పశ్చిమగోదావరి

రాష్ట్భ్రావృద్ధే బిజెపి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవగాహనారాహిత్యంతో విపక్షాల విమర్శలు:బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా
ఏలూరు, సెప్టెంబర్ 12 : రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కృషిచేస్తుంటే ప్రతిపక్షాలు అవగాహనా రాహిత్యంతో విమర్శలుచేయడం సరికాదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీపై అవగాహన కలిగించేందుకు సదస్సును నిర్వహిస్తామన్నారు. స్థానిక టుబాకో మర్చంట్స్ హాలులో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాయల తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని విడదీయాలని చూసిందన్నారు. కడప, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటుచేసే ఆలోచన తీసుకువచ్చారన్నారు. దీన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణలోకి వెళ్లిపోతుందని, దీనితో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు జరిగే అవకాశం వుందని హెచ్చరించామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా బిజెపి రాష్ట్భ్రావృద్ధి కోసమే కృషి చేసిందన్నారు. ఇప్పటికే దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగి వున్నా ఆ రాష్ట్రాలు చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించలేదన్నారు. హోదాతో ప్రయోజనం ఉండదు కాబట్టే రాష్ట్రానికి రూ.2.25 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిందన్నారు. రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి సంతోషం వ్యక్తంచేస్తోందన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇది సరైన పద్దతి కాదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సైతం ప్యాకేజీని ప్రశంసించేలా అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగి వున్నప్పటికీ సాధించలేదని, ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని సిపిఐ పలుసార్లు కోరిందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్యాకేజీ వద్దు హోదాయే కావాలంటూ ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు హోదా కోసం చేస్తున్న ఉద్యమాలు కేవలం రాజకీయ లబ్ధికోసమే చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్యాకేజీ వల్ల కలిగే లాభాలు, హోదా వల్ల జరిగే నష్టాలను వారికి తెలిపేందుకు త్వరలోనే అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, నాయకులు ముద్దాని దుర్గారావు, కత్తి రాము, నాగం శివ, భీమవరపు సుబ్రహ్మణ్యం, అర్జున మురళీ, నెరుసు నెలరాజు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ అర్జీలన్నీ
రేపటికి పరిష్కరించాలి
సకాలంలో పరిష్కరించని వాటికి రూ.100 చొప్పున జరిమానా:కలెక్టర్ భాస్కర్
ఏలూరు, సెప్టెంబర్ 12: మీ-సేవా, మీ-కోసంలో ఉన్న పెండింగ్ అర్జీలన్నీ ఈ నెల 14వ తేదీ బుధవారం జరిగే జిల్లాస్థాయి ప్రాధాన్యతారంగాల సమావేశం నాటికి పరిష్కరించవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, జలవనరుల శాఖ, భూగర్భ జలాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఎపి ట్రాన్స్‌కో, పరిశ్రమలు, వాణిజ్యం, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, తూనికలు కొలతలు శాఖ, విద్యాశాఖ, సర్వే వారి పెండింగ్ దరఖాస్తులు ప్రతీ వారం సమీక్షించినా కూడా అధికారులు అలసత్వం వలన పరిష్కరించట్లేదన్నారు. సకాలంలో అర్జీలను పరిష్కరించకపోతే అర్జీకి వంద రూపాయలు చొప్పున అపరాధ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా పౌరసరఫరాలలో 880, ఇపిడిసిఎల్‌లో 420, ఇండస్ట్రీస్ 88, ఫిషరీస్ 52, మెడికల్ అండ్ హెల్త్ 46, అగ్రికల్చర్ 24 దరఖాస్తులున్నాయని వారు ప్రాధాన్యతారంగాల సమావేశం జరిగే నాటికి పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ప్రతీ వారం మీ-కోసంలో వచ్చే దరఖాస్తులు పరిష్కరించట్లేదని వచ్చే వారం కల్లా పరిష్కరించకపోతే డిప్యూటీ రిజిస్ట్రార్ మీద చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌ను సమీక్షిస్తూ 75 శాతం కన్నా తక్కువ వున్న శాఖలన్నీ కూడా వచ్చేవారం కల్లా పూర్తిస్థాయి అటెండెన్స్ వారి సిబ్బందితో వేయించేటట్లుగా చర్యలుచేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాస్, డి ఆర్‌డి ఎ పిడి కె శ్రీనివాసులు, డ్వామా పిడి వెంకటరమణ, అగ్రికల్చర్ జెడి సాయి లక్ష్మీశ్వరి, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ జ్ఞానేశ్వర్, హౌసింగ్ పిడి శ్రీనివాస్, జడ్పీ సిఇవో డి సత్యనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్‌వి సూర్యనారాయణ, డిఎంహెచ్‌ఓ డాక్టర్ కోటేశ్వరి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

శివారు భూములకూ నీరందాలి
అధికారులకు కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, సెప్టెంబర్ 12 : జిల్లాలో వేసిన పంటలను కాపాడుకునేందుకు శివారు భూములకు కూడా సాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో సోమవారం మీ-కోసం కార్యక్రమం సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధితాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క రైతూ సాగునీటికోసం ఇబ్బందులు పడడానికి వీలులేదని అధికారుల దృష్టికి సాగునీటి సమస్య ఏ ఒక్క రైతూ తీసుకువచ్చినా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గోపాలపురం మండలం కరగపాడు గ్రామానికి చెందిన పినెళ్లి ధర్మయ్య, తానేటి వెంకటరత్నం, ఐనపర్తి దుర్గారావు మరికొంతమంది కలెక్టరుకు ఫిర్యాదుచేస్తూ గ్రామంలో ఎకరం 8.52 సెంట్లు భూమిని ఎనిమిది మంది ఎస్‌సి కులస్థులకు పట్టాలిచ్చారని ఇంతవరకూ భూమిని సర్వేచేసి ఇవ్వలేదన్నారు. కొంతమంది ఆ భూమిని ఆక్రమించుకుని తమను సాగుచేసుకోకుండా దౌర్జన్యం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గోపాలపురం తహశీల్దార్‌ను ఆదేశించారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన సిద్దిగని నాగేశ్వరరావు, వంకా శ్రీను, ఈలి లక్ష్మయ్య, మరికొంతమంది కలెక్టరుకు వినతిపత్రం సమర్పిస్తూ తమ గ్రామంలో నివాసాలమధ్య కొంతమంది పందులు పెంపకం చేస్తూ చుట్టుపక్కల హోటళ్ల నుండి తీసుకువచ్చిన వ్యర్ధాలు మేతగా వేయడం వలన దుర్వాసనతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అపారిశుద్ధ్యంవల్ల డెంగ్యూ, మలేరియా రోగాలతో పిల్లలు, వృద్ధులు ఆసుపత్రి పాలవుతున్నారని కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై కలెక్టర్ స్పందిస్తూ స్వయంగా పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిపివోను ఆదేశించారు