పశ్చిమగోదావరి

రిజర్వేషన్లు సాధించుకునేవరకూ ఐక్యంగా సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగపాలెం, ఆగస్టు 19: రిజర్వేషన్లు సాధించే వరకూ కాపులంతా ఏకతాటిపై ముందుకుసాగాలని కాపు జెఎసి నేతలు పిలుపునిచ్చారు. లింగపాలెం మండలం రంగాపురంలో శుక్రవారం కాపు నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు జెఎసి నేతలు పలువురు మాట్లాడుతూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పదవుల కోసం ఉద్యమాలు చేయడంలేదని, కాపులందరికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించి భావితరాలకు రిజర్వేషన్ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఉద్యమిస్తున్నారన్నారు. ఈ దిశగా కాపు సామాజిక వర్గీయులంతా ముద్రగడ ఆశయాలకు అనుగుణంగా ఒకే మాటపై రిజర్వేషన్ వచ్చే వరకూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ వస్తేనే విద్యార్థులకు విద్యాపరంగా, ఉద్యోగ పరంగా భవిష్యత్తు ఉంటుందన్నారు. తమ హక్కుల సాధన కోసం యువకులు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా పార్టీలకతీతంగా రిజర్వేషన్ సాధించేందుకు ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కాపు సంఘ సమావేశాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ పది జిల్లాల్లో ఈ సమావేశాలు నిర్వహించామని, మిగిలిన జిల్లాల్లో వచ్చే నెల 7వ తేదీనాటికి పూర్తిచేస్తామన్నారు. సెప్టెంబర్ 11న రాజమహేంద్రవరంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. సిఎం చంద్రబాబు కాపులకు రిజర్వేషన్‌పై ఇచ్చిన హామీ సమయం పూర్తయిందని, రిజర్వేషన్ కల్పించకపోతే రాజమహేంద్రవరంలో జరిగే భారీ బహిరంగ సభలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో భారీసంఖ్యలో కాపులు ఉండగా, కేవలం కొద్ది మందికి మాత్రమే ఆంక్షలు విధిస్తూ రుణాలు అందజేశారని, ఈ విషయంలో కూడా పక్షపాత ధోరణి చూపించారని పలువురు జెఎసి నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా కాపులంతా ఐక్యంగా రిజర్వేషన్ల కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో జెఎసి జిల్లా నేతలు చినిమిల్లి వెంకట్రాయుడు, వి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, జెట్టి గుర్నాధం, ఆరేటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.