విశాఖపట్నం

నేడు స్వచ్ఛ భారత్‌పై రాష్టస్థ్రాయి వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 28: రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించేందుకు మంగళవారం విశాఖ జెడ్పీలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాపులో స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించేందుకు డిల్లీ నుంచి ఐదుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళిని, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు పాల్గొంటున్నారు. వీరితోపాటు రాష్ట్రంలోని 13 జిల్లాల డిపిఒలు, డ్వామా పిడిలు, జెడ్పీ సిఇఒలు, గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు, ఏడు జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

కాలుష్య రహితంగా విశాఖ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 28: విశాఖను కాలుష్య రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రతీ నెల 28న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వాహన రహిత క్యాంపస్‌గా పరిగణిస్తున్నారు. సోమవారం కూడా వాహన రహిత క్యాంపస్‌గా పరిగణించడంతో వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజుతో సైతం రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, సిబ్బంది అందరు కాలినడకన విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు, ఉద్యోగుల్లో పర్యావరణంపై చైతన్యం కల్పించేందుకు వాహన రహిత క్యాంపస్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. విసి వెంట పలువురు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. కాలుష్యాన్ని నివారించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆనందరావు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎన్‌ఎడి పాల్ తదితరులు పాల్గొన్నారు.