పశ్చిమగోదావరి

వ్యవసాయ కనెక్షన్లపై పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 17 : జిల్లాలోని వ్యవసాయ కనెక్షన్లపై పూర్తిస్థాయి పరిశీలన నిర్వహిస్తున్నట్లు ఎపిఇపిడిసిఎల్ సిఎండి ఎంఎం నాయక్ తెలిపారు. జిల్లాలో మొత్తం 90 వేల వ్యవసాయ కనెక్షన్లు వుండగా వీటిలో కొన్ని చోట్ల వ్యవసాయేతర కనెక్షన్లు కూడా కలిసి వున్నట్లు తెలుస్తోందని, ఇప్పటి వరకు 50 వేల కనెక్షన్ల పరిశీలన పూరె్తైందని తెలిపారు. త్వరలోనే మిగిలిన కనెక్షన్ల పరిశీలన కూడా పూర్తి చేసి వ్యవసాయేతర కనెక్షన్లను ఈ పరిధి నుంచి మినహాయించడం ద్వారా వ్యవసాయ కనెక్షన్లకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక విద్యుత్ భవనంలో బుధవారం ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇపిడిసి ఎల్ పరిధిలో మొత్తం 2.30 లక్షల వ్యవసాయ కనెక్షన్లు వున్నాయని, వీటిలో జిల్లాలో 90 వేల కనెక్షన్లు వున్నాయని తెలిపారు. ఈ పరిధి నుంచి వ్యవసాయేతర కనెక్షన్లను తొలగిస్తే ప్రస్తుతం వస్తున్న అంతరాలను పరిష్కరించగలమని చెప్పారు. ఫలితంగా రైతాంగానికి మెరుగైన విద్యుత్తును అందించగలుగుతామని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో పెండింగ్ శాతం అధికంగా వుందని, ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్లు, నూతన కనెక్షన్లు ఇవ్వడంలో కొంత పెండింగ్ వుందని, దీన్ని పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఇపిడిసి ఎల్ పరిధిలో విశాఖ, కాకినాడలలో స్మార్ట్ మీటర్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని నర్సాపురం పరిధిలో లక్ష మందికి సోలార్ ఫ్యాన్లు అందించాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 28 వేల మందికి ఈ ఫ్యాన్లు అందించామని, రానున్న రెండు మూడు నెలల్లో లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. వినియోగదారులకు విద్యుత్ సేవలను అందించడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అయితే ఎక్కడైనా సమస్యలు వస్తే వినియోగదారులు టోల్‌ఫ్రీ నెంబర్ 1912కు తెలపవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఇక ఫ్రీ మాన్‌సూన్ పరిశీలన పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నిరంతర విద్యుత్ అందించడం ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్నదని, ఈ విషయంలో పూర్తిస్థాయి లక్ష్యసాధనకు అధికారులు, సిబ్బంది శ్రద్ద వహించాలని కోరారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన ఫిర్యాదులు వినియోగదారుల నుంచి వచ్చిన వెంటనే ఎ ఇలు తక్షణం స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు. నూతన గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను గడువు తేదీ లోగా విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే ఆగిపోయినా, కాలిపోయినా విద్యుత్ మీటర్లను పరిష్కరించడంలో జాప్యం లేకుండా పాడైన ట్రాన్స్‌ఫార్మర్లు, శాఖ విధించిన గడువు లోగా మార్పించి విద్యుత్తును అందించాలని ఆదేశించారు. ట్రాన్స్‌కో ఎస్ ఇ సిహెచ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, నూతన విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం చేపట్టడం వలన ఎదురయ్యే పర్యావరణ, సామాజిక ప్రభావాన్ని అంచనా వేసేందుకు, ఆ ప్రభావాన్ని కనిష్ట స్థాయిలు ఉంచేందుకు అవసరమైన ఉపశమన చర్యలు రూపొందించేందుకు ఇపిడిసి ఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 19న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంత ప్రజలు, భాగస్వాములు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాధికారులతో ఈ నెల 19న ఉదయం 9.30 గంటలకు జిల్లా విద్యుత్ కమిటీ ఛైర్మన్, ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.