పశ్చిమగోదావరి

త్వరలో జనసేన కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 28: పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన రాజకీయ పార్టీ రంగులు దిద్దుకోనుంది. ఇప్పటివరకు తాను ఒక్కడినే అంటూ చెప్పుకొచ్చిన పవర స్టార్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను జనసేన ఫోర్స్ రూపంలో జిల్లా కమిటీలను ఏర్పాటుచేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే జిల్లా కమిటీల నియామకంలో కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. దేశభక్తి కలిగి ఉండి, రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. సాధ్యమైనంత వరకు కొత్త ముఖాలను 13 జిల్లాల్లోను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. తిరుపతి సభ సక్సెస్ కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ గురించి ఇప్పటికే అనేక చర్చలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 9న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సభను ఏర్పాటుచేయనున్నట్టు పవర్‌స్టార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లోపే గోదావరి జిల్లాలో కమిటీలను పూర్తిస్థాయిలో నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా జిల్లా స్థాయిలో కమిటీలను నియమించాలని జనసేన భావిస్తున్నట్టు సమాచారం. కాగా జిల్లా సారధ్య బాధ్యతల కోసం ఇప్పటికే ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం మీద జిల్లాల వారీగా కమిటీలు పూర్తిచేసుకున్న వెంటనే నియోజకవర్గాల వారీగా కూడా కమిటీలను నియమించే అవకాశాలున్నాయి.

పర్మిట్ లేని రెండు ప్రైవేటు బస్సులు సీజ్
-వెంటాడి పట్టకున్న రవాణా శాఖ అధికారులు
జీలుగుమిల్లి, ఆగస్టు 28: పర్మిట్ లేకుండా హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం వెడుతున్న రెండు ప్రైవేటు బస్సులను ఆదివారం రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. స్థానిక రవాణా శాఖ రాష్ట్ర సరిహద్ధు చెక్‌పోస్టు వద్ద అధికారులు నిలుపుదల చేయమన్నా ఆపకుండా దూసుకు పోవడంతో జీలుగుమిల్లి నుండి చెక్‌పోస్టు అధికారులు కారులో వెంబడించి దర్భగూడెం సమీపంలో బస్సులను నిలువరించారు. బస్సుల్లో రికార్డులు తనిఖీ చేయగా రాష్ట్రంలోకి రావడానికి పర్మిట్ లేదని తేలిందని ఆర్టీవో కెవి సుబ్బారావు తెలిపారు. ప్రభుత్వ అనుమతికి మించి ఒక్కొక్క బస్సులో నాలుగు సీట్లు అదనంగా ఉన్నాయన్నారు. పర్మిట్ లేకుండా నడుపుతున్న ఈ బస్సులకు నాలుగు లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. బస్సులు స్వాధీనం చేసుకున్న సమయంలో ప్రయాణీకులను ఆర్టీసీ బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చినట్టు తెలిపారు. చెక్‌పోస్టు వద్ద సిబ్బందిని ఖాతరు చేయకుండా ముందుకు దూసుకు పోవడంపై కూడ కేసు నమోదు చేశారు. వెంబడించి బస్సులను నిలుపుదల చేసిన వారిలో జీలుగుమిల్లి చెక్‌పోస్టు అధికారులు పిజె సురేష్‌కుమార్, ఉమామహేశ్వరరావు, కెవి ప్రభాకర్, రాము ఉన్నారు. వీరిని ఆర్టీవో సుబ్బారావు అభినందించారు.
త్వరలో 20 వేల ఉద్యోగాల భర్తీ
ఏలూరు, ఆగస్టు 28 : ప్రభుత్వంపై యువత ఎన్నో ఆశలు పెట్టుకుందని, వారి ఆశలకు అనుగుణంగా త్వరలో 20 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంధాలయం ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల పరీక్షలు రాసే యువతకు 45 రోజులపాటు నిర్వహించే ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని గ్రంధాలయంలో ఆదివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గత రెండేళ్లలో 13500 అంగన్‌వాడీ ఉద్యోగులను భర్తీచేశామని, వారికి ఇస్తున్న గౌరవ వేతనాన్ని కూడా పెంపుచేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 20 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసిందని, దశల వారీగా అన్ని ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. శిక్షణలో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరూ కష్టపడి చదవాలని సూచించారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం బిటెక్, పిహెచ్‌డి చేసిన వారు కూడా పోటీ పడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగాలపై యువతలో ఎంతో మక్కువవుందని అర్ధమవుతోందన్నారు. జిల్లాలోని గ్రంధాలయం కంప్యూటరీకరించి భావితరాలకు సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచే నూతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ జయవరపు శ్రీరామమూర్తిని ఆమె అభినందించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రధమంగా నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ జయవరపు శ్రీరామమూర్తి, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, మాగంటి రాంజీ తదితరులు పాల్గొన్నారు.
శ్మశానాన్ని అభివృద్ధి చేయండి
వీరవాసరం, ఆగస్టు 28: వీరవాసరం హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని గ్రామస్థులు ఆదివారం ఉదయం వీరవాసరం నుంచి ఎమ్మెల్యే ఇంటికి పాదయాత్రగా పయనమయ్యారు. భీమవరంలో ఎమ్మెల్యే ఇంటి వరకు ఈ పాదయాత్ర సాగింది. వీరవాసరం గ్రామానికి చెందిన పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు పట్టణంలో లేకపోవడంతో ఆమె సతీమణి సత్యవాణికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న నక్కెళ్ల శివరామకృష్ణ, రెడ్డి రాంబాబు, వేండ్ర దివాకర్, రొంగలి చిన అప్పన్న మాట్లాడారు. ఎంతోకాలంగా శ్మశాన సమస్యపై గ్రామ పంచాయతీ పట్టించుకోవడం లేదని, దీంతో ఎమ్మెల్యే రామాంజనేయులు తానే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ హామీని గుర్తుచేయడానికి భీమవరం వచ్చామని, ఎమ్మెల్యే సతీమణికి చెప్పామన్నారు. వీరవాసరంలో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పాదయాత్రకు గ్రామస్థులు భారీగా మద్దతు పలికారు.