ఆటాపోటీ

టాప్ స్కోరర్ గేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా క్రిస్ గేల్ రికార్డు నెలకొల్పాడు. పుణె వారియర్స్‌తో 2013లో జరిగిన మ్యాచ్‌లో అతను 66 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేశాడు. బ్రెండన్ మెక్‌కలమ్ 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత ఏడాది ఎబి డివిలియర్స్ 59 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 2012లో గేల్ 62 బంతుల్లో అజేయంగా 128 పరుగులు సాధిస్తే, 2010లో మురళీ విజయ్ 57 బంతుల్లో 127 పరుగులు చేశాడు.
సిక్సర్ల హోరు
ఐపిఎల్ అంటేనే బౌండరీల మోత. సిక్సర్లతో హోరెత్తించిన బ్యాట్స్‌మెన్‌లో గేల్ నంబర్ వన్‌గా నిలుస్తాడు. అతని ఖాతాలో ఇప్పటి వరకూ 230 సిక్సర్లు ఉన్నాయి. సురేష్ రైనా 150, రోహిత్ శర్మ 147, యూసుఫ్ పఠాన్ 127, మహేంద్ర సింగ్ ధోనీ 126 చొప్పున సిక్సర్లు బాదేశారు.
స్పీడుగా సెంచరీ
అత్యంత వేగంగా శతకాన్ని సాధించిన రికార్డు కూడా క్రిస్ గేల్‌దే. 2013లో పుణె వారియర్స్‌పై అతను 30 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. యూసుఫ్ పఠాన్ 2010లో ముంబయి ఇండియన్స్‌పై 37, 2013లో డేవిడ్ మిల్లర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 38, 2008లో ముంబయి ఇండియన్స్‌పై ఆడం గిల్‌క్రిస్ట్, అదే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌పై సనత్ జయసూర్య 45 బంతుల్లో సెంచరీలు సాధించారు. అత్యంత వేగవంతమైన అర్ధ శతకాల రికార్డు యూసుఫ్ పఠాన్ ఖాతాలో ఉంది. అతను 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 2013లో ఇదే జట్టుపై మహేంద్ర సింగ్ ధోనీ, 2014లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై సురేష్ రైనా 16 బంతుల్లో అర్ధ శతకాలను సాధించారు. 2009లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఆడం గిల్‌క్రిస్ట్, 2013లో పుణె వారియర్స్‌పై క్రిస్ గేల్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ మైలు రాళ్లను చేరారు. 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రాబిన్ ఉతప్ప, 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఓవైస్ షా, 2014లో రాజస్థాన్ రాయల్స్‌పై డేవిడ్ మిల్లర్, 2015లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై హర్భజన్ సింగ్, ఆండ్రి రసెల్ తలా 19 బంతుల్లో అర్ధ శతకాలను పూర్తి చేశారు.
..........................................................
ఐపిఎల్ లోగోను 2007 సెప్టెంబర్ 13న విడుదల చేశారు. క్రికెట్‌ను లాభసాటి వ్యాపారంగా తీర్చిదిద్దడం, ఫ్రాంచైజీల నియామకం, ఆటగాళ్ల ఎంపిక వంటి పలు అంశాలపై వ్యూహాలను సిద్ధం చేశారు. ఆ కార్యక్రమంలో శరద్ పవార్, సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, గ్లెన్ మెక్‌గ్రాత్, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. భారత మాజీ కెప్టెన్లు రవి శాస్ర్తీ, సునీల్ గవాస్కర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, బిసిసిఐ అధికారి రాజీవ్ శుక్లా, చిరయు అమీన్, ఇందర్‌జిత్ సింగ్ బింద్రా, అరుణ్ జైట్లీలతో పాలక మండలి ఏర్పాటైంది. లలిత్ మోదీ కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. ఒక్కో వేదికపై ఏడు మ్యాచ్‌లు ఉండేలా జాగ్రత్తపడుతూ, ఫ్రాంచైజీలన్నీ హోం గ్రౌండ్‌తోపాటు ఇతర కేంద్రాల్లోనూ మ్యాచ్‌లు ఆడేలా టోర్నీని రూపొందించారు. ఫ్రాంచైజీలకు వేలాన్ని పూర్తి చేసి, బిడ్‌ను గెల్చుకున్న ఎనిమిది ఫ్రాంచైజీల పేర్లను 2008 జనవరి 24న ప్రకటించారు. ఒక్కో ఫ్రాంచైజీ 67 మిలియన్ల నుంచి 111.9 మిలియన్ల వరకూ బిడ్ మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద మంది క్రికెటర్లు ఐపిఎల్‌లో ఆడేందుకు అంగీకరించారు. 400 మిలియన్ డాలర్ల బేస్ ప్రైస్‌తో ఆటగాళ్ల వేలం మొదలైంది. 723.59 మిలియన్ డాలర్ల వద్ద ముగిసింది.టీవీ హక్కుల ద్వారా 1.75 బిలియన్ డాలర్లు, ప్రమోషన్ల ద్వారా 908 మిలియన్ డాలర్లు, ఫ్రాంచైజీల ఫీజు ద్వారా 700 మిలియన్ డాలర్ల మొత్తం బిసిసిఐకి సమకూరింది. స్పాన్సర్‌షిప్ టైటిల్ కోసం హీరో హోండా మోటార్స్‌కు చెందిన వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యుఎస్‌జి), డిఎల్‌ఎఫ్ లిమిటెడ్, పర్సెప్ట్ డిమార్క్, ట్వంటీ ఫస్ట్ సెంచరీ మీడియా సంస్థలు పోటీపడ్డాయి. 2008 ఫిబ్రవరి 13న జరిగిన బిడ్డింగ్‌లో 200 కోట్ల రూపాయలకు డిఎల్‌ఎఫ్ సంస్థ ఐదేళ్ల కాలానికిగాను స్పాన్సర్‌షిప్ హక్కులను సంపాదించుకుంది.