విశాఖపట్నం

భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 25: నగరంలోని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడేను జరుపుకున్నారు. శుక్రవారం నగరంలోని జ్ఞానాపురం రక్షణ గిరిపై ఉదయం ఆరు గంటలకే విశాఖ ఆర్చ్ బిషప్ ఎం.ప్రకాశ్ శిలువను మోసుకుంటూ 14 స్థలాలను సందర్శించి తిరిగి గిరికి చేరుకున్నారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో క్రీస్తు సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించారు. సర్వలోక రక్షకుడైన ఏసుక్రీస్తు మానవ రూపంలో ఉంటూ శిలువపై మరణించిన రోజును గుర్తు చేసుకున్నారు. ఆనాడు మధ్యాహ్నాం 3 గంటల సమయంలో క్రీస్తు మరణించిన జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ చర్చిపై గంటలను మ్రోగించి వౌన ప్రార్థనలు జరిపారు. క్రీస్తు శిలువపై వేలాడుతూ చెప్పిన ఏడు మాటలను చర్చిల్లో పాస్టర్లు ధ్యానించారు. ఈ సందర్భంగా వేకువ ఝాము నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆర్‌సిఎం చర్చిల్లో క్రీస్తు శిలువపై మరణించిన విధానాన్ని నాటక రూపంలో ప్రదర్శించారు. లూదరన్, పెంతెకోస్టు, బాప్టిస్టు చర్చిల్లో వాక్యోపదేశాన్ని అందించారు. గుడ్‌ఫ్రైడే ప్రాధాన్యత గురించి చర్చిల్లో వివరించారు. క్రీస్తు మరణించిన దినాన్ని గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. పాపం లోకాన్ని విడిచి పరిశుద్ధ లోకానికి వెళ్లేందుకు తన మరణం ద్వారా ప్రభువుకు లభించిన అవకాశమని అందువల్లనే దీనిని గుడ్‌ఫ్రైడేగా పిలుస్తున్నామని పాస్టర్లు వివరించారు. నిత్యం ప్రభువును సేవిస్తూ ఆయన నిర్ధేశించిన మార్గంలో అందరు పయనించాలన్నారు. ఆయనతో ఎప్పుడూ సహవాసం కలిగి ఉండాలని, అలాంటపుడే మనకు నిజమైన గుడ్ ఫ్రైడే పాటించినట్టు అవుతుందని తెలిపారు. మనల్ని రక్షించేందుకు ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని పాటల రూపంలో ఆలపించారు. మన జీవితంలో రక్షకుడిగా ఆయనకు శాశ్వత స్థానాన్ని కల్పించాలని, అప్పడే పరలోకం మనది అవుతుందని హితవు పలికారు.
ఆదివారం జరిగనున్న ఈస్టర్ పండుగను పురస్కరించుకొని ఆ రోజు వేకువ ఝామున తమ పితురుల సమాదుల వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం చర్చిల్లో ఈస్టర్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ.ఇదిలా ఉండగా గత 45 రోజుల నుంచి క్రైస్తవ సోదరులు చేపట్టిన ఉపవాస దీక్షలు శనివారంతో ముగియనున్నాయి. అనంతరం ఆదివారం జరిగే ఈస్టర్ పండుగను వైభవంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.