విశాఖపట్నం

త్వరలో కెజిహెచ్‌లో అవయవ మార్పిడి కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడికి వీలు కల్పించే చర్యల్లో భాగంగా విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో ఈ మేరకు అవయవ మార్పిడి కేంద్రాన్ని (ఒటిసి) త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన భవనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తే త్వరలోనే పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించనుంది. చాలా కాలంగా ఒటిసి ఏర్పాటు చేయమని అవయవ దానాన్ని ప్రొత్సహించే సంస్థలు ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్రంలో 21 ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం ఉండగా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటి వరకూ ఈ తరహా కేంద్రం లేకపోవడం గమనార్హం. నగరంలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం ఉండగా, ఇటీవలే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె, ఊపిరితిత్తులు, మూత్ర పిండాల మార్పిడికి సంబంధించి ఒటిసి ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. కెజిహెచ్‌లో ఇప్పటికే జీవన్‌దాన్ నోడల్ సెంటర్ పని చేస్తున్నది. ఒటిసి ఏర్పాటు చేస్తే కెజిహెచ్‌లో అవయవమార్పిడి, టిస్యూ హార్వెస్టింగ్ విభాగం, భద్రపరిచే విభాగం అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఈ కేంద్రం ఏర్పాటుకు వీలుగా నెఫ్రాలజీ బ్లాక్‌లో కొంత భాగాన్ని కెజిహెచ్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో అవయవ దానాలు, సేకరణ, మార్పిడి వంటివి ఉత్తరాంధ్రలోని రోగులకు అందుబాటులోకి వస్తాయని ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి. అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటుకు సంబంధించి అందుబాటులో ఉన్న అధ్యాపక సిబ్బంది, వౌలిక సదుపాయాల గురించి వివరంగా నివేదిక పంపమని ఇప్పటికే కెజిహెచ్ అధికారులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కోరింది. అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు క్లిష్టమైనవి కావడంతో ఇందుకు అవసరమైన సౌకర్యాలపై ముందుగానే అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రత్యేక పరికరాలతో కూడిన రెండు ఆపరేషన్ ధియేటర్లు ఏర్పాటు చేసే అంశం కీలకంగా మారింది. బ్రెయిన్ డెడ్ కేసులను నిర్ధారించి, ప్రకటించే నలుగురు వైద్యుల జాబితాను ఖరారు చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, జీవన్‌దాన్ ఛీఫ్ ట్రాన్సప్లాంట్ కో-ఆర్డినేటర్‌కు తెలియచేయాల్సి ఉంటుంది. ఆరు గంటల వ్యవధిలో రెండు రకాల క్లినికల్ బ్రెయిన్ డెడ్ పరీక్షలు నిర్వహించాకే ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటిస్తారు. దీనికితోడు అదనంగా మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాకే ఒటిసిని అనుమతిస్తారు.అనుమతి లభిస్తే కొన్ని అవయవాలకు సంబంధించి మార్పిడికి ఈ కేంద్రంలో చేసే వీలు ఉంటుంది. ఇది పేద రోగులకు వరంగా మారనుందనవచ్చు.