పశ్చిమగోదావరి

మహిళాశక్తిని చాటి చెప్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 23: క్రీడారంగంలో రాణిస్తున్న మహిళలు నేడు రియో ఒలింపిక్స్‌లో సైతం దేశ ప్రతిష్ఠను సింధు, సాక్షి రూపంలో ఇనుమడింప చేశారని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత అన్నారు. రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధును మంత్రి విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మంగళవారం అభినందించారు. సింధుకు పుష్పగుచ్ఛం అందజేసి, రాష్ట్ర మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని అభినందించినట్టు మంత్రి ఫోన్ ద్వారా ఇక్కడి విలేకరులకు తెలిపారు. సింధు విజయం అసాధారణమని, వచ్చే ఒలింపిక్స్‌లో ఆమె బంగారు పతకం గెలవాలని ఆకాంక్షిస్తున్నట్టు మంత్రి సుజాత చెప్పారు. సింధుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగిన రీతిని సత్కరించి, నగదు, స్థలం బహుమతులు అందజేశారని, దేశం యావత్తూ సింధును చూసి గర్వపడుతోందన్నారు. ఆమెకు తర్ఫీదునిచ్చిన గురువు పుల్లెల గోపీచంద్‌ను సైతం అభినందించినట్టు మంత్రి తెలిపారు.
నరసాపురం: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుని నరసాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాలసాయి అభినందించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న ఛైర్‌పర్సన్ రత్నమాలసాయి సింధుకి పుష్పగుచ్చం అందించి అభినందించారు.