులకేనట. అలాంటి వాళ్ళకైతేనే ఏదో ఒక శుక్రవారం లక్ష్మీకటాక్షం తప్పకుండా కలుగుతుందిట’’ మళ్లీ స్పీడు పెంచి పెద్దగా చెప్పింది జస్సు.
‘‘అబ్బో బలే కొత్త ట్రెండ్ కనిపెట్టిందే. సెంటిమెంటు కూడా! మన దేశంలో అమాయకులకు కొదవలేదుగా. చూడు జస్సు నాకిలాంటి వాటిపైన నమ్మకం లేదు. ఈ స్కీములూ, స్కాములూ, సాములూ జోలికి మన బోటివాళ్ళం వెళ్లకూడదు. వెళ్ళే వాళ్ళందరకూ చెవిలో చీము తప్ప ఏం రాదు. ఆ తర్వాత నీ ఇష్టం’’ అన్నాడు కఫై.
‘‘ఏదో సరదాగా ఈ ఒక్కవారం వెళ్లి ఓ వందిచ్చుకొని, సాంబ్రాణీ పొగేసి వస్తా. అమ్మవారికేగా. ఆశతో వెళ్లను. భక్తితో వెళ్తానంతే’’ అంటూ గెంతుకుంటూ వెళ్లింది జస్సు.
***
రాత్రి 9 గంటలు అవుతుండగా హుషారుగా వచ్చింది జస్సు.
‘‘ఆహా ఏం జనం! ఏ జనం పేదవాళ్ళు ఎక్కువమంది రాలేదండీ! అంతా డబ్బున్న వాళ్ళేనండి. కార్లలో వచ్చారు. వందలిచ్చి ఆ పొగ పీలుస్తూ పొంగిపోయారనుకోండి. ఈవారం ఆ అయిదువేలు ఎవరికి వాళ్ళు తమకేననుకుంటూ ఊగిపోతుండగా, లాటరీ నాకే వచ్చిందండీ! నా మాంగల్యం ఎంత గట్టిదా అనుకున్నాను. దేనికైనా పతిభక్తీ, దైవభక్తీ వుండాలండీ!’’ ఒకటేమైన దంచుతోంది ఉపన్యాసం జస్సు.
‘‘ఓ వెరీగుడ్. ఆ అయిదువేలూ ఇటివ్వు, వాటితో నేను కొనబోయే కారుకు రిపేరు సామాన్లు కొనుక్కుంటాను’’ అన్నాడు తను పెట్రోలు కొనుక్కొచ్చిన వేళా విశేషం బాగానే వుందనుకుంటూ కఫై.
‘‘ఏమిటీ కారు కొనబోతున్నారా అందుకా ముందుగానే పెట్రోలు డబ్బాతో డాబుసరిగా ఇంటికొచ్చారు. నా ప్లాను మీ ప్లాను కన్నా చాలా గొప్పది. నేనేమంత తెలివితక్కువదాన్ని కాదు. ఆ అయిదువేలకు సరిపడా సాంబ్రాణీ పొట్లాలు తెచ్చుకున్నాను. ఈ లెక్కన ఇంకా ఎన్ని శుక్రవారాలు పోగేసుకోవచ్చో చూసుకోండి’’ అంది తన తెలివికి తనే మురిసిపోతూ జస్సు.

ఆకాశవర్షిణి నుంచి...
-సశేషం

-షణ్ముఖశ్రీ