పశ్చిమగోదావరి

అన్నవరప్పాడు ఆలయంలో హుండీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి, సెప్టెంబర్ 4: అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి దొంగలు హుండీని ఎత్తుకెళ్ళిన సంఘటన కలకలం రేపింది. ఆలయంలో అమర్చిన సిసి కెమెరాలో దొంగతనం జరిగిన తీరు నమోదైంది. జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ ఆలయంలో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట నుండి రెండు గంటల సమయంలో ముఖానికి మాస్కు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి కటకటాల తాళం పగలకొట్టి లోపలకు ప్రవేశించాడు. ఆలయంలో ప్రధాన డిబ్బీ కాకుండా, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరో డిబ్బీకి ఉన్న గొలుసులను తప్పించి బయటకు ఎత్తుకెళ్ళాడు. ఈ సంఘటణ సిసి కెమెరాలో రికార్డు అయింది. ఎత్తుకెళ్ళిన డిబ్బీని పొలాల్లోకి తీసుకెళ్లి దానిని పగలకొట్టి నగదు తీసుకెళ్లాడు. ఇక్కడ వాచ్‌మేన్ కూడ ఉన్నాడు. లోపల అలికిడి కావడంతో సహాయం కోసం పక్కనున్న వారిని పిలవడానికి వెళ్ళినట్లు వాచ్‌మేన్ చెపుతున్నాడు. లోపలికి వెళ్ళింది ఒక వ్యక్తి అయినప్పటికీ బయట మోటారు సైకిల్‌పై మరో వ్యక్తి ఉన్నట్లు చెపుతున్నారు. ఎస్సై పేరూరి నాగరాజు సంఘటనా స్థలాన్ని, వీడియో పుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.