పశ్చిమగోదావరి

వీడియో కాన్ఫరెన్సులకు రాకపోతే కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 17: పేదలు, కౌలురైతులకు రుణాలివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే బ్యాంకర్లను ఇక సహించేది లేదని, మండలస్ధాయి వీడియోకాన్ఫరెన్స్‌లకు బ్యాంకు అధికారులు రాకపోతే పోలీసు కేసు తప్పదని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్‌లో బుధవారం ప్రాధాన్యతారంగాల సమావేశంలో వివిధశాఖల ప్రగతితీరును ఆయన సమీక్షించారు. జిల్లాలో 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ప్రాధాన్యతారంగాలకు 12 వేల 775 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని బ్యాంకర్లు వార్షిక రుణప్రణాళికలో పేర్కొని ఇంతవరకు 2225 కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చారని ఆయన చెప్పారు. ఖరీఫ్‌పంటకాలంలో కౌలురైతులకు రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పధకాల అమలులో బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఏ బ్యాంకు ఎంత రుణం ఇచ్చిందో చెప్పకుండా ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడుపుతున్నారా అంటూ ప్రశ్నించారు. కౌలురైతులకు పంటరుణాలు అందించి వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకు అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశాలకు కొంతమంది బ్యాంకు అధికారులు రావటం లేదని, పోలీసు కేసు పెట్టి మీటింగ్‌కు వచ్చేలా చేసే పరిస్దితులు తెచ్చుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. లక్ష రూపాయలలోపు రుణాలు ఇవ్వడంలో ఎటువంటి హామీ అవసరం లేదన్న నిబంధనను ఖచ్చితంగా అమలుచేయాలన్నారు. జిల్లాలో రెండున్నర లక్షల హెక్టారులలో ఇ-ఎలక్ట్రానిక్ పంటల నమోదు కార్యక్రమాన్ని అమలుచేయాలని ఆదేశించినప్పటికీ కేవలం 19వేల హెక్టారులలో మాత్రమే దీన్ని అమలుచేయటం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు సేవలు అందించటంలో వ్యవసాయశాఖ చురుకుగా వ్యవహరించలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదేపరిస్దితి కొనసాగితే వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టరుపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ జెడి సాయిలక్ష్మిశ్వరి, మార్క్‌ఫెడ్ డిఎం నాగమల్లిక, నాబార్డు ఎజిఎం రామప్రభు, పశుసంవర్ధకశాఖ జెడి డాక్టరు జ్ఞానేశ్వర్, లీడ్‌బ్యాంకు మేనేజరు సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

500 అడుగుల పతాకంతో ప్రదర్శన

భీమవరం, ఆగస్టు 17: దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా యాత్రలో భాగంగా బుధవారం జివిఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 500 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని కళాశాల ప్రాంగణంలో ప్రదర్శించి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జివిఐటి చైర్మన్ గ్రంధి వెంకట్రావు మాట్లాడారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతి సమగ్రత, సమైక్యతలను పెంపొందించడానికి తిరంగా యాత్ర దోహదం చేస్తుందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గ్రంధి సురేష్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలతో ఏర్పడిన భారతావనికి విద్యార్థులు పునాదులు కావాలని ఆకాంక్షించారు. కళాశాల జాయింట్ సెక్రటరీ ఆరేటి కాశీ, డైరెక్టర్ అప్పారావు, ట్రెజరర్ గ్రంధి స్వప్న, ప్రిన్సిపల్ డాక్టర కెఎస్‌ఎన్. ప్రసాద్, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాస్కరరావు, పిడి చిక్కాల హరిమోహన్, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ ఎం. శ్యామ్ పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే చేలకు నీరందడం లేదు
యలమంచిలి, ఆగస్టు 17: యలమంచిలి మండలంలో వరిచేలకు నీరందక పోవడానికి కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యమేనని యలమంచిలి నీటి సంఘం అధ్యక్షుడు ఆరిమిల్లి రామ శ్రీనివాస్ అన్నారు. కొంతేరులో బుధవారం ‘ఆంధ్రభూమి’తో ఆయన మాట్లాడుతూ వరిచేలకు నీరందక పోవడానికి కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. దీనిపై నర్సాపురం డివిజన్ ఇరిగేషన్ డిఇ వెంకట నారాయణను వివరణ కోరగా ప్రతి ఏడాది సార్వాకు 60 శాతం గోదావరి నీరు సరఫరా అయితే 40 శాతం వర్షంపై ఆధారపడి రైతులు పంటలు పండిస్తారని, ప్రతి ఏడాది ఇలాగే జరుగుతోందని అన్నారు. అయితే ప్రస్తుతం వేసవిని తలపిస్తూ ఎండలు కాయడం వల్ల నీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ క్రమంలో శివారు భూములకు నీరందడం కష్టమవుతోందన్నారు. విజ్జేశ్వరం నుండి డెల్టా సాగుకు 7300 క్యూసెక్కుల నీరు విడుదలవుతోందని డిఇ తెలిపారు. ఆ నీరు లక్షా 50 వేల ఎకరాల వరి పంటకు సరఫరా అవుతుందన్నారు. దానిలో 2020 క్యూసెక్కుల నీరు పెరవలి మండలం కాకరపర్రు నుండి నర్సాపురం డివిజన్‌కు అందుతుందని చెప్పారు. అక్కడి నుండి ఉండి బ్యాంక్ కెనాల్, తాడేపల్లిగూడెం కెనాల్, తణుకు కెనాల్‌కు సరఫరా అవుతుందన్నారు. కాలువల్లో చెత్తా, తూడు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీటి సంఘాలదేనని డిఇ తెలిపారు.