విశాఖపట్నం

ఫిబ్రవరి నాటికి తీరానికి విరాట్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: నౌకాదళంలో సుదీర్ఘకాలం సేవలందించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను విశాఖ తీరానికి రప్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై నౌకాదళంతో పూర్తి స్థాయిలో చర్చించిన ప్రభుత్వం స్పష్టమైన హామీని పొందింది. దీంతో కొద్ది నెలల్లోనే నౌకాదళ సేవల నుంచి ఉపసంహరించనున్న విరాట్‌ను విశాఖ తీరంలో మ్యూజియం లేదా, వాణిజ్య పరమైన అవసరాలకు వినియోగించే విషయాన్ని ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తోంది. సేవల నుంచి ఉపసంహరించిన అనంతరం విరాట్‌ను కొలువు తీర్చేందుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయడంతో పాటు పలు అంశాలను ప్రభుత్వం పరిశీలించింది. దీనిపై పూర్తి అధ్యయనం చేసేందుకు విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఉపాధ్యక్షుడు నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీ పరిశీలన అనంతరం విరాట్‌ను కొలువు తీర్చేందుకు అనువైన నాలుగు ప్రాంతాలను గుర్తించింది. వుడాపార్కు, తెనే్నటి పార్కు, జోడుగుళ్లపాలెం, సాగర్ నగర్ ప్రాంతాల్లో విరాట్‌ను తీరానికి చేర్చే అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్నారు. తీరానికి చేరిన తర్వాత విరాట్‌ను మ్యూజియంగా తీర్చిదిద్దాలా, లేక వాణిజ్య పరమైన అవసరాలకు వినియోగించాలా అన్న అంశంపై స్పష్టతతో పాటు నిర్వాహణను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిపై పూర్తి అధ్యయనం చేసే బాధ్యతను క్రిసిల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇదే అంశంపై కలెక్టర్ ఎన్ యువరాజ్ మంగళవారం విలేఖరుల వద్ద ప్రస్తావిస్తూ విరాట్ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందన్నారు. సేవల అనంతరం తీరానికి రావాలంటే దాదాపు 5 నెలల సమయం అవసరమన్నారు. అన్నీ సజావుగా జరిగితే వచ్చే ఫిబ్రవరి నాటికి విరాట్‌ను తీరానికి తీసువచ్చే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయన్నారు.