విశాఖపట్నం

అగ్రికల్చరల్ హబ్‌గా చోడవరం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, డిసెంబర్ 28: అగ్రికల్చరల్ హబ్‌గా చోడవరం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజుతో కలసి స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ, ప్రేమసమాజం వద్ద గల రైతుబజార్‌లో సందర్సించి అక్కడి పరిస్థితులను అధికారులను, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో సుమారు 11 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోక నిరుపయోగంగా ఉందన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఇందుకు అనుగుణంగా మార్కెట్ కమిటీలోని నిరుపయోగంగా ఉన్న స్థలంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అలాగే వడ్డాది మార్కెట్ కమిటీకి చెందిన తొమ్మిది ఎకరాల స్థలంలో రెండు కోల్డ్‌స్టోరేజ్ గోదాములను, అలాగే స్థానిక మార్కెట్ కమిటీలో బెల్లం నిల్వ చేసుకునే గోదాములు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇక్కడి స్థలంలో చిన్నపాటి పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను, వ్యాపారులను రప్పించి ఒక ప్రత్యేక సమావేశం ద్వారా ఏయే పరిశ్రమలు నెలకొల్పడానికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుంటుమన్నారు. అనంతరం ప్రతిపాధనలు తయారుచేసి కేంద్రమంత్రి రామ్‌విలాస్‌పాశ్వాన్, రాష్టమ్రంత్రి పత్తిపాటి పుల్లారావులకు, సిఎం చంద్రబాబులకు అందజేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. రైతుబజార్‌లో వౌలిక సదుపాయాలైన సిసి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయం తదితర అభివృద్ధి పనులకు 50లక్షల రూపాయలతో ప్రతిపాధనలు తయారుచేసి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈయనతోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ డిడి సుదాకర్, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి చలం, పంచాయతీ ఇవో చంద్రశేఖర్, సర్పంచ్ దొమ్మెసి అప్పలనర్స గిరి తదితర అధికారులు పాల్గొన్నారు.

ఐటిసి గోడౌన్‌లో భారీ చోరీ
* రూ 20లక్షలు విలువైన సరుకు మాయం
అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 28: సుమారు ఆరు మండలాలకు ఐటిసి కంపెనీకి సంబంధించిన సిగరెట్లు, బిస్కెట్లు, గోదుమపిండి తదితర వస్తువులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్స్ గొడౌన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సుమారు 18 నుంచి 20 లక్షలురూపాయలు విలువైన సిగరెట్లు తదితర వస్తువులు చోరీకి గురైన సంఘటన ఆదివారం రాత్రి 1గంట నుంచి 3గంటల మధ్యలో చోటుచేసుకున్నట్లు వ్యాపారి పెతకంశెట్టి జ్ఞానప్రకాష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కొత్తూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఎస్‌బిఐ కోలనీలో శారదానగర్‌కు చెందిన పెతకంశెట్టి జ్ఞానప్రకాష్ ఐటిసి కంపెనీ డిస్ట్రిబ్యూటర్ తీసుకొని ఆ కంపెనీ ద్వారా ఉత్పత్తిఅయినటువంటి సిగరెట్లు, బిస్కెట్లు, గోదుమపిండి, చాక్లెట్లు తదితర నిత్యావసర వస్తువులు హోల్‌సేల్‌గా అనకాపల్లి, యలమంచిలి, కశింకోట, అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి మండలాలకు సరఫరా చేస్తుంటామని వ్యాపారి తెలిపారు. అయితే ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం వరకు వ్యాపారం నిర్వహించిన అనంతరం గొడౌన్ మూసివేసి వెళ్లిపోయామన్నారు. సోమవారం తెల్లవారు ఐదు గంటలకు గొడౌన్ షట్టర్ తెరిచి ఉండడం, సమీపంలో ఉన్న స్థానికులు గమనించి తమకు సమాచారం అందజేయడంతో వెంటనే వచ్చి చుసే సరికి షట్టర్ గడియలు విరగొట్టి ఉండటం గొడౌన్‌లో ఉండవలసిన స్టాక్ లేకపోవడంతో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసామన్నారు. పట్టణ సిఐ చంద్ర తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. గొడౌన్‌లో మిగిలి ఉన్న స్టాక్‌ను కంప్యూటర్‌లో స్టాక్ లిస్టును పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులు దొంగతనానికి ఉపయోగించిన ఆయదాలు సంఘటనా స్థలంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో రూరల్ పోలీసు స్టేషన్ ఉన్నప్పటికీ, కాలేజి జంక్షన్‌లో రాత్రి సమయంలో నిత్యం పోలీసు గస్తీ నిర్వహించినప్పటికీ భారీ చోరీ జరగడంపై స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సిఐ చంద్ర కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.