పశ్చిమగోదావరి

చదువు కావాలంటే చాకిరీ చేయాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, సెప్టెంబర్ 8: మండలంలోని కాజ, పెచ్చెట్టిమెరక ప్రాథమిక పాఠశాలలు, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు చదువుతోపాటు చాకిరీ కూడా చేయాల్సివస్తోంది.ఉదయమే విద్యార్థులు పాఠశాలలకు రాగానే వారిచేత తరగతి గదులు తుడిపించడం, చెత్త ఎత్తించడం చేయస్తున్నారు. మధ్యాహ్న భోజనం తిన్నతర్వాత కిందపడిన మెతుకులను కూడా తమతో తుడిపిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలకు చదువుకునేందుకు వెళ్లే తమ పిల్లలతో ఇటువంటి పనులు చేయించడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులని పదేపదే ప్రజాప్రతినిధులు ఉపన్యాసాల్లో చెబుతుంటారు. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుందంటారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు నిధులు మంజూరవుతున్నా విద్యార్థులచే ఈ పనులు చేయించడం పట్ల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులచే ఇటువంటి వెట్టిచాకిరీ పనులు చేయించకుండా చక్కగా విద్యాబోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.